శ్రీకాకుళం

కొంచాడలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, నవంబర్ 20: మండలం గుల్లకొంచాడ గ్రామంలో కార్తీక మాస దీపం అగ్ని బాధిత కుటుంబాల కూలీలకు గొల్లుమంటూ పొలాల్లో పరుగులు తీయించింది. గ్రామంలో యాదవ కులస్థులంతా కూలి కోసం పొలం పనులకు వెళ్లే సమయంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు హఠాత్తుగా ఒక ఇంటిపై మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఒకే వాసలో పది పూరిళ్లు ఘోరంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 9లక్షల పైబడి ఆస్థినష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. అగ్ని ప్రమాదంలో గందబాన రాంబాబు, అలబాన రమణ, పల్ల అప్పలసూరమ్మ, పల్ల సూర్యనారాయణ, ముగడ గణపతి, దువ్వ సూరయ్య, అలబాన గడ్డయ్య, పల్ల ఆదిలక్ష్మి, చిన్ని సూరిడమ్మ, పల్ల సింహాచలంకు చెందిన పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. పలు ఇళ్లల్లో గ్యాస్ బండలు ఉండడంతో ప్రజలు భయాందోళన చెంది ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనతో పరుగులు తీశారు. బాధితుల కుటుంబీకులంతా కూలిపని చేసి బతుకుజీవనం సాగిస్తున్నవారే. పల్ల ఆదిలక్ష్మి ఇంటిలో రూ.50వేలు కాలి బూడిదయ్యింది. చిన్ని సూరిడమ్మ ఇంటిలో మూడు తులాల బంగారు వస్తువులు కాలి ముద్దయింది. అందరూ కూలి పనుల్లో నిమగ్నమయిన సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఇంటిలో వుండే ఏ వస్తువు తీయలేని పరిస్థితి ఏర్పడింది. కట్టుబట్టలు తప్ప బాధితులకు ఏమీ మిగుల్చుకోలేని పరిస్థితి దాపురించింది. తిండి గింజలు, ఆధార్, రేషన్‌కార్డులు, భూమియొక్క దస్తావేజుల స్టాంపులు, పిల్లలు చదువుకునే సర్ట్ఫికెట్లు సైతం మంటల్లో మాడి మసయ్యాయి. వీదురు గాలులు తోడై శరవేగంగా మంటలు చెలరేగాయి. కార్తీకమాసం దీపం వల్లే అగ్ని ప్రమాదం జరిగివుండవచ్చని గ్రామస్థులు చెబుతున్నారు. స్థానిక అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలు అదుపుచేయడంతో సద్దుమణిగింది. సర్వం కోల్పోయి రోడ్లు పాలైన బాధిత కుటుంబీకులు ఘోషించిన ఘోష చూపరులకు గుండె తరుముకుపోయింది. తహశీల్దార్ దిలీప్ చక్రవర్తి, ఆర్ ఐ ఈశ్వరరావు, వి ఆర్వో ఇంద్రుడు చేరుకొని ఆస్థినష్టానిన అంచనా వేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి రూ.5వేలు, పదికేజీల బియ్యాన్ని అందిస్తున్నారు.

ఘనంగా క్షీరాబ్ధి ద్వాదశి
శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 20: కార్తీక శుద్ధ ద్వాదశి పర్వదినం సందర్భంగా నగరంలోని పలు దేవాలయాల్లో క్షీరాబ్ధి ద్వాదశి పూజలు నిర్వహించారు. శివకేశవ బేదం లేకుండా అటు శివాలయాల్లోను, ఇటు వైష్ణవ ఆలయాల్లోను క్షీరాబ్ధి ద్వాదశి పూజల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం స్వామివారికి విశేషపూజలు, అభిషేకాలు, నమకచమక సయిత పూజాదికాలు నిర్వహించిన అనంతరం సాయంద్రం దేవాలయాల్లో కార్తీక దీపాలను పెద్ద ఎత్తున వెలిగించారు. ఈ దీపకాంతుల్లో ఆలయాలు దేదీప్యమానంగా కాంతులు విరజిమ్మాయి. ఈ పూజల్లో మహిళలేకాకుండా పురుషులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజాదికాలు నిర్వహించారు.

ఘనంగా లక్ష తులసీ దళార్చన
ఎచ్చెర్ల, నవంబర్ 20: మండలంలోని షేర్‌మహ్మద్‌పురం గ్రామంలో వెలసియున్న శ్రీకోదండరామాలయంలో ఘనంగా మంగళవారం లక్ష తులసీ దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక శుద్ధ ద్వాదశిని పురష్కరించుకొని చిన్నజీయార్ స్వామి ఆశీస్సులతో శ్రీమాన్ పొన్నాడ మధుసూధన రామానుజ దాస్ పర్యవేక్షణలో లోక కళ్యాణార్ధమై లక్ష తులసీదళార్చన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ జిల్లా పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జి దంపతులు స్థానిక మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్‌లు పాల్గొని లక్షతులసీ దళార్చన కార్యక్రమాన్ని ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించారు. ఇందులో భాగంగా విష్ణు సహస్ర నామాలుతో ఈ కార్యక్రమాన్ని భక్తులు, భాగవతులు, ఆండాలమ్మలు నిర్వహించారు. అలాగే కోదండ రామాలయ ఆవరణంలో తదియారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బల్లాడ వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గొంటి నర్సింగరావు, కొత్తకోట అమ్మినాయుడు, పొందూరు బీమారావు, లింగాల దాలప్పడు, సమీప గ్రామాల భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

ఆదరణ లబ్ధిదారులకు పనిముట్లు కేటాయింపు
సారవకోట, నవంబర్ 20! మండలంలో ఆదరణ-2 పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు వారికి అవసరమైన పనిముట్లను కేటాయించే ప్రక్రియ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రారంభమయింది. ఎంపికైన లబ్ధిదారులు స్థానిక కార్యాలయంలో అంతర్జాలంలో పనిముట్లను చూసి ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. లబ్ధిదారునకు మంజూరైన పైకాన్ని బట్టి లబ్ధిదారుడు పనిముట్లను ఎంపిక చేసుకోవల్సివుంది. మండలానికి ఆదరణ పథకం కింద 472 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటికే 240 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రుణాలు మంజూరు కార్యక్రమం ముగిసిందని ఎంపీడీవో జగదీశ్వరరావు తెలిపారు. మిగిలిన 232 మంది లబ్ధిదారులకు పనిముట్లు కేటాయింపు ప్రక్రియ చేపట్టామని, ఈ అవకాశాన్ని చేతి వృత్తుల పనివారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.