శ్రీకాకుళం

మహిళా అభిమానుల మద్య జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 10: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గంలోని రూరల్ మండలం దూసి రోడ్ జంక్షన్ నుండి సోమవారం పాదయాత్ర ప్రారంభించారు. దూసి రోడ్‌నుండి ప్రారంభమయిన ఈ పాదయాత్ర గట్టుముడిపేట, వంజంగి వరకు కనసాగింది. తొలుత అభిమానులను కల్సుకొని అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. దూసి రోడ్‌నుండి రాగోలు పంచాయతీ పరిథిలో బావాజీపేట, కూటికుప్పలపేట మీదుగా వంజంగి, గట్టుముడిపేట చేరుకున్నారు. ఇరుకురోడ్డులో కూడా జగన్ పాదయాత్ర కొనసాగించారు. ఎక్కువగా మహిళలు జగన్‌ను కలిసేందుకు ముందుకు వచ్చి స్వాగతం పలుకుతూ సెల్పీలు దిగారు. ఈ పాదయాత్రలో ఇరువురు చిన్నారులు సుభాష్‌చంద్రబోస్, వివేకానంద వేషదారణలు ఆకట్టుకుంటూ వారివురి చేతులను కలుపుతూ పాదయాత్ర సాగించారు. అలాగే కొన్ని చోట్ల మహిళలు కూడా జగన్‌కు చేయి కలుపుతూ పాదయాత్ర సాగించారు. వెలమ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వినతి పత్రం అందజేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ను కొనసాగించాలని కోరుతూ సిపి ఎస్ ఉద్యోగులు జగన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పలు చోట్ల రైతులు కూడా తమ సమస్యలను తెలియజేశారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు జగన్ పాదయాత్రను తిలకించేందుకు తరలివచ్చారు. ఈ పాదాయాత్రలో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, పార్లమెంటరీ నియోజవర్గం అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రెడ్డిశాంతి, డి సి ఎమ్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, పి ఏసి ఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, వైవి సూర్యనారాయణ, తమ్మినేని చిరంజీవి నాగ్, ధర్మాన రామ్‌మనోహరనాయుడు, మామిడి శ్రీకాంత్, జెడ్పీటీసీ చిట్టి జనార్ధనరావు, చల్ల రవికుమార్, గేదెల రామారావు,యజ్జల గురుమూర్తి స్థానిక నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

భారతమ్మను కలిసిన వైసీపీ నేతలు
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 10: వైసీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి సతీమణి భారతి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం జిల్లాకు చేరుకొన్నారు. రాగోలు సమీపంలో విడిది చేశారు. సోమవారం ఉదయం వైసీపీ నాయకులురాలు రెడ్డిశాంతి, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతిలు భారతమ్మను కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు జీతాలు చెల్లించాలి
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 10: రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు జీతాలు సెప్టెంబర్ నెలనుండి ఇంతవరకు జైబాలాజీ సెక్యూరిటీ సర్వీస్ చెల్లించకపోవడం విచారకరమని, దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని బి ఎమ్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంబీజి నాయుడు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌లో కలెక్టర్ కె.దనంజయరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రిమ్స్‌లో సుమారు 110 మంది సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారని, నాలుగునెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని, ఈ విషయాన్ని రిమ్స్ డైరక్టర్‌కు, సూపరింటిండెంట్‌కు, ఆర్ ఎమ్‌వో కు వినతి పత్రం అందించినప్పటికి ఫలితం లేదన్నారు. వెంటనే జీతాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మామిడి సూర్యనారాయణ, జోగి వెంకటరమణ, చంద్రశేఖర్, నర్శింగరావు తదితరులు కోరారు.