శ్రీకాకుళం

ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్వాసితులకాలనీకి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, డిసెంబర్ 15: ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల కాలనీకి టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు శనివారం రామకృష్ణాపురం వద్ద భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని, ఎంతగానో త్యాగం చేసి సొంతభూములు ప్రభుత్వానికి ఇవ్వడంతో ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి అవకాశం ఏర్పడిందన్నారు. నిర్వాసితుల కాలనీ కోసం 250 ఇళ్లుస్థలాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ప్రాంతంలో దేవాలయం, బడి, సామాజిక భవనం, అంగన్‌వాడీ కేంద్రం, పంచాయతీకార్యాలయం ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. గ్రామంలో ఉండాల్సిన సౌకర్యాలన్నీ ఈ కాలనీలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇళ్లు నిర్మించుకొని ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో డి ఇ కె ఎస్ రంగరాజన్, తహసీల్థార్ కల్యాణచక్రవర్తి, డిటీ గిరి, ఆర్ ఐ శ్రావణ్, ఎ ఇ రామారావు తదితరులు పాల్గొన్నారు.

రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు
పలాస, డిసెంబర్ 15: పలాస మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 60 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. శనివారం పలాస మున్సిపాలిటీలోని కాలువ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస మున్సిపాలిటీ అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేసానని, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సహాకారం లేనప్పటికి తన శక్తిమేరకు కృషి చేసానన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబంధించి టెండర్లు పూర్తి అయ్యాయని, పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమని, పట్టణవాసులు ఎంతగానో సహకరించారని, వారికి రుణపడి ఉంటామన్నారు. జనసేన పార్టీ పిలుపు మేరకు ఉద్దానంలోని అక్కుపల్లిలో ఆర్‌వో ప్లాంట్ జనసేన ఆధ్వర్యంలో నిర్మించామని, ఈ నెల 16వ తేదిన ఆర్‌వో ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, నిబంధనలు మేరకు పనులు చేపట్టాలని గుత్తేదారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బల్ల శ్రీనివాసరావు, కె.కృష్ణారావు, సవర సుమన్, స్థానికులు పాల్గొన్నారు.

ఘనంగా పొట్టిశ్రీరాములు వర్థంతి
పలాస, డిసెంబర్ 15: అమరజీవి పొట్టిశ్రీరాములు వర్థంతిని బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ ఎం ఎస్‌వి రమణరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. తెలుగు మాట్లాడేవారి కోసం ఒక రాష్ట్రం ఉండాలని భావనతో పొట్టిశ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు పాటు నిరాహారదీక్ష చేసి చివరి రోజు మరణించారన్నారు. ఆంధ్రులు కోసం ఆయన తన ప్రాణాలను సైతం త్యాగం చేసారని, అటువంటి త్యాగమూర్తి కోసం ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఆయన త్యాగఫలితమే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రతి విద్యార్థి ఏదైనా సాధించే వరకు పట్టువిడవకుండా పోరాడేతత్వాన్ని, దీక్షను కొనసాగించాలని, అందుకు పొట్టి శ్రీరాములు స్పూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.శ్రీనివాసరావు, జి.పద్మ, శివప్రసాద్, జి. ఆమని, బీమశంకర్, చిన్నారావు, కె.రుద్రమూర్తి, ఎం.కృష్ణారావు, రామన్నాయుడు, విష్ణు ఆచారి, తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జీడిపరిశ్రమలను ఆదుకోవడమే వైసీపీ లక్ష్యం
పలాస, డిసెంబర్ 15: వేలాది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న జీడిపరిశ్రమలను ఆదుకోవడమే వైసీపీ లక్ష్యమని పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అప్పలరాజు అన్నారు. శనివారం కాశీబుగ్గ కీర్తనఫంక్షన్ హాల్‌లో వై ఎస్ జగన్మోహనరెడ్డి పలాస నియోజకవర్గానికి మరికొద్ది రోజుల్లో చేరుకుంటున్న నేపథ్యంలో స్థానిక జీడిపరిశ్రమల యజమానులతో వైసీపీ సమాలోచనలు చేసి పరిశ్రమలను కాపాడుకునేందుకు ఏమి చేయాలి అనే విధానంపై యజమానుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై ఎస్ జగన్మోహనరెడ్డి నియోజకవర్గంలో చేపట్టనున్న పాదయాత్రలో స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గానికి చర్యలు చేపడుతూ సమస్యలపై ఏ విధంగా స్పందించాలనేది స్థానిక నేతలను అడిగి తెలుసుకొని స్పష్టమైన హామీ ఇస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలలో వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి ఆశిస్తున్న డిమాండ్‌లను నేరవేర్చాలనే ధ్యేయంతోనే స్థానిక సమస్యలపై ముందస్తు అధ్యయనం చేస్తున్నారన్నారు. వై ఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, మాట ఇస్తే మడమ తిప్పరని, వై ఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో వ్యాపారస్తులు ఏంత అభివృద్ధి చెందారో, అదే విధంగా వై ఎస్ జగన్ హాయంలో కూడ అభివృద్ధి చెందే దిశగా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జీడిపరిశ్రమల యజమానులు మల్లా రామేశ్వరం, తంగుడు వీర్రాజు, తాళాసు ప్రదీప్, పివి సతీష్, కొంచాడ బీమారావు, పెంట విజయ, వైసీపీ నాయకులు బల్ల గిరిబాబు, దువ్వాడ శ్రీకాంత్, వరిశ హరిప్రసాద్, బల్లయ్య, డబ్బీరు భవానీ తదితరులు పాల్గొన్నారు.