శ్రీకాకుళం

సమాజాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుబుజ్జిలి, డిసెంబర్ 10: సమాజంలోని ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా విద్యావంతులైన యువతతోనే సాధ్యపడుతుందని ఎన్ ఎస్ ఎస్ సీనియర్ పీవో జె.రవిబాబు అన్నారు. సోమవారం మండలంలోని షలంత్రి గ్రామంలో గత నాలుగు రోజులుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరంలో పాల్గొని సామాజిక సేవ, యువత బాధ్యత అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులంతా అంకిత భావంతో సమాజానికి సేవ చేస్తే సర్వతోముఖాభివృద్ధి సాధించవచ్చునన్నారు. ఎన్ ఎస్ ఎస్ పీవో దుగ్గువలస రాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రమేష్‌సాహు, శ్రీనివాసరావు, దుర్గారావు, ఎన్ ఎస్ ఎస్ వలంటీర్లు, గ్రామ యువత సురేష్, నవీన్, మాలతి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులు ప్రారంభం
పాలకొండ (టౌన్), డిసెంబర్ 10: స్థానిక రామ్‌లీలా డిగ్రీ కళాశాలలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణా తరగతులను నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని కళాశాల యాజమాన్యం డాక్టర్ ఎస్.చిరంజీవి, ప్రిన్సిపాల్ జె.బలరాంనాయుడు కోరారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ అందించిన జె.రాజేష్‌కుమార్ తదితరులు నిరుద్యోగులను అభినందించారు.
చింతాడలో గ్రామదర్శిని
పాలకొండ, డిసెంబర్ 10: మండలంలోని చింతాడ గ్రామంలో సోమవారం పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలు నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు
సారవకోట, డిసెంబర్ 10: ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష కార్యక్రమం పథకం కింద సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ గర్భిణులు తీసుకోవల్సిన జాగ్రత్తలు గూర్చి సోదాహరణంగా వివరించారు. క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని, రక్తహీనత లేకుండా అవసరమైన మందులను వినియోగించాలన్నారు. ఈసందర్భంగా 42మంది గర్భిణులకు రక్తపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అదేవిధంగా బుడితి సామాజిక ఆసుపత్రిలో పలువురు గర్భిణులకు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి అవసరమైన మందులను అందజేసి డాక్టర్ సృజనాకుమారి పలు సూచనలు ఇచ్చారు.
పెసర పంటకు సోకిన లద్దె పురుగు
సారవకోట, డిసెంబర్ 10: రబీలో వాణిజ్య పంటలు సాగుచేస్తున్న తరుణంలో పెసరపంటకు పలు రకాల చీడ పీడలు సోకినట్లు గుర్తించామని వ్యవసాయశాఖ విస్తరణాధికారిణి శారద తెలిపారు. మండలంలోని పెద్దలంబ, నారాయణపురం తదితర గ్రామాలలో పెసర చేనుకు పొగాకు లద్దెపురుగు ఆశ్రయించి మొక్కలను నాశనం చేస్తుందని వివరించారు. అదేవిధంగా పెద్దలంబ ప్రాంతంలో పెసర చేనుకు లద్దెపురుగు సోకినట్లు రైతులు తెలిపారని ఆమె వివరించారు. వీటి నివారణకు క్లోరిఫైడ్ ఫాస్ 2.5 ఎమ్ ఎల్ ద్రావణాన్ని లీటరు నీటిలో కలిపి ఉదయం సమయాల్లో పెసర పంటకు పిచ్‌కారీ చేయాలని రైతులకు సూచించారు.