శ్రీకాకుళం

సిఎం ఆదేశాలు బేఖాతరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జనవరి 16: సంక్రాంతి పండుగ రద్దీని నియంత్రించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు టోల్‌ఫీజ్ వసూళ్లను వాహనదారుల నుంచి చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే టోల్‌ప్లాజా నిర్వాహకులు మాత్రం ఎప్పటిలాగే రుసుమును వసూలు చేసి వాహనాలు బారులు తీరేలా వ్యవహారించారు. అనేక మంది వాహనదారులు సి ఎం ప్రకటించినప్పటికి ఎందుకు వసూలు చేస్తున్నారని సిబ్బందితో వాగ్వివాదం దిగినప్పటికి ఫలితం లేకపోయింది. సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు విచ్చేస్తున్న వాహనదారులు నుంచి టోల్‌ఫీజ్ వసూళ్లు చేస్తే ట్రాఫిక్‌జామ్ ఏర్పడి అవస్థలు పడతారని సి ఎం మినహాయింపు నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే టోల్‌ప్లాజాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండడం వల్ల సంబంధిత ఉన్నతాధికారులు అందుకు సహకరించకపోవడంతో వాహనదారులకు రుసుము చెల్లించక తప్పలేదు. అంతేకాకుండా ఎక్కడికక్కడే టోల్‌ప్లాజా ప్రాంతాలలో వాహనాలు బారులు తీరి సామాన్య ప్రయాణీకులు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకొని స్వగ్రామాలకు రావడం మరింత ఆలస్యమైంది. చిలకపాలెం టోల్‌ప్లాజా అధికారులను ఈ విషయమై ఆంధ్రభూమి వివరణ కోరగా జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేగాని ఇటువంటి మ ఇనహాయింపులు తాము చేయలేమని స్పష్టం చేశారు. ఏది ఏమైనా సి ఎం ఆదేశాలు భేఖాతరుగా మిగలడం ఒక ఎతె్తైతే వాహనదారులు రుసుం చెల్లించి గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణ తప్పలేదు.

ఆపారిశుధ్యంపై తిరగబడ్డ యువత
జి.సిగడాం, జనవరి 16: మండల కేంద్రం బజారు వీధి, వ్యాపార సముదాయాల నడిబొడ్డున మరుగుదొడ్డి వాడికి నీరు రోడ్డుపైకి తోడేయడంతో బురద, దుర్గంధభరితమైన వాసన రావడంతో స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఈ సంఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. జల్లేపల్లి శ్రీను తన మరుగుదొడ్డి నీటిని రోడ్డుపైకి విడిచిపెట్టడం వలన యువకులు ఆగ్రహం వ్యక్తం చేసి నిలదీశారు. దీనితో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివాదానికి గల కారణాలపై విచారించారు. శ్రీనివాసరాజే స్థానికులు చెప్పడంతో ఆ పరిసరాలను పరిశుభ్రంగా చేయాలని ఆదేశించారు. ఇదిలావుండగా శ్రీనివాసరావు తీరును నిరసిస్తూ యువకులంతా దుఖాణాలను మూయించి ఆందోళనకు దిగారు. అయితే స్థానిక మాజీ సర్పంచ్ నాయిని సింహాచలం జోక్యం చేసుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపి ఈ వివాదాన్ని సద్దుమనిగించారు. ఈ విషయాన్ని గ్రామ ప్రత్యేకాధికారికి ఫిర్యాదు చేశారు. మున్ముందు గ్రామం బయటకు వేయాలని స్థానికులు నిర్ణయించారు.

గుజరాతిపేటలో ఏకాహ భజన
శ్రీకాకుళం (రూరల్), జనవరి 16: సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని గుజరాతిపేట శ్రీరామమందిరంలో ఏకాహ భజన కార్యక్రమం నిర్వహించారు. మారుతీ భజన బృందం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 6గంటల నుండి బుధవారం ఉదయం 6గంటల వరకు ఈ భజనా కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజరాతిపేటకు చెందిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతీ ఏడాది పండగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భజన బృందం సభ్యులు బుజ్జి మేస్ర్తి తెలిపారు. ఈ ఏడాది కూడా భజన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కరగాన భాస్కరరావు తెలియజేశారు.