శ్రీకాకుళం

విద్యార్థుల్లో సేవా భావం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుబుజ్జిలి, డిసెంబర్ 13: ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా షలంత్రి గ్రామంలో ఎన్ ఎస్ ఎస్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి రాంప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం ముగింపు కార్యక్రమం కొత్తకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఎస్ ఐ విజయకుమార్ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థుల్లో ఇప్పటినుంచే సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ రవికుమార్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి
కొత్తూరు, డిసెంబర్ 13: వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. గురువారం మండల కేంద్రం కొత్తూరులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు, నిర్వాసితులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగరాపు ఈశ్వరమ్మ మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు నిర్మాణంతో రోడ్డున పడ్డ నిర్వాసితులకు న్యాయం జరగాలంటే ఈ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులను ఆదుకోవాలని హైకోర్టు ప్రత్యేక తీర్పు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి తిర్ల ప్రసాద్, మాజీ ఎంపీటీసీ సంజీవరావు,నిర్వాసితులు ఉన్నారు.
ప్రభుత్వ పథకాలపై బుర్రకథ
కొత్తూరు, డిసెంబర్ 13: గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బుర్రకథ దళం ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం మండలంలోని మాతల, కర్లెమ్మ రగామాల్లో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో కలిగాం గ్రామానికి చెందిన రాము, లక్ష్మణ, మిన్నారావు అనే కళాకారులు బుర్రకథ వేషధారణలో పథకాలపై వివరించారు. ఆయా గ్రామాల్లో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఈవో ఆర్‌డీ నారాయణమూర్తి, డీటీ భీమారావు, ఆర్ ఐ కృష్ణారావు తదితరులున్నారు.
జర్నలిస్టులకు ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరం ప్రారంభించిన జేసి-2
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 13: జర్నలిస్టులకు ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు ప్రారంభించారు. గురువారం స్థానిక ఎన్‌జీవోహోంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి, అమృత మల్టీ స్పెషాల్టీ డెంటల్ హాస్పిటల్ వారు జర్నలిస్టులకు నిర్వహించిన ఉచిత దంత, నేత్ర వైద్యశిబిరాన్ని జేసి-2, నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్.శ్రీరాములునాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసి-2 మాట్లాడుతూ జీవితంలో ఎన్నో ఒత్తిడిలతో పనిచేస్తున్న జర్నలిస్టుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు అధికంగా ఉన్నారని, వారికి ప్రత్యేకంగా రెటీనా పరీక్షల కోసం పుష్పగిరి కంటి ఆసుపత్రి అత్యాధునిక రెటీనాపతి మిషన్ ద్వారా ముందుగానే నేత్ర సమస్యలను గుర్తించి వైద్య సేవలను అందించడం ముదావహం అన్నారు. అదేవిధంగా దంత సమస్యలతో కంటి సమస్యలు, గుండె జబ్బులు కూడా ఏర్పడే అవకాశం వుందని, దంత సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. జర్నలిస్టులకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు జరిపి మందులను కూడా ఉచితంగా అందించిన అమృత మల్టీ స్పెషాల్టీ డెంటల్ హాస్పిటల్ వారిని అభినందించారు. జిల్లాలోని నలు మూలల నుంచి జర్నలిస్టులు కుటుంబాలతో విచ్చేసి వైద్యపరీక్షలు నిర్వహించుకున్నారు. నేత్ర వైద్యులు నైన, దంత వైద్యులు ఎస్.ప్రేమ్‌లాల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.్ధర్మారావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు నటుకుల మోహన్, వాకర్స్ క్లబ్ ప్రతినిధి జి. ఇందిరా ప్రసాద్, జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు జోగినాయుడు, కె.వేణుగోపాలరావు, మేధావుల ఫోరం అధ్యక్షుడు జి.నర్సునాయుడు, డిపి ఆర్‌వో ఎల్ రమేష్, పుష్పగిరి ఆసుపత్రి ఆక్టోమెట్రిస్ట్‌లు వౌనిక, ప్రసన్న, అంజలి, బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రాజాన మురళి, డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎ ఎమ్. భీమశంకరం తదితరులు పాల్గొన్నారు.

23న స్వచ్ఛ శ్రీకాకుళం 5కె రన్
* జిల్లా కలెక్టర్ దనంజయరెడ్డి

శ్రీకాకుళం, డిసెంబర్ 13: స్వచ్ఛ శ్రీకాకుళం 5కె రన్‌ను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.దనంజయరెడ్డితెలిపారు. శ్రీకాకుళం పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాధకరంగా ఉంచాలని ఉద్దేశ్యంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 5కె రన్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈమేరకు గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. పరిశుభ్రతపై ప్రతీ ఒక్కరిలో అవగాహన అత్యవసరమని అన్నారు. మెగా ఈవెంట్‌గా నిర్వహించి ప్రజల్లో మార్పు తెచ్చే విధంగా ఉండాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, ఒకేషనల్ విద్యాశాఖాధికారి, ప్రాంతీయ తనిఖీ అధికారి, ప్రిన్సిపాల్స్ తదితర వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు. రన్ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాలని ఏ ఎస్పీ టి.పనసారెడ్డిని ఆదేశించారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు, క్రీడాకారులు, వాకర్స్, విద్యార్థులు, యోగా సంఘాలు, వ్యాపారులు, నివాస ప్రాంతాల ప్రతినిధులు తదితర అన్ని రంగాల నుండి భారీ ఎత్తున భాగస్వామ్యం కావాలన్నారు. నగరపాలక సంస్థ కమీషనర్ ఆర్.శ్రీరాములునాయుడు ఆర్ట్ కళాశాల నుండి డచ్ బంగ్లా వరకు 5కె రన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 16 సంవత్సరాలు వయసు పైబడిన మహిళలు, పురుషులకు, 16 సంవత్సరాలలోపు బాలబాలికలకు రెండు వర్గాలుగా దీనిని నిర్వహిస్తామని చెప్పారు. ప్రతీ స్లాట్‌లో 500 మంది ఉంటారని చెప్పారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే రన్‌ను ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంతో సంగీతం, రాక్ బ్యాండ్ పెర్‌ఫార్మనెన్స్, గణేష్ డ్యాన్స్ హిప్ హప్, మిమిక్రీ, ట్రాక్ సింగర్స్ సాంగ్స్, హిప్ హప్ డ్యాన్స్ చివరిగా సత్కారాలు, డిజె, రెయిన్ డ్యాన్స్ ఉంటుందని చెప్పారు. స్వచ్ఛతలో కృషి చేసిన వారికి సన్మానాలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. శ్రీకాకుళం పట్టణంలో పరిశుభ్రత పాటించే ఉత్తమ వీధికి, వాణిజ్య సముదాయానికి హొటల్స్, రెస్టారెంట్లు, ఆసుపత్రి, నివాసాలు తదితర రంగాలకు సత్కారాలు, సన్మానాలు చేసేందుకు నిర్ణయించారు. సమావేశంలో జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి బి.జె ప్రసన్నకుమార్, ప్రజారోగ్య కార్యనిర్వాహక ఇంజనీర్ పి.సుగుణాకరరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, నగరపాలక సంస్థ సహాయ సిటీ ప్లానర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.