శ్రీకాకుళం

పోరాట పటిమే జనసేన సిద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, జనవరి 19: కులాలు వేరైనా, మతాలు ఎన్నొన్నా పేదలకు అన్యాయం జరిగినప్పుడు పోరాట పటిమే జనసేన సిద్ధాంతంగా పోరాడి తారాలని ఆమదాలవలస నియోజకవర్గ జనసేన ప్రతినిధి హంస బాబి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాపాక, జాడపేట గ్రామంలో శనివారం జనసేన పతాక ఆవిష్కరణగావించిన సందర్భంగా పై విధంగా అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. పల్లె పల్లెల్లో పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. ఎన్నికల సమరానికి కార్యకర్తలు ప్రతీ గ్రామంలో పార్టీ బలోపేతానికి తోడ్పడాలని ఆయన కోరారు. అధికార పార్టీల వ్యతిరేక భావజాలంతో ప్రజల్లోకి వెళ్లాలంటే కార్యకర్తలు ఐక్యత, సిద్ధాంత పటిమ అవసరమన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య, నిరంకుశ వైఖరిపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా పనిచేయాలన్నారు. ఏ ఒక్కరూ కాలాన్ని నిర్వీర్యం చేయకుండా సామాన్య వాడల్లో జనసేన సిద్ధాంతాన్ని విపులంగా తెలియజేయాలన్నారు. పవన్‌కళ్యాణ్ ఆశయం, ముఖ్యోద్దేశ్యం ప్రజా చైతన్యమే అన్నారు. అణగారిన వర్గాలకు, రైతులకు అన్యాయం జరిగితే జనసేనకులు తిరుగుబాటు వెల్లువై సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నేతలు కొంచాడ అప్పలనాయుడు, గౌరినాయుడు, శ్రీనివాసరావు, రామారావు, చంటి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ ఓటర్లు జాబితాలో చేర్చాలి
ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 19:మార్చిలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఓటర్లు జాబితాలో ఇచ్ఛాపురంకు చెందిన 37 మంది ఉపాధ్యాయులను చేర్చాలని ఏపిటి ఎఫ్ జిల్లా కార్యదర్శి అనంతాచార్యులు తహసీల్థార్ సురేషుకు వినతిపత్రం అందించారు. నూతనంగా చేరిన ఉపాధ్యాయుల పేర్లు జాబితాలో లేవని, వాటితోపాటు కొత్తవాటిని చేర్చాలని వినతిలో పేర్కొన్నారు.

నిరుపేదలకు అండ రాష్ట్ర ప్రభుత్వం
కవిటి, జనవరి 19: రాష్ట్రంలోని నిరుపేదలకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ఈ మేరకు మెళియాపుట్టుగలో రఘునాధ్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు. ప్రధానమంత్రి చంద్రన్నబీమా తక్షణ సహాయం 5 వేల రూపాయలను మృతుల కుటుంబీకులకు అందజేసారు. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. బల్లపుట్టుగ గ్రామానికి చేరుకొని ఇటీవల లక్ష్మినారాయణ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జడ్‌పీటీసీ బెందాళం రమేష్, ఎంపీటీసీ వెంకటరమణ, మాజీ సర్పంచ్ పి.శేఖర్, పార్టీ నాయకులు బీమారావు తదితరులు పాల్గొన్నారు.

వ్యాధిగ్రస్తుడుకు ఆర్థికసహాయం
కవిటి, జనవరి 19: మండలంలోని కళింగపట్నం మత్స్యకార గ్రామానికి చెందిన మెదడువాపు వ్యాధిగ్రస్తుడు హరికృష్ణకు రాష్ట్ర వైసీపీ కార్యదర్శి నర్తు రామారావు కొంత ఆర్థికసహాయాన్ని శనివారం అందజేసారు. ఈ మేరకు కళింగపట్నం గ్రామానికి చేరుకొని గ్రామంలో హరికృష్ణతో మాట్లాడారు. వ్యాధితో బాధపడుతున్న తరుణంలో తండ్రి మృతి చెందడాన్ని తెలిపారు. ఈ మేరకు నర్తు ఆర్థికసహాయాన్ని అందజేసారు. మత్స్యకారులు పాల్గొన్నారు.

సాక్షరభారత్ కార్యకర్తలను ఆదుకోవాలి
సంతబొమ్మాళి, జనవరి 19: మండలంలో సాక్షరభారత్ కార్యకర్తలను ఆదుకోవాలని సంతబొమ్మాళి మండలం, సాక్షరభారత్ మండల కో ఆర్టినేటర్ రమేష్‌తోపాటు మండలంలో గల పలువురు సాక్షరభారత్ కార్యకర్తలు రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును శనివారం కలిసి వినతిపత్రం అందించారు. సాక్షరభారత్ కార్యక్రమం ఏర్పాటు చేసిన నాటి నుంచి అదే వృత్తిపై జీవిస్తున్నామన్నారు.

పోటాపోటీగా జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
సంతబొమ్మాళి, జనవరి 19: సంక్రాంతి సందర్భంగా నౌపడ పంచాయతీ, సీతానగరంలో జరిగిన కబడ్డీ పోటీలు రెండవ రోజు శనివారం రాత్రి వరకు పోటాపోటీగా సాగాయి. ఈ పోటీల్లో సీతానగరం కబడ్డీ జట్టుపై వడ్డితాండ్ర విజయం సాధించగా, చిన్ననారాయణపురంపై అమలపాడు, పి ఎం పురంపై మర్రిపాడు, గోవిందపురంపై యుజిపురం, వెంకటాపురం కబడ్డీ జట్లు విజయం సాధించాయి. ఆర్‌కేపురంపై సీతానగరం, సీతానగరంపై సౌఢాం జట్టు, శివరాంపురంపై వడ్డితాండ్ర, సెనిగిపెంట జట్టుపై గొదలాం కబడ్డీ జట్టు, పోడూరుపై కొతపేట-డి జట్లు విజయం సాధించాయి. క్రీడాభిమాని వి.కృష్ణారావు, ఎంపీటీసీ నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో ఈ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి.