శ్రీకాకుళం

సంక్రాంతి...4ఆటల సందడి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: కోడి పందెలకు ఉన్నత న్యాయస్థానం రెడ్ సిగ్నెల్ ఇచ్చినా..స్థానిక ప్రజాప్రతినిధులు - సంస్కృతి, సాంప్రదాయ ముసుగులో కోడిపందెలకు 3సై2 చెప్పేసారు! వద్దన్న కోడిపందెలే రూ. కోట్లలో జూదంగా మారిపోతే..పేకాట ఏ మాత్రం!! అంటూ ఈ పెద్ద పండుగకు కోట్లాది రూపాయల 3షో2 జోరందుకుంది. ఆదివారం నుంచి ప్రారంభమైన పండగ సందడి మరల ఆదివారం వరకూ ఆ వాతావరణంలో పూటుగా తాగే మందుబాబులూ, చేయితిరిగే పేకాటరాయుళ్ళు సంక్రాంతి4షో2 ఈ సారి జిల్లా కేంద్రంలో స్టార్ హోటళ్ళలోనే నిర్వాహకులు పేకాట శిబిరాలను నడిపారు. ఊరు పొరిమేరళ్ళో చెట్టుల కింద, పుట్టల మాటున నేలపై పెద్దమొత్తంలో ఆటాడేవారంతా జిల్లా కేంద్రంలో డే అండ్ నైట్ జంక్షన్, జి.టి.రోడ్డు, రామలక్ష్మణ సెంటర్, ఎస్పీ క్యాంపుకార్యాలయం పక్కనే గల స్టార్ హోటళ్ళల్లో బహిరంగ రహస్యంగా నడిపే ఈ 3షో2లు ఈ పెద్దపండుగను పేకాటరాయుళ్ళకు ఏసీ రూపంల్లో అలసట లేకుండా ముక్కపక్కనే, చుక్కపెట్టుకుని ఆటాడే అవకాశాన్ని ఈసారి పోలీసుశాఖ ఇవ్వకనే ఇచ్చింది. మాజీ మంత్రులు నుంచి ప్రధమ, ద్వితీయశ్రేణి రాజకీయ నాయకుల వరకూ అంతా కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా 3ఆట2లాడుకున్నారు. పేకాట, రేవ్‌పార్టీలు వద్ద మాత్రం పార్టీల పంతాలుపట్టింపులు లేవ్! స్టార్ హోటళ్ళు యాజమాన్యాలు ఏ పార్టీలకు అనుకూలంగా ఉన్నా అందరూ ఆ హోటళ్ళలో కోట్లాది రూపాయల 3షో2 కొట్టేయడానికి గత మూడు రోజులుగా ఎవరి స్థాయిలో వారు ఆరాటపడుతున్నారు. గతంలో రిక్రియేషన్ క్లబ్ అంటూ పేకాట డెన్‌గా ఉండేది. అక్కడే జిల్లా పెద్దమనుషులాంతా పేకాట ఆడేవారు. పార్టీలు, నాయకుల మధ్య దూరాలతో ఆ క్లబ్‌ను కొనే్నళ్ళుగా తాళాలు వేయడంతో తాజా 3బూకీ2కింగ్ పండగలా పేకాట శిబిరాలను నిర్వహించే బాధ్యతలుక ఒంతమంది నగర పోలీసు సిబ్బంది సహాకారంతో యధేచ్చగా సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు. అంతేకాకుండా, ఈ పేకాట శిబిరాల్లో నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ పొంగిపర్లింది. ఫారెన్ లిక్కర్ మోజుతో పెకాటరాయిళ్ళు దానికి కూడా సపరేట్‌గా మోనూ, బిల్లు చెల్లించుడంతో సిక్కోల్ సిండికేట్4కింగ్2 మంచి భేరం కుదుర్చుకున్న టాక్ నగరంలో హాల్‌చల్ చేస్తోంది. స్టార్ హోటళ్ళలో పేకాట, దానికి వచ్చిన రాజకీయ, ఆర్థిక బలుపుగల వారికి తగ్గట్టుగా లీటర్లు కొలది సీమసరుకు(్ఫరెన్‌మద్యం) సరఫరా చేస్తున్నకొలది, ఖాళీ చేస్తునే వున్నారు. వీటన్నింటికీ సంబంధించిన సమాచారం పూర్తిగా పోలీసు స్టేషన్ హౌస్ అధికారులకు తెలిసినప్పటికీ, ఆ హోటళ్ళకు వెళ్ళే దారులే వారు మర్చిపోయారు. కనీసం నాకాబందీ నిర్వహించాల్సిన పోలీసులు సంక్రాంతి సెలవును ప్రకటించారు. అబ్కారీశాఖ అధికారులు సైతం లక్షలాది రూపాయల నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ స్టార్ హోటళ్ళు, రిసార్ట్స్‌లో పేకాటాడుతూ తాగుతున్న పెద్దోళ్ళతో వైనం ఎందుకని తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలా..