శ్రీకాకుళం

కాలువ,టవర్ నిర్మాణంపై జనాగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, జనవరి 21 : పట్టణంలోని రత్తకన్న తోటవీధిలో కాలువ నిర్మాణం, బ్రాహ్మణ వీధిలో సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వేర్వేరుగా ఆందోళనకు దిగారు. తమ స్థలాలను ఆక్రమించుకుని కాలువ నిర్మాణం చేపట్టారని తోటవీధి వాసులు మున్సిపల్ చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి, కమిషనర్ ఎల్.రామలక్ష్మిలకు ఫిర్యాదు చేశారు. నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సెల్‌టవర్ నిర్మాణం వల్ల అనారోగ్యం పాలవుతామని 7,8 వార్డుల ప్రజలు వాపోయారు. టవర్ ఏర్పాటును నిలిపివేయాలని కోరుతూ చైర్‌పర్సన్, కమిషనర్‌లకు వినతిపత్రం ఇచ్చారు. పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వటంతో శాంతించారు.

పాడైన విద్యుత్తు లైన్‌లను మరమ్మతులు చేపట్టండి
మందస, జనవరి 21: తిత్లీ తుపాన్ ప్రభావంతో భిన్నలమదనాపురం గ్రామంలో విద్యుత్తు లైన్‌లు, మోటారుపంప్‌షెడ్లు నేలకొరిగి సుమారు 100 రోజులు కావస్తున్నా విద్యుత్తుశాఖ అధికారులు నిర్లక్ష్యంతో 25 మంది రైతుల వ్యవసాయ భూములకు సాగునీరు అందడం లేదని సోమవారం తహసీల్థార్ శ్యామసుందరరావు, ఎంపీడీవో రాజేశ్వరరావు, విద్యుత్తు ఎ ఇ సూర్యనారాయణలకు ఆ గ్రామానికి చెందిన రైతులు ఎం.మన్మధరావు, అప్పలస్వామి, పూర్ణలతోపాటు 10 మంది అర్జీలను అందజేసారు. పాడైన విద్యుత్తులైన్‌లకు తక్షణమే మరమ్మతు చర్యలు చేపట్టాలని, రైతులు విద్యుత్తుశాఖకు సర్‌చార్జీలు చెల్లిస్తున్నామని, మోటారుపాడైనాయని, తమ పంట పొలాలకు సాగునీరు లేక ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయామని అధికారులు తక్షణమే స్పందించి పొలాలు బీడు భూములుగా మారకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
నాణ్యతతో పనులు చేయాలి
మందస, జనవరి 21:మండలంలోని బాలిగాం గ్రామానికి పంచాయతీశాఖ మంత్రి నారా లోకేష్ 33 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, కాలువలు, పైపులైన్‌లకు నిధులు మంజూరు చేసారని, నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని ఎంపీడీవో బి.రాజేశ్వరరావు అన్నారు. సోమవారం బాలిగాం గ్రామంలో అంబేద్కర్‌వీధి, బీసీవీధుల్లో జరుగుతున్న సీసీ రోడ్లు, కాలువ పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈయనతోపాటు టీడీపీ నాయకులు బి.దుర్యోదన, రాజేశ్వరరావు, సంజీవ్, రామయ్య, టి.పాపారావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మాజీ ఎంపీపీ జన్మదిన వేడుకలు
కవిటి, జనవరి 21: స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ తండ్రి బెందాళం ప్రకాశ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండలంలోని ప్రగాడపుట్టుగ గ్రామంలో గల రామాలయం వద్ద ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకాశ్ దంపతులు పాల్గొన్నారు. కేక్‌ను కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర యువజన సంఘం నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలలో పలు కార్యక్రమాలను, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పీటీసీ బెందాళం రమేష్, కవిటి మాజీ సర్పంచ్ పాండవ చంద్రశేఖర్, వెంకటేశ్వరయువజన సంఘం సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిన్నారులకు సహాయం
కవిటి, జనవరి 21: మండలంలో కళింగపట్నం మత్స్యకార గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలోని చిన్నారి విద్యార్థులకు సామాజిక కార్యకర్త బసశే్వరకుమార్ విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు తదితరాలు అందజేసారు. వెనుకబడిన ప్రాంతాలను ఆదుకోవడంలో భాగంగా ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో నిరుపేదలకు తన వంతు సహాయంగా చదువుకు అవసరమైన అన్ని రకాల వస్తువులను అందజేయడం జరిగిందని తెలిపారు. వాటిని పాఠశాలలో ఉపాధ్యాయులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో గీతాదేవి, విజయకుమార్,లోకనాధం, గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లు పాల్గొన్నారు.