శ్రీకాకుళం

ఉద్దాన కిడ్నీ బాధితులకు అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రపుకొత్తూరు, జనవరి 19: ఉద్దాన కిడ్నీ బాధితులకు అండగా ఉండాలని మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చానని, ఇక్కడి వారి కిడ్నీ సమస్యలు విన్న తర్వాత సమస్య తీవ్రంగా ఉందనే విషయం బోధపడిందని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణనందస్వామిజీ అన్నారు. శ్రీపీఠం, గౌతులచ్చన్న బలహీనవర్గాల సేవా సంస్థ(గ్లో) సంయుక్తంగా ఉద్దాన కిడ్నీ బాధితులు కోసం వ్యాధినిర్థారణ సంచార కేంద్రాన్ని శనివారం స్వామిజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోని మానవత్వం చాటుకోవాలన్నారు. తన ప్రవచనాలు ద్వారా ఈ విషయాన్ని బోధించడం తన జన్మకు సార్థకత చేకూరుతుందన్నారు. అంధురాలైన తన తల్లి ఆదేశానుసారం ఆపదలో వున్న వారిని ఆదుకోవడంలోనే ఆనందం వెదుక్కుంటానన్నారు. మానవసేవ మాధవసేవ అని గుర్తురెగి తోటివారికి సహాయం పడడంలోని తృప్తి మరి ఎందులో లభించందన్నారు. మీ గుమ్మం దగ్గరకు వస్తున్న వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తిత్లీ తుపాన్ ఉద్దానాన్ని పూర్తిగా కబళించడం కలచివేసిందని, ఆ విషయాన్ని స్వయంగా చూడడం ద్వారా మనస్సును కలచివేసిందన్నారు. కోనసీమను తలదనే్న ఉద్దానాన్ని ఉద్యానవన వనంలా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే శివాజీ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులు ఉద్దాన ప్రాంతంలోనే కాక రాష్టవ్య్రాప్తంగా ఉన్నాయన్నారు. అనవసర భయోత్పాతాలను సృష్టించి భయపెట్ట వద్దు అని అన్నారు. ఆరంభ దశలో గుర్తించాలనే ఉద్దేశ్యంలో గ్లో సంస్థ, శ్రీపీఠంతో కలిసి సంచార వ్యాధినిర్థారణ కేంద్రాన్ని నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త వెంకన్నచౌదరి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విఠల్, వంక నాగేశ్వరరావు, డెప్యూటీ డి ఎం అండ్ హెచ్‌వో లీలారాణి, ఎంపీపీ వసంతస్వామి, టీడీపీ మండల అధ్యక్షుడు పాపారావు, చైతన్య, వెంకటరావు, సూరిబాబు, వైస్ ఎంపీపీ జేజేరావు, కె.రామన్న తదితరులు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు ఇంటికి పెద్దకొడుకుగా ఆదుకుంటున్నారు
పలాస, జనవరి 19: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పెద్దకొడుకుగా సీ ఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక పథకాలు అందిస్తూ ఆదుకుంటున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషా అన్నారు. పింఛన్ 1000 నుంచి 2 వేల రూపాయలకు పెంచడంతో 23వ వార్డుకి చెందిన పింఛన్‌దారులు 23వ కౌన్సిలర్ పట్ట మాధవిమల్లేసు ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేసి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు. ఈ సందర్భంగా శిరీషా మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగలముఠానాయకుడు తిరుగుతున్నారని, అటువంటి నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దు అని, పనిచేసే నాయకుడు చంద్రబాబు అని, 14 నెలలు పాటు జైలులో ఉండి ప్రతి శుక్రవారం ఇక్కడే ఉన్నానని కోర్టుకు హాజరవుతున్న జగన్ దొంగ కాకపోతే మరి ఏమి అవుతారో మీరే చెప్పాలన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసం 70 ఏళ్లు వయస్సులో చంద్రబాబునాయుడు కృషి చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకోవడం జగన్ వంతు అని అన్నారు. ప్రజలకు జగన్ ఏమి ఇచ్చాడని ప్రశ్నిస్తూ ఎన్ ఆర్ జి ఎస్ కూలీల పొట్టను కొట్టారని ఎద్దేవా చేసారు. వార్డు కౌన్సిలర్ ప్రతినిధి మల్లేసు మాట్లాడుతూ పింఛన్‌దారులు నుంచి డబ్బులు వసూలు చేసామని వైసీపీ నాయకులు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టడం కాదని, చేతనైతే నిరూపించాలని, ఎటువంటి చర్యలకు సిద్దమని, వారు నిరూపించకపోతే వైసీపీ నేత ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎ ఎంసి చైర్మన్ మాల్లా శ్రీనివాసరావు, పలాస ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ జి.సూర్యనారాయణ, నిమ్మాన బైరాగి, సవర రాంబాబు, ఎన్.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారం
మందస, జనవరి 19: న్యాయవిజ్ఞాన సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కారించుకోవాలని సోంపేట సీనియర్ సివిల్ జడ్జి సునీల్‌కుమార్ అన్నారు. మందస మండలం, అంబుగాంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకుంటే సమస్యలు సామరస్యంగా పరిష్కారమవుతాయని, గ్రామాల్లో నేటికి వరకట్న నిషేధం కోసం ప్రజలు చేయూతను ఇవ్వాలని, తగాదాలు లేని ఆచారవ్యవహారాలను కొనసాగించాలన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వరలక్ష్మి, బార్ ఆసోషియేషన్ అధ్యక్షుడు నాగభూషణ్, న్యాయవాదులు శైలేంద్రశర్మ, బిపి యాదవ్, బి.లక్ష్మినారాయణ, కృష్ణారావు, జోగారావు, ఎంపీటీసీ చౌదరి మురళీకృష్ణ, ఎస్ ఐ నాగరాజు పాల్గొన్నారు.

కలప అక్రమరవాణా చేస్తే క్రిమినల్ చర్యలు
ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 19: అటవీశాఖ అనుమతి లేకుండా కలప అక్రమంగా రవాణా చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అటవీశాఖాధికారులు పద్మనాభం, రమేష్‌లు పేర్కొన్నారు. ఇటీవల జగన్నాథపురం, టి.బరంపురం, శాసనం పరిసరాల్లో రోడ్లు ప్రక్కన వున్న చెట్లు అక్రమరవాణాను పరిశీలించారు. ఈ చెట్లులో ఎక్కువగా అక్రమ రవాణా కావడంతో ఇచ్ఛాపురం పట్టణం సమీపంలో తనిఖీలు చేపట్టారు. బెల్లుపడ వద్ద వున్న ఓ చోట కలపను గుర్తించి, దానికి 10 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కలప అక్రమరవాణాకు సంబంధించి కొంతమంది అధికారులు అక్రమంగా చెట్లును తొలగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికే కలప రవాణా చేసిన భారీ వందల ఏళ్లు నాటి చెట్లు రోడ్డు ప్రక్కన నరికి ఉండడాన్ని గుర్తించామన్నారు. జిల్లాస్థాయి అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.

రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో ఇచ్ఛాపురం ద్వితీయ స్థానం
ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 19: కర్నూలులో జరుగుతున్న రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో ఇచ్ఛాపురంవాసి రమణారావు ద్వితీయస్థానం కైవాసం చేసుకున్నారు. గత వారం రోజులుగా 38వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు జరుగుతున్నాయి. అందులో రమణారావు 110 పాయింట్‌లు సాధించి ద్వితీయస్థానంలో నిలిచారు. నిర్వాహకులు బహుమతులు అందించారు.