శ్రీకాకుళం

గ్రామదర్శినిని సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగిడి, డిసెంబర్ 6: ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెద్దశిర్లాం గ్రామంలో జరిగిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామానికి అవసరమైన వౌళిక సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు తయారు చేసుకొని గ్రామస్తుల సహకారంతో అధికారులు అభివృద్ధికి తోడ్పడాలన్నారు. గతంలో మంజూరైన గృహాలకు నేటి వరకు బిల్లులు చెల్లించలేదని లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే బిల్లలు చెల్లించాలని అధికారులకు ఆదేశించారు. మడ్డువలస, తోటపల్లి కాలువలకు ప్రతి ఏడాది నీరు అందడం లేదన్నారు. అక్కడున్న తోటపల్లి, మడ్డువలస నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి సాగునీరు అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్యం నివారణకు చెత్త నుంచి సంపద కేంద్రానికి కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గ్రామంలో శతశాతం మరుగుదొడ్లు నిర్మించామని, కలెక్టర్ దృష్టికి మాజీ సర్పంచ్ తీసుకురాగా మరుగుదొడ్లు నిర్వహణ, వినియోగం వంటి వాటిపై అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సరళ, ఏపీ ఎం అరుణకుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.

పశువుల పెంపకం ద్వారా అదనపు ఆదాయం
బూర్జ, డిసెంబర్ 6: చిన్న, సన్నకార రైతులు పశువుల పెంపకం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందగలరని పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండలంలో పెద్దపేట ఆర్ట్స్ కార్యాలయంలో శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి చెందిన భారత్ రూరల్ లైవలీ ఫుడ్ ఫౌండేషన్, వాసన్ సౌజన్యంతో ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు పశువుల, మేకల, కోళ్లు పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆరు రాష్ట్రాలకు చెందిన గిరిజన యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నట్టు వాసన్ ప్రతినిధి జె.వి.మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ సంస్థ డైరెక్టర్ నూక సన్యాసిరావు, ఎం. ఎల్.సన్యాసిరావు, గోవింద్ తదితరులున్నారు.

ఘనంగా అంబేద్కర్ వర్థంతి
హిరమండలం, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 62వ వర్థంతి గురువారం ఘనంగా నిర్వహించారు. హిరమండలం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నకోరాడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో అంబేద్కర్ చిత్రపటానికి హెచ్ ఎం బాలామణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే గ్రామదర్శిని
హిరమండలం, డిసెంబర్ 6: సమస్యలు పరిష్కారానికే గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్నామని తహశీల్దార్ ఐ.టి.కుమార్ అన్నారు. గురువారం మండలంలోని కొమనాపల్లి గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలను, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం సమావేశంలో తహశీల్దార్ మాట్లాడుతూ ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తెస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో కాశీవిశ్వనాధం, ఏ ఈ భాస్కరరావు తదితరులున్నారు.
గ్రామదర్శినితో సమస్యలు పరిష్కారం
వంగర, డిసెంబర్ 6: గ్రామాల్లోని సమస్యలు గ్రామదర్శినితోనే పరిష్కారమవుతున్నాయని ప్రత్యేకాధికారి శివ్వాల మన్మధరావు అన్నారు. మండలంలోని అరసాడ గ్రామంలో గురువారం గ్రామదర్శిని కార్యక్రమంలో గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజులు, తహశీల్దార్ మంగు, ఎం ఈవో వై.దుర్గారావు, ఆర్‌డబ్ల్యు ఎస్ జేఈ కార్తీక్‌నాయుడు తదితరులున్నారు.