శ్రీకాకుళం

విద్యార్థి దశ మరువరానిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 19: విద్యార్థిదశ మరువరానిది అని ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.మండలంలోని ఈదుపురం పాఠశాలలో 2007-08 సంవత్సరంలో చదివిన 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయసభను నిర్వహించారు. అప్పటి ఉపాధ్యాయులను సన్మానించారు. పాఠశాలలో మొక్కలు నాటడం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ అప్పటి మధురజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, ధనుంజయ్, ఆనంద్, గోపి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాలో తప్పొప్పులు సరిచూసుకోండి
రాజాం, జనవరి 19: రాజాం నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితా తుది ప్రచురణ ఈ నెల 11న జరిగిందని, ఓటర్ల పేర్లు, ఇతర అంశాలు తప్పొప్పులను సరిచూసుకోవాలని రాజాం తహశీల్దార్ సత్యనారాయణ కోరారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇందుకు సంబంధించిన జాబితాలను వేలాడదీశామని, అందులో ఓటర్లకు సంబంధించిన అంశాలను సరిచూసుకోవాల్సిందిగా కోరారు.

కొత్త అంతకాపల్లికి బీటీ రోడ్డు మంజూరు
రాజాం, జనవరి 19: రాజాం మండలం అంతకాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త అంతకాపల్లికి బీటీ రోడ్డు మంజూరైందని ఆ గ్రామ మాజీ సర్పంచ్ ప్రతినిధి వాకముళ్ల చిన్నారావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న గోర్జీని రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో రహదారి ఏర్పాటు కాలేదని, అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పటికీ ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని, ఒక కోటి 50 లక్షల వరకు నిధులు మంజూరైనట్టు తనకు వర్తమానం అందిందన్నారు. చిరకాలంగా ఈ గ్రామానికి రహదారి లేకపోవడంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సి ఉందని, దీంతో సమస్య పరిష్కారమైందన్నారు.
గ్రామాల్లో టీడీపీ బలోపేతానికి కృషి
రాజాం, జనవరి 19: రాజాం మండలంలోని 20 గ్రామ పంచాయతీల పరిధిలోని సుమారు 46 గ్రామాల్లోని టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఎంపీపీ జడ్డు ఉషారాణి, పొగిరి ఎంపీటీసీ సభ్యుడు ఎస్.జగన్మోహన్‌రావు, మాజీ సర్పంచ్ జడ్డు విష్ణుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాజాం మండలంలో పార్టీ బలోపేతంగా ఉందని, మరింత ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియపరిచి మరింత మద్దతు కూడగడతామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో త్వరలో సమావేశం కూడా నిర్వహిస్తామన్నారు.
అడ్వంచర్ పార్క్‌లో అదనపుహంగులు
సీతంపేట, జనవరి 19: మండల కేంద్రం సీతంపేటలోని ఎన్టీ ఆర్ అడ్వంచర్ పార్క్‌లో ఐటీడీ ఏ అదనపు హంగులతో కూడిన వినోద క్రీడలను ఏర్పాటు చేశారు. శనివారం పార్క్‌లోని చెరువులో నూతనంగా మోటార్ బోటు, వాటర్స్‌స్టింగ్, రెండు సాయాకింగ్ బోట్లును ఏర్పాటు చేశారు. వీటిని ఐటీడీ ఏ ఏపీవో ఎల్. ఆనందరావు, ఎంపీటీసీ దమయంతినాయుడు ప్రారంభించారు. అలాగే చిన్నారులు కోసం గైరోను కూడా శనివారం ప్రారంభించారు. వీటి ఖరీదు రూ.12 లక్షలు అని, చిన్నారులు కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని ఐటీడీ ఏ ఏపీవో ఆనందరావు పేర్కొన్నారు. సంక్రాంతి ముగిసినప్పటికీ శనివారం కూడా ఎన్టీ ఆర్ అడ్వంచర్ పార్క్‌తో పాటు మెట్టుగూడ జలపాతానికి పర్యాటకుల తాకిడి అధికమైంది. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటేశ్వరరావు, డీపీవో సతీష్, అధికారులు పాల్గొన్నారు.

టీడీపీ, వైకాపా, బీజేపీలను నమ్మవద్దు
*ప్రత్యామ్నాయానికి ప్రజలు మద్దతు పలకాలి
పాలకొండ (టౌన్), జనవరి 19: రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి అభివృద్ధిని విస్మరించి దోపిడీకి పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలు బీజేపీ, టీడీపీలను నమ్మవద్దని, అలాగే వైకాపాను కూడా ప్రజలు బుద్ది చెప్పాలని సీపీ ఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు అన్నారు. శనివారం సీపీ ఐ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి ప్రజలకు మోసం చేశారన్నారు. గత నాలుగేళ్లలో పేదరికం, నిరుద్యోగం, అసమానతలకు చిరునామాగా రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందన్నారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేశారన్నారు. కార్మికులు, కర్షకులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో నీరందించలేక పంటలు పాడై వ్యవసాయం నష్టాల్లోకి కూరుకుపోయిందన్నారు. కార్పొరేట్లకు వేలాది రూపాయలు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందన్నారు. వైకాపా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కాదన్నారు. జనసేన, సీపీ ఎం, సీపీ ఐ పార్టీలకు ప్రజలు మద్దతు పలికి రాష్ట్రం అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అలాగే సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం, సుపరిపాలన, మతసామరస్యం, లౌకిక వాద సంరక్షణ నూతన ప్రత్యామ్నాయంతోనే సాధ్యమన్నారు. నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి గూర్చి కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీ ఐ నాయకులు బుడితి అప్పలనాయుడు, గేదెల చిరంజీవి, ద్వారపూడి అప్పలనాయుడు, పాలక పెంటయ్య ఉన్నారు.