శ్రీకాకుళం

సాంప్రదాయాలను గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జనవరి 16: సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండగ పర్వదినాలను పౌరులు గౌరవించి భావితరాలకు అందించాలని విశ్రాంతి జిల్లా న్యాయమూర్తి పప్పల జగన్నాధరావు అన్నారు. కొత్తపేట గ్రామ పంచాయతీ పరిథిలో కోదువానిపేట,సాకివానిపేట, గాడు పేట గ్రామాలకు చెందిన పేదలందరికి చీరలు, దుప్పట్లు ఆయన పంపిణీ చేశారు. చీరలు, దుప్పట్లను న్యాయమూర్తి పప్పల గోవర్ధన్ దంపతులు, టీడీపి కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు, న్యాయవాధి పప్పల వెంకటరమణలు వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి జడ్జి పాల్గొని యువత ఇటువంటి సేవాకార్యక్రమాలు కొనసాగిస్తే సమాజాభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. సంక్రాంతి పర్వదినాల్లో పేదలకు బట్టలు పంచే కార్యక్రమం పూర్వికులనుంచి కొనసాగుతుందని, ఈ సాంప్రదాయాన్ని నేటి యువత ఆచరించడం అభినందనీయమన్నారు. వస్త్రాల పంపిణీ పుణ్యకార్యక్రమంలో ఒకటని ప్రతీ ఒకరు గుర్తెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అనె్నపు శ్రీమన్నారాయణ, న్యాయవాదులు పప్పల వెంకటరమణ, పొన్నాడ అప్పలనాయుడు, సనపల నారాయణమూర్తి, లెక్చరర్ గురుగుబిల్లి వెంకటరమణ, వెలుగు సిబ్బంది రమాదేవి, జర్నలిస్ట్‌లు చిగిలిపల్లి శ్రీనివాసరావు, గురుగుబిల్లి అప్పలనాయుడు,పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కొండెక్కిన మటన్ ధరలు
* మాంసం ప్రియులకు బాదుడు
ఎచ్చెర్ల, జనవరి 16: సంక్రాంతి పర్వదినాల్లో బంధువులు, ఆత్మీయులుకు మాంసాహారంతో కూడిన విందు ఇచ్చేందుకు ప్రతీ ఒక్కరు పోటీ పడడంతో మటన్ ధరలు అమాంతంగా కొండెక్కాయి. శ్రీకాకుళం నగరంతో పాటు జిల్లాలో వివిధ ప్రాంతాలలో మటన్ వ్యాపారులు ధరల పెంచి ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగించారు. సంక్రాంతి మంగళవారం పడడం, కనుమ బుధవారం కావడంతో ఈరెండు రోజులు అనేక మంది మాంసాన్ని భోజనం చేయడంతో మటన్‌కు మరింత గిరాకి పెరిగింది. మాంసం ప్రియుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని కిలో ధర రూ.650 నుండి 700 వరకు పెంచి అమ్మకాలు సాగించారు. దీంతో మాంసం ప్రియులు జేబులకు చిల్లులు పడ్డాయి. తలకాయి రూ.1500లు, బోటీ రూ. 800 లెక్క మటన్ వ్యాపారులు అమ్మకాలు సాగించిన వీటిని కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు బారులు తీరడం కన్పించింది. మటన్ వ్యాపారులు అమ్మకాలు సాగించే చోట కనీస పరిశుభ్రత కూడా పాటించకపోయినా కొనుగోలు దారులు అవేవి చూడకుండా వ్యాపారులు ఇచ్చిన వాటిని ఇంటికి ఎప్పుడు చేరుస్తామన్న ఆసక్తి కనబర్చడం దర్శనిమిచ్చింది. కంప్యూటర్ కాటాలలో తూకం సాగించినా శుభ్రపరిచే పేరిట నీరు కలిపి బరువు పెంచేలా అమ్మకాలుకు పాల్పడినా కొనుగోలుదారులు వెనుకంజ వేయలేదు. చికిన్ ధరలు మాత్రం కిలో రూ. 200కి మించకపోవడంతో వాటిని కొనుగోలు చేసిన వారికి మాత్రం కొంత ఊరట లభించింది. పండగ వేళ ధరలు పెంచి అమ్మకాలు సాగించిన మటన్ వ్యాపారులపై సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

..

