శ్రీకాకుళం

కొనసాగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, నవంబర్ 18: తిత్లీ తుఫాన్ సందర్భంలో అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి పునరుద్ధరణ పనులు నేటికి కొనసాగుతున్నాయి. గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినప్పటికి మండలంలో గల నవతల, సారవకోట సబ్‌స్టేషన్‌లకు విద్యుత్ సరఫరా చేసే లైన్లను ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. సారవకోటనుండి నవతల సబ్‌స్టేషన్‌కు అదేవిధంగా నవతల నుండి పాతపట్నం వరకు గల విద్యుత్ లైన్‌లు పంటపొలాల్లో ఉన్నాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పంట పొలాల్లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించడం కష్టమని తిత్లీ తుఫన్ సమయంలో గమనించిన విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. సారవకోట నుండి పాతపట్నం వరకు 20 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారికి ఆనుకొని నూతనంగా విద్యుత్ స్తంభాలు నాటి పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. దీనివలన విపత్తులు సంభవించినప్పుడు జాప్యం లేకుండా త్వరతగతిన విద్యుత్ సరఫరా చేయడానికి అవకాశం వుంటుందని విద్యుత్‌శాఖ అధికారులు భావిస్తున్నారు.

నేటినుంచి సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు
పొందూరు, నవంబర్ 18: ఆధ్యాత్మిక పరిడివిల్లి భగవాన్ శ్రీసత్యసాయి బాబావారి 93వ జన్మదినోత్సవ వేడుకలు మండలంలో నేటినుంచే వైభవంగా నిర్వహిస్తున్నారు. పొందూరు మేజర్ పంచాయతీలో గల సత్యసాయి మందిరంలో సత్యసేవాసమితి కన్వీనర్ పెన్నం నానాజీ ఆధ్వర్యంలో ఓంకార సుప్రభాతం, నగరకీర్తనలతో నిత్యపూజలు అందుకుంటున్న సాయిమందిరంలో మహిళలచే 93జ్యోతి ప్రజ్వలన శ్రీసత్యసాయి భక్తి సంగీత విభావరి అనంతరం హారతి, విభూతి, ప్రసాదాలతో 22 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం మహిళాదినోత్సవాలు, అదేవిధంగా మంగళవారం యువజనదినోత్సవాలు, బుధవారం బాలవికాస దినోత్సవాలు, గురువారం సేవాదళ్ దినోత్సవాలతో వైభవంగా స్వామిని వేడుకగా పూజిస్తుంటారు. సాయి భక్తులు విరివిగా హాజరై స్వామినామ కృపతో ప్రతీ ఇంట అష్టైశ్వరాలు కలగాలని వేదపండితులు మంత్రోచ్ఛరణలతో పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భకులు హాజరై విజయవంతం చేయాలని వారు తెలిపారు.

.........

తోటల్లో పికినిక్ సందడి
పొందూరు, నవంబర్ 18: కార్తీక పర్వదినాన్ని పురష్కరించుకొని మండలంలో పలుచోట్ల పికినిక్ సందడిలు వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఉసిరిక చెట్టును దైవంగా పూజిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. కులమత బేధ తారతమ్యం లేకుండా అందరూ ఒక్కటే అని చాటిచెప్పే రీతిలో యువకులు, పెద్దలు, పిల్లలు సందడిగా ఆనందోత్సవాలతో పికినిక్‌లను జరుపుకొని విందులో పాల్గొంటున్నారు. ఆదివారం శలవు దినం కారణంగా ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ పనులకు సెలవుదినం కావడంతో పచ్చని తోటల్లో చక్కని అనుభూతితో పిక్నిక్ సందడి కన్పిస్తుంది. స్థానిక యంగ్‌స్టార్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరామ్‌నగర్ కాలనీకి సమీపంలో గల మాడుగుల కృష్ణారావు మామిడి తోటలో వేలాదిమంది సభ్యులుగా పిక్నిక్ సందడి అందరికి ఆనందాన్ని కల్గించింది. ఒకవైపు పసందైన విందు, మరోవైపు కళాకారుల భక్తిగీతాలు పురాతన వైభవాన్ని తలపించే చక్కని పాటలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో యంగ్‌స్టార్ యూత్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఆచంట విజయకుమార్, యూత్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు కాలపూరిశాంతారాం, అనకాపల్లి అక్కలనాయుడు, అధ్యక్షులు రాంబాబు వచ్చే ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ వైభవంగా పిక్నిక్ సందడి నెలకొంది. వందలాది సంవత్సరంలుగా సేవలందించే యంగ్‌స్టార్ యూత్ క్లబ్ సేవాకార్యక్రమాన్ని మరింత రెట్టింపుచేసి ప్రజాసేవ చేయాలని కోరుతూ యూత్‌క్లబ్‌కు ఆర్థిక సహాయార్థంగా రాష్ట్ర జెన్‌కోహెచ్ ఆర్ డైరక్టర్ భాషా ఆనందమోహన్ రూ.20వేలు ను కార్యక్రమాల అభివృద్ధికి అందించారు.

