శ్రీకాకుళం

విద్యార్థుల్లో విజన్ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, డిసెంబర్ 15: ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థుల్లో ఇప్పటి నుంచే ఒక విజన్ ఉండాలని శ్రీకాకుళం ఎస్పీ సి. ఎం. త్రివిక్రమవర్మ విద్యార్థులకు సూచించారు. శనివారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో అబ్దుల్‌కలామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని చదువులు సాగిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పోటీ తక్కువ ఉంటుందని, మంచి ఉన్నత పదవులు పొందవచ్చునన్నారు.

స్వచ్ఛ సంక్రాంతి గ్రామంగా కర్లెమ్మ
కొత్తూరు, డిసెంబర్ 15: స్వచ్ఛ సంక్రాంతి గ్రామంగా కర్లెమ్మ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు తహశీల్దార్ సావిత్రి, ఎంపీడీవో ప్రసాదరావులు అన్నారు. శనివారం కర్లెమ్మ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని చెత్తాచెదారాలు, పెంటకుప్పలను పరిశీలించారు. వారు మాట్లాడుతూ మండలంలోని కర్లెమ్మ పంచాయతీని పైలెట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేశామన్నారు. రానున్న సంక్రాంతికి కర్లెమ్మ గ్రామం పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండలంలోని 33 పంచాయతీల ప్రత్యేకాధికారులు కర్లెమ్మ గ్రామాన్ని పరిశీలించారు.
ఉత్తమ ఫలితాలకు తల్లిదండ్రుల సహకారం అవసరం
కొత్తూరు, డిసెంబర్ 15: వసతిగృహ విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే తల్లిదండ్రులు సహకారం అవసరమని ఎస్సీ బాలుర వసతిగృహం వార్డెన్ నరసింగరావు సూచించారు. శనివారం ఎస్సీ బాలికల వసతిగృహంలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. మెనూ తీరును విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించడమే కాకుండా విద్యా ప్రగతిని తెలుసుకోవాలన్నారు. అయితే ఈ సమావేశానికి 16 మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరుకావడంపై అసంతృప్తి చెందారు. మేట్రిన్ స్వర్ణలత, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ ఎం శ్రీ్ధర్ ఉన్నారు.