శ్రీకాకుళం

నేడు పి ఆర్‌సి కమిషన్ జిల్లాకు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 11వ పే రివిజన్ కమీషన్ శుక్రవారం జిల్లాకు రానున్నట్లు జిల్లా ఖజానాశాఖ ఉపసంచాలకులు జి.నిర్మలమ్మ తెలిపారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పే రివిజన్ కమీషన్ సెక్రటరీ విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి అశుతోష్ మిశ్రా ఆధ్వర్యంలో పి ఆర్‌సి కమిటీ సభ్యులతో శుక్రవారం ఉదయం 10గంటలకు స్తానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం ఉంటుందని ఆమె తెలిపారు. ఈసమావేశానికి వివిధ శాఖల సర్వీస్ అసోసియేషన్‌లు, పింఛన్‌దారుల అసోసియేషన్‌లు, యూనివర్శిటీలకు చెందిన అసోసియేషన్‌లు, సభ్యులు తమ ప్రతిపాదనలతో హాజరు కావాలని ఆమె కోరారు. డిసెంబర్ 7 ఉదయం 10గంటల నుండి ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మొదటిగా వైద్య ఆరోగ్య శాఖ, విద్య, ఇంజనీరింగ్, గ్రౌండ్ వాటర్, మున్సిపాల్టీ, టౌన్‌ప్లానింగ్, పంచాయతీ రాజ్, వ్యవసాయ, పశు సంవర్థక పట్టుపరిశ్రమ, ఉద్యానవన శాఖలతో సమావేశం ఉంటుందన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుండి రెవెన్యూ, ల్యాండ్ రికార్డ్స్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఎక్సైజ్, రవాణా, పోలీస్, అటవీ, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనార్టీ వెల్ఫేర్, మహిళా-శిశు సంక్షేమం, సహకార సంస్థలు, పరిశ్రమలు, మైన్స్ అండ్ జియాలజీ, సమాచార పౌరసంబంధాలు, ట్రెజరీ అండ్ అకౌంట్స్, రాష్ట్ర ఆడిట్, యూనివర్శిటీలు ఇతర శాఖలతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సాదారణ అంశాలు, సర్వీస్ సంబంధమైన అంశాలు, కమిటీ సభ్యులతో చర్చించేందుకు ఇది ఒక మంచి అవకాశమని, ఉద్యోగులు, పింఛన్‌దారుల సంఘ సభ్యులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
కోటబొమ్మాళి, డిసెంబర్ 6: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి ప్రకాశ్‌బాబు అన్నారు. గురువారం స్థానిక ఎస్సీ బాలికల వసతిగృహంలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థిదశ నుంచే కనీసచట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన తర్వాత బాలికలు వివాహం చేసుకోవాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వాసుదేవరావు, అర్జునరావు, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి
మెళియాపుట్టి, డిసెంబర్ 6: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని దళిత సంఘం ప్రతినిధి హరికృష్ణ, ఇచ్ఛాపురం ఎం ఇవో అప్పారావులు అన్నారు. చీపురుపల్లి గ్రామంలో అంబేద్కర్ వర్థంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడసంద్ర, గొప్పిలి, పెద్దమడి, బందపల్లి తదితర గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.
టెక్కలిలో...
అంబేద్కర్ జీవితం ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ అనుసరించాలని టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహాం వద్ద వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీవెల్ఫేర్ అధ్యక్షుడు ధనుంజయరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పలు ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు. ఎంపీపీ సుందరమ్మ, మాజీ సర్పంచ్ కృష్ణవేణి, గోపాలం, తహసీల్థార్ అప్పలరాజు, ఆర్ ఐ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహాసభ అధ్యక్షుడు బోకర నారాయణరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఆది ఆంధ్రావీధిలోని అంబేద్కర్ విగ్రహానికి సీపీ ఎం నాయకులు షణ్ముఖరావు, ఎల్లయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల దేశం పార్టీ అధ్యక్షుడు శేషగిరిరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసారు. గణపతి, గాంధీ, బుజ్జి, మురళీ తదితరులు పాల్గొన్నారు.
చురుకుగా సభ్యత్వాల నమోదు
టెక్కలి, డిసెంబర్ 6: తెలుగుదేశం పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమం పట్టణంలోని రోటరీనగర్-1లో చురుకుగా సాగుతుంది. స్థానిక ఎంపీటీసీ కుమారిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం సభ్యత్వనమోదు కార్యక్రమం చేపట్టారు. సుమారు 3 రోజులుగా 325 మందికి సభ్యత్వాలు రెన్యూవల్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మెంబర్‌షిప్ ఏజెంట్లు దుర్గాప్రసాద్, గణేష్, డి.రమేష్‌రెడ్డి, మురళీ, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదరిక నిర్మూలన టీడీపీ ధ్యేయం
టెక్కలి, డిసెంబర్ 6: రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించి స్వయంశక్తిపై ఎదిగేందుకు కృషి చేయాలన్నది తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని టెక్కలి ఎంపీపీ సుందరమ్మ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గస్థాయి ఆదరణ-2 పథకం కింద గ్రౌండింగ్‌మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క చేతివృత్తులవారు స్వయంశక్తిగా ఎదిగేందుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. అనేక సంక్షేమ పథకాలు వైపు ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లబ్దిదారులకు పనిముట్లు అందించారు. రాష్ట్ర అటవీశాఖ డైరెక్టర్ ఎల్ ఎల్ నాయుడు, ఎంపీడీవో హరిహరరావు, సంతబొమ్మాళి జడ్‌పీటీసీ లక్ష్మి, సంతబొమ్మాళి ఎంపీపీ కృష్ణవేణి, టీడీపీ నాయకులు బగాది శేషగిరిరావు, రామకృష్ణ, ప్రసాదరెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.
75 శాతం రాయితీపై పశుదాణా
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 6: మండలానికి 75 శాతం రాయితీపై పశువుల దాణాను ఎంపీపీ ఢిల్లీరావు గురువారం కేశుపురంలో పంపిణీని ప్రారంభించారు. 984 రూపాయల బస్తా 245 రూపాయలకు రైతులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రాయితీపై రుణాలు, పశువుల పెంచడానికి రుణాలు, చేపలపెంపకానికి రుణాలు అందిస్తుందని, ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దక్కత కామేషు, మోహన్, కురయ్య, సుధ తదితరులు పాల్గొన్నారు.