శ్రీకాకుళం

రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, డిసెంబర్ 6: మండలంలోని కురిగాం పరిధిలో ఉన్న రెండు రేషన్ దుకాణాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేశారు. విజిలెన్స్ ఎస్ ఇ హరికృష్ణ ఆదేశాలు మేరకు విజిలెన్స్ సీ ఐ జి.చంద్ర ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి కురిగాం-1 డిపోలో ఉన్న 2,607 కిలోల అధికంగా నిల్వలు ఉన్న బియ్యం, 78 కిలోల పంచదార, 160 కిలోల కందిపప్పును గుర్తించినట్టు తెలిపారు. రెండో రేషన్ డిపోను కూడా తనిఖీ చేసి అక్రమాలు గుర్తించినట్టు సీ ఐ తెలిపారు. డిపోలపై 6 ఎ కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఆయనతో పాటు విజిలెన్స్ ఎస్ ఐ ధర్మారావు తదితరులున్నారు.
అంబేద్కర్ ఆశయాలే ఆదర్శం
కొత్తూరు, డిసెంబర్ 6: బీ ఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని దళిత సంఘాల నేతలు జమ్మయ్య, గుమ్మయ్యలతో పాటు పలువురు రైతులు పిలుపునిచ్చారు. గురువారం అంబేద్కర్ 62వ వర్ధంతిని పురస్కరించుకొని కొత్తూరు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. యూటీ ఎఫ్ నేతలు బర్రి పురుషోత్తం, ప్రకాశరావు, ఏ ఎస్ ఐ ప్రసాద్, డీలర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.

టీడీపీలో పలువురు చేరిక
కొత్తూరు, డిసెంబర్ 6: టీడీపీలోకి మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కొందరు గురువారం చేరారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ క్యాంప్ కార్యాలయం మాతలలో పార్టీలో చేరిన వారిని పసుపు కండువాలతో ఆహ్వానించారు. అప్పన్న ఆధ్వర్యంలో సుమారు 15 కుటుంబాలు వైకాపా నుంచి టీడీపీలోకి చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎంసీ డైరెక్టర్లు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, త్రినాధరావు తదితరులున్నారు.
తిరుపతిరావు కుటుంబానికి పరామర్శ
రేగిడి, డిసెంబర్ 6: మండలంలోని కొండవలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుమ్మి తిరుపతిరావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గురువారం ఆ గ్రామానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను డీసీసీబీ ఉపాధ్యక్షులు దూబ ధర్మారావు పరామర్శించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని తెలుగుదేశం పార్టీకి తిరుపతిరావు మరణం లోటని పేర్కొన్నారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు బుగత వెంకటరావు, సుంకరి అప్పలనాయుడు, వెంకటప్పలనాయుడు, పిల్లా సత్యంనాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ పేదల పక్షపాతి
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 6:తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తూ పేదల పక్షపాతిగా ప్రజల్లో ముద్ర వేసుకుందని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి అన్నారు. గురువారం మండలంలోని దేవునల్తాడ, సీతాపురం, బైపల్లి, మెట్టూరు, ఒంకులూరుల్లో సీ ఎం రిలీఫ్ ఫండ్ పత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ పాలన సాగుతుందన్నారు. అభివృద్ధిని కాంక్షించిన టీడీపీ పక్షాన నిలబడతారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సమానప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వంక నాగేశ్వరరావు, ఎంపీపీ వసంతస్వామి, టీడీపీ అధ్యక్షుడు జి.పాపారావు, బి.మోహనరావు, గోపి, కామేశ్వరరావు, బాలకృష్ణ, ఎ.నీలకంఠం,ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ విజయం చారిత్రత్మాక అవసరం
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 6: రాబోయే ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అవ్వాల్సిన చారిత్రత్మాక అవసరం ఉందని వైసీపీ పలాస సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం ఒంకులూరులో 30 కుటుంబాలు వైసీపీలో చేరిన సందర్భంగా ఆత్మీయసమ్మేళనం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసిన టీడీపీ కార్యకర్తల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. టీడీపీ పాలనలో అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించడం లేదని,ప్రజలు నుంచి విమర్శలు ఎదురవుతున్నా సందర్భంగా హాడావుడిగా శిలాఫలకం రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి ప్రజలే తగిన విధంగా బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్‌పీటీసీ వరిశ హరిప్రసాద్, వైసీపీ నాయకులు ఎ.వల్లభరావు, టి.లక్ష్మణరావు, ఎస్.సాంబమూర్తి, ఎస్.లక్ష్మణరావు, ఆర్.బీమారావు, కామయ్య తదితరులు పాల్గొన్నారు.