శ్రీకాకుళం

ప్రభుత్వ ఆస్థులను గుర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, డిసెంబర్ 10: గ్రామ పంచాయతీ స్థాయిలో గల ప్రభుత్వ ఆస్థులను గుర్తించి జియోట్యాగింగ్ చేయాలని ఎంపీడీవో జగదీశ్వరరావు గ్రామపంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను గోడలపై నమోదు చేయాలని అన్నారు. అదే విధంగా భూధార్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను సేకరించాలని గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, బయోమెట్రిక్ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు. మండలంలో 821 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు వివిధ దశలలో అసంపూర్తిగా ఉన్నాయని వీటిని పూర్తిచేయడానికి పంచాయతీ కార్యదర్శులు గ్రామ స్థాయి అధికారులతో కలిసి కృషి చేయలాని ఆదేశించారు. మండలంలో సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలు నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. 34 పంచాయతీలకు గాను చిన్నగుజ్జువాడ, అన్నుపురం, క్యాలవలస, పెద్దలంబ పంచాయతీలో వీటి నిర్మాణానికి స్థలం లేదన్నారు. మిగిలిన 30 పంచాయతీలకు గాను మూడు పంచాయతీలలో నిర్మాణాలు పూర్తికాగా 15 పంచాయతీల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. నెలాఖరు నాటికి అన్ని పంచాయతీలో వీటి నిర్మాణాలును ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
విద్యార్థులలో ప్రథమ చికిత్సపై అవగాహన అవసరం
* ఉపవిద్యాశాఖాధికారిణి పగడాలమ్మ
నరసన్నపేట, డిసెంబర్ 10: విద్యార్థులలో ప్రాథమికంగా ఎదురుకుంటున్న సమస్యలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని జిల్లా ఉప విద్యాశాఖాధికారిణి పగడాలమ్మ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అత్యవసర వైద్య సర్వీస్‌లు అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయని, నేటి నుండే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించగలిగితే పెను ప్రమాదాల నుండి తప్పించుకోవడమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా సేవలందించే అవకాశం వుంటుందని స్పష్టం చేశారు. ఇటువంటి కార్యక్రమాలను జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేస్తున్నామని, అంతేకాకుండా రెడ్‌క్రాస్ సంస్థకు సంబంధించి కొన్ని బృందాలను కూడా విద్యార్థులతో ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ప్రతినిధి కోటీశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి యు.శాంతారావు, ప్రధానోపాధ్యాయుడు కృష్ణప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులకు సంతూర్ స్కాలర్‌షిప్‌లు మంజూరు
* ఒక్కొక్క విద్యార్థికి రూ.24వేలు అందజేత
నరసన్నపేట, డిసెంబర్ 10: డిగ్రీ కళాశాల విద్యార్థులకు చేయూతనిచ్చే దిశగా విప్రో కంపెనీకి సంబంధించిన సంతూర్ స్కాలర్‌షిప్‌లను విద్యార్థులకు అందజేయడం ఎంతో ఆనందదాయకమని కళాశాల ప్రిన్సిపాల్ క్రిష్ణారావు తెలిపారు. సోమవారం ఆ కళాశాలలో స్కాలర్‌ఫిప్‌లు అందుకుంటున్న ఏడుగురు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఒక్కొక్కరికి రూ.24వేలు చొప్పున విప్రో సంస్థ అందజేస్తుందని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రతీ ఏడాది వీరికి అందజేస్తుందని వివరించారు. మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థినులు దేవికారాణి, ధనలక్ష్మి, రాజేశ్వరి, శ్యామల, భవాని, నీలవేణి, నిర్మలకు ధృవపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారావు, అప్పారావుతదితరులు పాల్గొన్నారు.