..................

అహ్లాదంగా ఆనంద ఆదివారం
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 18: స్థానిక అరసవిల్లి కూడలి వద్ద గల 80 అడుగుల రోడ్డులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హేపీ సండే ( ఆనంద ఆదివారం) కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమాలు శివరాజేశ్వరి భక్తి గీతాలతో ప్రారంభమయ్యాయి. అనంతరం సుధీర్ మాస్టార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సందేశాత్మక ప్రదర్శన ఆహుతులకు ఎంతగానో అలరించింది. యోగిత, లిఖిత దేశభక్తిని చాటుతూ చేసిన శాస్ర్తియ నృత్యాలు శివ మాస్టారు ఆధ్వర్యంలో జోష్ డాన్స్, వెస్టర్న్ డాన్స్‌లు, నాగిని డాన్స్‌లు ప్రదర్శించిన ఫోక్ డాన్స్‌లు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రిటైర్డ్ ఎస్‌బి ఐ మేనేజర్ షణ్ముఖరావు,తనుశ్రీ జంట నృత్యం ప్రేక్షకులను ఎంతగానోఉర్రూతలూగించి ఈ ఆనంద ఆదివారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అర్బన్ ప్లానర్ సంతోష్‌కుమార్, బెహరా మనోవికాస కేంద్ర సంరక్షకులు విజయభాస్కర్, శ్యామల, వెంకటలక్ష్మీ, లింగరాజు, మోహనకృష్ణ, సూరీడు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

........

ఘనంగా మహా అన్నదానం
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 18: కార్తీక మాసం ఏకాదశి పుణ్యదిన సందర్భంగా ఆదివారం అరసవిల్లి శ్రీసాయి మణికంఠ అయ్యప్ప సన్నిదానంలో మహా అన్నదాన సంతర్పణ జరిగింది. గురుస్వామి బట్న శ్రీనివాసస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 2వేలు మంది మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముసలినాయుడు స్వామి, లక్ష్మీనారాయణస్వామి, జ్యోతి భాస్కర స్వామి, చంద్రశేఖర స్వామి తదితరులు పాల్గొన్నారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని సన్నిదాన స్వాములు సహకారంతో అయ్యప్పస్వామి ప్రీత్యర్ధం నిర్వహించారు.

తిత్లీ బాధితులకు కనకమహాలక్ష్మీకోపరేటివ్ బ్యాంక్ విరాళం
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 18: ఇటీవల జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాన్ బాధితులకు సహాయాన్ని అందించేందుకు మహాలక్ష్మీ కోపరేటివ్ బ్యాంక్ పాలక వర్గం, సిబ్బంది ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేశారు. బ్యాంక్ వారు అందజేసిన ఈ మొత్తం రూ.5లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా బ్యాంక్ అధ్యక్షులు రఘనాధరావు, బ్యాంక్ సి ఈవో అమరావతి క్యాంప్ కార్యాలయం నందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు.

..........

సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించడం సరికాదు
* ఏబివిపి జిల్లా కార్యదర్శి శ్రీకాంత్
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 18: నగరంలోని పలు కళాశాలలు సెలవుదినాల్లో కూడా ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయకుండా తరగతులు నిర్వహిస్తున్నాయని, ఇది ఏ మాత్రం సరికాదని అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా సంఘటన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. ఆదివారం నగరంలోని నారాయణ, శాంతినికేతన్ కళాశాలలకు వారు వెళ్లి పరిశీలించగా అక్కడ విద్యార్థులకు క్లాస్‌లు నిర్వహిస్తున్నట్లు వారు గమనించారు. ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు సెలవు రోజుల్లోకూడా కళాశాల యాజమాన్యం మాకు సెలవులు ఇవ్వడం లేదని వీరికి ఫిర్యాదు చేశారు. సెలవు రోజుల్లో కూడా తరగతులు పెట్టడం వలన విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని జిల్లా కన్వీనర్ ఎమ్.సత్యన్నారాయణ అన్నారు. విద్యార్థులకు పరీక్షలు పేరిట సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహించడం సరికాదని, ఆదివారం తరగతులు నిర్వహించిన ప్రతీ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ కళాశాల యొక్క గుర్తింపును రద్దుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కె.మధు, వెంకటేశ్, కృష్ణ, జిల్లా కన్వీనర్ ఎమ్.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.