ఈ పెద్దపండుగ పసుపుదండు అండదండలతో పేకాట4షో2 సందడిగా సాగిపోతుంది! మరో మూడు రోజులు ఈ వాతావరణంలో జిల్లా కేంద్రంలో అన్నీ స్టార్ హోటళ్ళు ఉంటాయని తెలిసింది. భోగి, సంక్రాంతి, కనుమ గడిచిపోయాయి. ముక్కనుమ తర్వాత గ్రేస్‌గా ఆదివారం వరకూ ఈ పేకాట, రేవ్ పార్టీలు న ఇర్వహించేలా నిర్వాహకులు అంతా సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఓన్లీ ఫర్ డాక్టర్స్ ఇన్ రేవ్ పార్టీ అంటూ ప్రత్యేక ఆస్వానం ఇవ్వడం ఈ పండుగ స్పెషల్ ఆఫర్! తాగినంత తాగి..ఊగినంత ఊగుతూ సంబరం చేసుకునేవారు కొందరైతే, దాచుకుందంతా 3షో2 కొట్టేయాలన్న తపనతో చితె్తైనవారు మరికొందరు. వీరిందరికీ ఈ ఏడాది వేదికగా క్లబ్ కల్చర్ ఉండేది. పాపం తప్పొవోప్పో చాటుమాటను కొన్నాళ్ళు, బహిరంగంగా సర్కార్ అనుమతులతో మరికొన్నాళ్ళు నడిచే జిల్లాలో ఏకైక రిక్రియేషన్ క్లబ్‌కు దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు పోరాటంతో తాళాలు పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పెద్దపండుగ వస్తే చాలు పేకాటరాయుళ్ళు జిల్లా పొరిమేరళ్ళో రిసార్ట్స్‌కు కొందరు డాక్టర్లు, వ్యాపారస్తులు, రాజకీయ నేతలు కలిసి వెళ్ళే సంస్కృతిని ఆలవాటు చేసుకున్నారు. ఈ ఏడాది మాత్రం అంతటి వ్యయప్రయాసలు లేకుండా జిల్లా కేంద్రంలోనే స్టార్ హోటళ్ళలోనే సంబరాలు చేసుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేసారు. ఉభయగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం చేరుకున్న పేకాటరాయుళ్ళు కొన్ని స్టార్ హోటల్లే కాకుండా సందుల్లోగల లాడ్జీల్లో కూడా పేకటా నిరాటంకంగా సాగిస్తున్నారు. పారిశ్రామిక ఓడగా పేరున్న రణస్తలం సమీపంలో అనేక తోటల్లో ఈ పేకాట రూ. కోట్లు జరుగుతుంది. దీనికి సాలూరు, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట తదితర ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్ళు తమ వాహనాల్లో రాకపోకలు సాగించడం పోలీసుశాఖ అధికారులకు పూర్తి సమాచారం ఉన్నప్పటికీ హైవేపై నాకాబందీ న ఇర్వహించకపోవడంతో వాహనాల్లో రవాణా జరిగే కోట్లాది రూపాయలు నల్లధనం పట్టుబడే అవగాశం లేకుండాపోయింది. అలాగే, చీపురుపల్లి, సుభద్రాపురం జంక్షన్ రోడ్లు, రాజాం నుంచి చికపాలేం కూడిలి, పాలకొండ నుంచి కళింగపట్నం రోడ్డు మార్గానికి ఆనుకుని గల పేకాటరాయిళ్ళ కేరాఫ్ తోటల్లో గత రెండు రోజులుగా పేకాట ఆరంభమైంది. ఇదిలా ఉండగా, గోపీనగరం తోటలో రాత్రివేళల్లో విద్యుత్ దీపాల నడుమ పెద్దమొత్తంలో పేకాట జరుగుతుంది. కానీ - పోలీసు నిఘానేత్రం మాత్రం పనిచేయుకుండా పోయింది. జిల్లా అంతటా నడిచే ఈ 3షో2లకు పోలీసుశాఖ అండదండలు ఉన్నాయన్నది పేకాట నిర్వాహకులు చెప్పే చివరి మాట!!