శ్రీకాకుళం

మా గోడు మీకు పట్టదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, నవంబర్ 20: తిత్లీ తుపాన్ విలయానికి సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ మా గోడు అధికారులకు పట్టడం లేదని, తుపాన్ వచ్చి సుమారు 40 రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించడం లేదని రైతులు రామ్మోహనరావు, ఎర్రయ్య, కృష్ణారావులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసారు. మంగళవారం రైతులు ఉద్యానవనశాఖ సిబ్బంది తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉద్యానవనశాఖ అధికారులు కోసం నిత్యం కార్యాలయానికి వచ్చిన తాళం దర్శనం ఇస్తుందని, అధికారులు అందుబాటులో లేకపోవడంతో తమ తోటల నష్టాల వివరాలను నమోదు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నామన్నారు. ఉద్యానవనశాఖ సిబ్బందిని ఫోన్‌లో సంప్రదించినా ఇదిగో వస్తాం, అదిగో వస్తామని చెబుతున్నారు తప్పితే తమ వివరాలు నమోదు చేసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజనులు అంటే అధికారులకు అలుసు అని, తోటలు కోల్పోయి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే అధికారులు సైతం తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయారు. నష్టపరిహారాన్ని వారం రోజుల్లో అందిస్తామని సాక్షాత్తూ సీ ఎం చెప్పినా బాధితరైతులు పట్టించుకోవడం లేదని, అధికారుల తీరు మార్చుకోకపోతే గిరిజనుల సత్తా చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో పోలయ్య, కైలాసరావు, చిన్నమ్మ, గౌరమ్మ, పోతయ్య, వరహాలమ్మ, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

తిత్లీ తుపాన్ బాధితులకు సుశృతి నర్శింగ్‌హోమ్ సహాయం
పలాస, నవంబర్ 20: తిత్లీ తుపాన్ బాధితులకు బ్రాహ్మణతర్లాలో సుశృతి నర్శింగ్ హోమ్ అధినేత దంతం బీమారావు సుమారు 50 వేల రూపాయలు విలువ చేసే రేకులు, నగదును మంగళవారం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు రేకులు ఎగిరిపోయి పలువురు నీడ లేక మొండిగోడల మధ్య నివశిస్తున్నారని, వారు పడుతున్న వెతలు తనకు ఆందోళన కలిగించిందన్నారు. సహాయం చేసేందుకు తన వంతుగా రేకులు అందజేసి వాటికి అయ్యేఖర్చును నగదు రూపంలో అందించామన్నారు. బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ సహాయం చేస్తే బాధితుల కష్టాలను తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు పైల వెంకటరావు(చిట్టి), దంతం వైకుంఠరావు, టి.రామయ్య తదితరులు పాల్గొన్నారు.

జనసేన ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
పలాస, నవంబర్ 20: పలాస మున్సిపాలిటీలోని 12,22,24 వార్డుల్లోని హరిజనవీధిలో తిత్లీ తుపాన్ బాధితులకు మంగళవారం జనసేన పార్టీ నాయకులు కోత పూర్ణచంద్రరావు దుప్పట్లును పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిత్లీ తుపాన్‌తో ప్రజలు నిరాశ్రయులుగా మారారని, కట్టుబట్టలతో రోడ్డునపడ్డారని, వారిని ఆదుకోవడం మానవత్వమన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎంతో సహృదయంతో బాధితులను ఏదో విధంగా ఆదుకోవాలని పిలుపు ఇవ్వడంతో జనసేన పార్టీ నాయకులు బాధితులకు తమ వంతుగా సహాయం అందిస్తూ తామున్నామని భరోసా కల్పిస్తున్నామన్నారు. బాధితులు నిరాశ చెందవద్దు అని, జనసేన అధికారంలోకి వచ్చిన బాధితులకు న్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోత అరుణకుమారి, మర్రి రోజా, ఎస్.మోహనరావు, రేవతి, పాతాళ ముకుంద, జనసేన నాయకులు బల్ల శ్రీనివాస్, సవర సుమన్, ఆశ, కె.కృష్ణారావు, సునీల్, కిషోర్, కాశీ, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.