శ్రీకాకుళం

నిరంతరం వేధిస్తున్న సమస్యల పట్ల నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 18:నిరంతరం ప్రజలను వేధిస్తున్న సమస్యల పట్ల పాలకులు నిర్లక్ష్య వైఖరిని అవలింబిస్తున్నారని రైతుకూలీ సంఘం నాయకులు, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ పి.జస్వంత్‌రావుపేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు-పాలకుల వైఖరి అనే అంశంపై ఆదివారం స్థానిక బాపూజీ కళామందిరంలో ఉత్తరాంధ్ర సదస్సును రైతుకూలీ సంఘం ( ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీచ్‌సేండ్‌ను విదేశీ కంపెనీలకు ఇచ్చేస్తున్నారని దీనివలన తుఫాన్‌లు ఉధృతం అవుతున్నాయన్నారు. దివి ఉప్పెన నుండి నేటి తిత్లీ తుఫాన్ వరకు పాలకులు అనుసరిస్తున్న విధానాల గూర్చి వివరిస్తూ తుఫాన్ మ్యాన్యువల్, కరువు మ్యాన్యువల్‌ను విపత్తుల కాలంలో సహాయక చర్యల విదానాలు ఎలావుండాలో రాసుకోవడం జరిగిందని, అయితే ఈ ముఖ్యమంత్రులు, కలెక్టర్‌లుకు ఆవిధానాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. శ్రీకాకుళం- ఇచ్ఛాపురం నుండి నెల్లూరు- తడ వరకు తీర ప్రాంత భూమిని తవ్వేస్తున్నారని, దీనితో పర్యావరణంలో గతితప్పి రసాయన పరిశ్రమల వల్ల, ధర్మల్ విద్యుత్ పరిశ్రమల వల్ల సముద్రం కలుషితమైపోయి కల్లోలం అవుతుందన్నారు. పాలకులు తమ దోపిడి ప్రయోజనాల కోసం చూస్తున్నారే తప్ప ప్రజల కోసం ఆలోచించడం లేదని అన్నారు. గతంలో విపత్తులు సంభవించినప్పుడు ఆ మొత్తాన్ని వినియోగించేందుకు సర్‌ఛార్జ్ కింద 5శాతాన్ని వసూలు చేసేవారని, ప్రస్తుతం జి ఎస్టీతో దానిని పూర్తిగా తీసేసారని పేర్కొన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు ఇచ్చే పరిహారం ఇదేనా అని అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ను నిలదీశారని, ప్రస్తుతం మోదీ దానిని పూర్తిగా తీసేసారని పేర్కొన్నారు. పాలకుల వైఖరికి వ్యితిరేకంగా, సంఘటితంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రైతుకూలి సంఘం( ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ వచ్చాక 4,5రోజులు భోజనాల హాడావుడి తప్ప రాష్ట్రం- కేంద్రాన్ని, కేంద్రం - రాష్ట్రాన్ని పాలక ప్రతిపక్షాలు నిందారోపణలు తప్ప తుఫాన్ వచ్చేముందు సహాయక చర్యలు, వచ్చాక సహాయకచర్యలు, తాత్కాలిక, శాశ్వత చర్యల కోసం సర్వేలు చేయడం జరగలేదని పేర్కొన్నారు. సాంకేతిక విధానాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. బహుళజాతి విదేశీ సంస్థలకు భూములను దారాదత్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రకృతినుండి నష్టాలను, కష్టాలను ప్రజల నెత్తిన రుద్ది సంపదలతో ప్రయోజనాలను ధనిక వర్గాలకు చెందిన విదేశీ కంపెనీలు అనుభవిస్తున్నాయన్నారు. ప్రజల తాగునీరు-సాగునీరు, తీర ప్రాంతం-పంటభూములు- ఆరోగ్యాలు పట్టని బాద్యతలేని పాలకులకు ప్రకృతివైపరీత్యాలు పెట్టుబడులవుతున్నాయని అన్నారు. ఈ కష్టాలకు -నష్టాలకు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రైతుకూలి సంఘం ( ఆంధ్రప్రదేశ్) జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ బాధిత ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చామన్నారు. వరుస తుఫాన్‌లకు కారణాలు చెప్పామన్నారు. పాలకుల ఎన్నికల ప్రయోజనాలకు విపత్తులను వాడుకోవడం పై జనాన్ని చైతన్యపరిచామని తెలియజేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల సేవల్లోనే అధికారులు మునిగి ఉన్నారే తప్ప ప్రజల సహాయక చర్యల్లో కాదని వివరించారు. సదస్సులో ఏపిటి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్, ఏఐ ఎఫ్‌టియు (న్యూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.గణేష్‌పండా, రైతుకూలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా కళాకారులు పలు గీతాలను ఆలపించారు.

........
................

మల్లేశ్వర స్వామికి పుష్పాలంకరణ సేవ
సారవకోట, నవంబర్ 18: మండలంలోని అవలంగి గ్రామంలో గల మల్లేశ్వర స్వామి ఆలయంలో పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ కార్యక్రమాన్ని స్థానిక భక్తులు చూడముచ్చటగా నిర్వహించారు. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా మల్లేశ్వరస్వామికి ఇష్టమైన బంతిపూలతో పుష్పాలంకరణ సేవ నిర్వహించినట్లు వీరు తెలిపారు. సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు, అదే సమయంలో పుష్పాలతో అధికంగా పూజలు చేస్తామని వీరు స్పష్టం చేశారు.