శ్రీకాకుళం

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల బాధ్యత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతబొమ్మాళి, డిసెంబర్ 6: విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులతో తల్లిదండ్రుల బాధ్యత అవసరమని సంతబొమ్మాళి ప్రభుత్వ బీసీ పాఠశాల హెచ్ ఎం అప్పలరాజు అన్నారు. గురువారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువులపై వారానికి ఒకసారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. టీ.వీకి దూరంగా ఉండేటట్లు చూడాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఏకరూపుదుస్తులు, పుస్తకాలు వంటివాటిని విద్యార్థులు, తల్లిదండ్రులు వినియోగించుకోవాలన్నారు. సీతానగరం యుపి పాఠశాలలో అంబేద్కర్ వర్థంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి హెచ్ ఎం కామేశ్వరరావు, విద్యాకమిటీ చైర్మన్ బాబ్జీలు పూలమాలలు వేసారు.
సీపీ ఎస్ విధానం రద్దుచేయకపోతే సమ్మె చేస్తాం
సంతబొమ్మాళి, డిసెంబర్ 6: ఉద్యోగభద్రత హరించే సీపీ ఎస్ విధానం రద్దు చేసేవరకు పోరాటం ఆగదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కౌన్సిలర్ రాజు అన్నారు. గురువారం పాతమేఘవరం, ఎం.సున్నాపల్లి పాఠశాలలు వద్ద సీపీ ఎస్ విధానం రద్దు చేయాలని నిరసనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీపీ ఎస్ విధానం రద్దు చేయాలని సీ ఎం చంద్రబాబునాయుడుకు 2 లక్షల లేఖలు వ్రాయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే నిరసన తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, దుర్గారావు, రాజ్‌కుమార్, మిన్నారావు, దుర్యోదన, ప్రేమ్‌కుమార్, లక్ష్మి, జ్యోతి, అనురాధ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజలు ఆకర్షించేలా విజయస్థూపం
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 6: జగన్ పాదయాత్ర ముగిసే చోట నిర్మిస్తున్న విజయస్థూపం రాష్ట్ర ప్రజలందరిని ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపడుతున్నారు. గురువారం వైసీపీ పార్టీకి చెందిన కె.వెంకటరెడ్డి ఈ నిర్మాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేసారు. స్థలానికి 50 లక్షల రూపాయలు వెచ్చించారు. నిర్మాణానికి ఎంత అధిక మొత్తంలో వెచ్చిస్తారన్నది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిశీలనలో ఆదిరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా అంబేద్కర్ వర్థంతి
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 6: కవిటి మండలంలో కవిటి, బొరివంక గ్రామాల్లో అంబేద్కర్ వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే అశోక్‌తోపాటు స్థానిక నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు. అంబేద్కర్ గూర్చి వివరించారు. గొర్లపాడు వద్ద ఉన్న వ్యవసాయమార్కెట్ వద్ద రైతులకు ఆదరణ పథకం కింద పలు పరికరాలను పంపిణీ చేసారు. బెందాళం ప్రకాశ్, లింగరాజు, రమేష్, సదానందరౌళో పాల్గొన్నారు.
తిత్లీ సహాయం పంపిణీకాకపోవడం శోచనీయం
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 6: తిత్లీ సహాయం రెండు నెలలు వరకు పంపిణీకాకపోవడం శోచనీయమని వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ అన్నారు. కవిటి బెహరావీధిలో గురువారం వైసీపీ నాయకులు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను సాయిరాజ్ దృష్టికి తీసుకువెళ్లారు. తిత్లీ తుపాన్ వల్ల నష్టపోయిన ఇళ్లుకు 560 రేకులు వచ్చాయని, నేటికి రెండు నెలలు కావస్తున్నా అవి పంపిణీకావడం లేదని వారు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సాయిరాజ్ మాట్లాడుతూ ఈ విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్, కె.ప్రకాశ్, రజనీకుమార్‌దొళాయి తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు టీడీపీ ప్రభుత్వం ఆదరణ
*ఎమ్మెల్యే కలమట
కొత్తూరు, డిసెంబర్ 6: అన్ని కులాల్లో ఉన్న వెనుకబడి ఉన్న బడుగులందరినీ టీడీపీ ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా ఆదుకుంటుందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. మండల కేంద్రం కొత్తూరు పీ ఏసీ గొడౌన్ వద్ద పేదరికంపై గెలుపు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కులవృత్తులకు, వెనుకబడిన అన్ని కులాల వారికి ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా పనిముట్లును అందజేస్తుందన్నారు. పది శాతం లబ్ధిదారుని వాటా చెల్లించి తమ కులవృత్తులకు అవసరమైన పనిముట్లును అందజేసి నిరుపేద కుటుంబాలకు ఆదరిస్తుందన్నారు. కార్పొరేషన్ రుణాల పత్రాలను కూడా ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరిక రాజేశ్వరి, జెడ్పీటీసీ పాలక ధనలక్ష్మీ, ఎంపీడీవో ప్రసాదరావు, హిరమండలం, ఎల్ ఎన్‌పేట, పాతపట్నం, మెళియాపుట్టి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
గిరిజన శాఖామంత్రిని కలిసిన ఎమ్మెల్యే
కొత్తూరు, డిసెంబర్ 6: రాష్ట్ర గిరిజన శాఖామంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ను పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గురువారం కలిశారు. నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఐటీడీ ఏకు గురువారం విచ్చేసిన మంత్రి శ్రావణ్‌కుమార్‌ను కలిసి పాతపట్నం నియోజకవర్గంలోని సమస్యలను విన్నవించారు.