శ్రీకాకుళం

త్రిసభ్య కమిటీని కలిసిన ఐక్యవేదిక ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, జనవరి 21: మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్.డి.సంపత్‌కుమార్, రంగారావు, పిడి సత్యపాల్‌కుమార్‌లను జిల్లా పరిషత్ సమావేశమందిరంలో తీరప్రాంత మత్స్యకార ఐక్యవేదిక ప్రతినిధులు సోమవారం కలిసారు. ఈ సందర్భంగా ఎకువూరు గ్రామానికి చెందిన శాస్తవ్రేత్త జి.వెంకటరావు మత్స్యకారుల స్థితిగతులపై అధ్యయనం చేసి వ్రాసిన 100 పేజీల పుస్తకాన్ని కమిటీ సభ్యులకు ఐక్యవేదిక ప్రతినిధులు సోమయ్య, సూరాడ చంద్రమోహన్, ఎం.గోపాల్, బడే తమ్మయ్యలతోపాటు ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది మత్స్యకారులు కలిసి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతినిధులతో వారు మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా చేపలవేటే జీవనాధారంగా బతుకుతున్న తమ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని అనేక ఉద్యమాలు చేసామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎస్టీలో చేర్చాలని కోరినట్లు వారు తెలిపారు.
ఫౌండేషన్ వాహనంలో రోగి తరలింపు
సోంపేట, జనవరి 21: ఉద్దానఫౌండేషన్ అంబులెన్స్‌లో బెంకిలి గ్రామానికి చెందిన పి.సుర్జీని సోంపేట నుంచి శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి సోమవారం తరలించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు తెలిపారు.
అర్హులందరూ ఓటర్లు జాబితాలో నమోదు చేసుకోవాలి
ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 21: ఓటర్లుందరూ జాబితాలో నమోదు చేసుకోవాలని ఎన్నికల డెప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ తెలిపారు. సోమవారం ఇచ్ఛాపురం తహసీల్థార్ కార్యాలయంలో కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాలకు చెందిన తహసీల్థార్ల్‌తో ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు పూర్తియిన ప్రతి ఒక్కరూ తమ పేర్లును నమోదు చేసుకోవాలని తెలిపారు. పేర్లు ఒక చోట నుంచి మరో చోటకు మార్చుకోవాలంటే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఓటర్లు జాబితాలో చేర్పులు, మార్పులకు సంబంధించి పలు అంశాలపై సూచనలు చేసారు. తహసీల్థార్‌లు సురేషు, రామ్మోహనరావు, ఉమామహేశ్వరరావు, గోపాలరత్నం పాల్గొన్నారు.
ఇళ్లు స్థలాలు కోసం ఆందోళన
ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 21: ఇచ్ఛాపురం పట్టణంలోని రత్తకన్న వద్ద ఉన్న కొండ ఆక్రమణపై రత్తకన్నకు చెందినవారు పెద్ద ఎత్తున తహసీల్థార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసారు. స్థానికులకు కాకుండా వేరేవారు కొండను ఆక్రమించుకుంటూ ఇళ్లును నిర్మించుకుంటున్నారని తహసీల్థార్‌కు తెలిపారు. తమకు ఇళ్లు స్థలాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని, తమకు కాకుండా వేరే వారికి కేటాయించడంపై సుమారు గంటపాటు తహసీల్థార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. గ్రామంలోని పేదవారికి ఇచ్చిన తర్వాత ఇతరులకు స్థలాలు కేటాయించాలని వినతిపత్రం అందించారు.

మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
సంతబొమ్మాళి, జనవరి 21: మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర మత్స్యకార సంఘం అధ్యక్షుడు రాజారావు, మత్స్యకార సంఘం నాయకులు ఎస్.జోగారావు, సూర్యనారాయణ, గణపతిరావు, బి.కుమారస్వామిలు అన్నారు. మత్స్యకారుల స్థితిగతులపై అధ్యయం చేసేందుకు ఆంధ్రాయూనివర్శిటీ ప్రోఫెసర్లుకు నివేదిక సమర్పించారు. గత 70 సంవత్సరాలు నుంచి మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాటం చేస్తున్న ఫలితం లేకపోతుందన్నారు. ఇప్పటికైనా స్థితిగతులను పరిశీలించి ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు వినతిపత్రంలో కోరారు.
ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
సంతబొమ్మాళి, జనవరి 21: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు పథకాలను వినియోగించుకోవాలని కాపుగొదాయివలస పాఠశాల హెచ్ ఎం సంజీవరావు అన్నారు. సోమవారం పాఠశాలలో సీ ఎం బాలసురక్ష పథకంలో భాగంగా విద్యార్థులకు ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు జగన్నాథం, కాంచన, హెచ్ ఎం రామకృష్ణ, రాజేశ్వరరావు, శ్యాంసుందరరావు, సీతారామ్, హరిప్రియ, ఉమశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు.

టీడీపీ అరాచకాలపై ఇంటింటి ప్రచారం
ఇచ్ఛాపురం, జనవరి 21 : టీడీపీ ప్రభుత్వ అరాచకాలపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తామని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ చెప్పారు. సోమవారం ఆయన మున్సిపల్ చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి, పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలను నెరవేర్చకుండా టీడీపీ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసగించిందన్నారు. వడ్డీలతో కలిపి లక్షా 36 వేల కోట్ల రూపాయల మేర రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా 14 వేల కోట్ల మేర మాత్రమే చేసిందన్నారు. జగన్ పాదయాత్ర విజయవంతమవటంతో భయపడి పింఛన్లను రెండు వేల రూపాయలకు పెంచారని విమర్శించారు. తిత్లీ తుఫాను బాధితులకు, కిడ్నీ రోగులకు అన్యాయం చేశారన్నారు. నష్ట పరిహారం టీడీపీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే అందిందని చెప్పారు. నేతలు పి.దేవరాజురెడ్డి (సంతు), తాడి ఆదిరెడ్డి, ఎం.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.