జల్లెకట్టు రీతిలో కోడెబళ్లు పందాలు
పొందూరు,జనవరి 16: సంక్రాంతి పండగలు సందర్భంగా గ్రామీణ క్రీడల్లో భాగంగా హిందూ సాంస్కృతిక సంప్రదాయాల పద్దతిలో బుధవారం మండల కేంద్రంలో తమిళనాడులో జరిగే జల్లెకట్టు రీతిలో కొడెబళ్లు పందాలు ఘనంగా జరుపుకున్నారు. పురాతన పల్లె సంస్కృతిని ప్రతీ ఏడాది కనుమ రోజున రైతులు వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీ. రైతులు సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా తరతరాల సాంప్రదాయాన్ని కనుమనాడు ఆనవాయితీగా అంబరాన్ని తాకే రీతిలో కనుమ సంబరాలు గ్రామీణ క్రీడలుగా భావించారు. కొత్తబట్టలు ధరించి ఎద్దుల కొమ్ములకు రంగులు దిద్ది పిండి వంటకాలు సమర్పించి రైతులు గోపూజలు నిర్వహించిన తర్వాత ఎద్దులకు రెండు చిప్పల బల్లతో పురవీధుల్లో పరుగులు తీయించారు. గ్రామ పెద్దలు కోడెబళ్లుపై నిలబడి పురవీధుల్లో ప్రదర్శన చేయించిన తర్వాత డప్పువాయిధ్యాలతో యువకులు కేలింతల మద్య గిత్తలను పరుగులు తీయించారు. రైతులు ఆరంభంతో సంబరాలు నిర్వహించిన కోడె బళ్లు సంబరాలును చూసేందుకు నలుమూలల నుండి వచ్చిన జనం ఆనందంతో కనుమ పండుగ నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం గ్రామపెద్దలు అనకాపల్లి అక్కలనాయుడు, గాడు నాగరాజులతో కూడిన రైతు బృందం నాయకత్వం వహించింది.

యువతరానికి ఆశాజ్యోతి వివేకానందుడు
పొందూరు2 : యువకుల ఆత్మ విశ్వాశానికి ప్రగతి పథంలోనడిపించే ఆశాజ్యోతి వివేకానందుని ఆశయాలు నెరవేర్చాలని మండల టీడీపీ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఎండాన సత్యం అన్నారు. మండలం బురిడి కంచరాం గ్రామంలో బుధవారం జరిగిన వివేకానందుని జన్మదినోత్సవాలు సందర్భంగా మాట్లాడుతూ సమాజాన్ని ఆందోళన పరిచే సమస్యలను పరిష్కారం గూర్చి నిద్రిస్తున్న యువశక్తిని మేల్కొలిపిన కార్యోన్ముఖులును చేసే శక్తి స్వామివివేకానందునికే దక్కిందన్నారు. మందుగా వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక వివేకానంద, అంబేద్కర్ యువజన సంఘాలు ఘనంగా అంజలి ఘటించింది. జరిగిన క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నేతలు లోపింటి అప్పారావు, ఏ ఎంసి మెంబర్ మురళి, నవీన్, హరి, కృష్ణ, భాస్కరరావు, రామారావు పాల్గొన్నారు.

.

వైభవంగా కనుమ పండుగ
* జాతరలో ఆడిపాడిన చిన్నారులు
ఎచ్చెర్ల, జనవరి 16: సంక్రాంతి పర్వదినాల్లో ఒకటైన కనుమ పండుగను వైభవంగా పలు గ్రామాల్లో జరుపుకున్నారు. ఆచార సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే కనుమ పండుగను పురష్కరించుకొని గోపూజ కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. పొంగలిని తయారుచేసి గోవులకు పెట్టి పిల్లా పాపలతో ఆరగించి ఆనందంగా గడిపారు. పల్లెలన్నీ చుట్టాలు, బంధువులు, ఆత్మీయులు, అళ్లుల్లతో కలకలలాడాయి. ఇళ్లల్లో పిండి వంటలు, కొత్తబట్టలు, బావామరదుళ్లు, తోటికోడళ్లుతో సందడి నెలకొంది. సాయం సంధ్యావేళ జాతర కార్యక్రమానికి అందరూ హాజరై అక్కడ నిర్వాహకులు ఏర్పాటుచేసిన చిన్నారులు ఆడిపాడిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సరదాగా, సందడిగా గడిపారు. ఫరీద్‌పేట, కొత్తపేట గ్రామాల్లో ఈ జాతర బంధువులను కట్టిపడేసింది. జాతరకు విచ్చేసిన భక్తులు పంచదార చిలకలు చెరుకులు, కర్జూరం, శనగలు వంటివి కొనుగోలు చేసేందుకు ఎగబడడం కన్పించింది. జాతరలో రంగవళ్లికలు, పాటల పోటీలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి న్యాయనిర్ణేతలు ఇచ్చిన మార్కుల ప్రాతిపదికన బహుమతులు కూడా నిర్వాహకులు అందజేశారు. కొత్తపేటలో కోదండరాముని తిరువీధి ఉత్సవాన్ని కనులపండువుగా నిర్వహించారు.