శ్రీకాకుళం

200 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, జూన్ 2: అందరికీ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో సుమారు 200 ఎకరాల్లో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు అవినీతి, అక్రమాలు రాజకీయ కుట్రలు కారణంగా రాష్ట్రం విడిపోయి తీవ్ర కష్టనష్టాలకు గురైందని ఈ నష్టాలను తిరిగి ప్రజల కష్టంతో భర్తీ చేసుకుని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుకుంటామని ఆయన అన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సమాజంలోగల ప్రకృతి వనరులను కాపాడి వాటిని వినియోగింలోనికి తీసుకువచ్చేందుకే నీరు-చెట్టు వంటి పథకాలతో పునర్నిర్మాణం చేపడుతున్నామని అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి పనిచేస్తుందన్నారు. తొలుత ఇక్కడ మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా నిర్వహించి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. దేశం నాయకులు కోట గోవిందరావు, మున్సిపల్ చైర్ పర్సన్ గీత, ఎంపిపి భారతమ్మ, తమ్మినేని చంద్రశేఖర్, షేక్ అబ్దుల్ మాలిక్, బోయిన సునీత, తంగి గుర్రయ్య, కొండబాబు, బోర గోవిందరావు, పలు శాఖాధికారులు, అధికారులు సిబ్బం పాల్గొన్నారు.