శ్రీకాకుళం

తిత్లీ బాధితులకు పరిహారం అందేవరకు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం,జనవరి 21: జిల్లాలోని పలాస నియోజకవర్గంలో తిత్లీ తుఫాన్ బాధితులకు ఇంకా నష్టపరిహారం అందేవరకు వారికి అండగా పోరాటం చేస్తానని పలాస ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ డైరెక్టర్ గౌతు శ్యామసుందర శివాజి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు 21 రోజుల పాటు జిల్లాలోనే ఉండి తిత్లీ తుఫాన్ బాధితులకు ఎంతో భరోసా,నమ్మకాన్ని కల్గించారని ఆయన గుర్తు చేశారు. నవంబర్ 5న కొంతమంది బాధితులకు నమూనా చెక్‌లను ముఖ్యమంత్రి అందించారని ఆ చెక్కుల్లో కూడా అనేకమందికి ఇప్పటికి వారి ఖాతాల్లో పరిహారం జమకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు బాధిత గ్రామాలు సందర్శించి నష్టం అంచనాలను రూపొందించి నిష్క్రమించారని, ఆశించిన స్థాయిలో బాధిత కుటుంబాలకు పరిహారం అందించే కార్యక్రమం జరగలేదన్నారు. తాము జన్మభూమి సభలకు గ్రామాల్లో తిరిగినప్పుడు 95 శాతం మంది బాధితులకు అందాయని, నేరుగా వారి ఖాతాల్లోనే జమయ్యాయని శివాజీ స్పష్టం చేశారు. రాజాం జన్మభూమి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేయగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష బాధితులకు నష్టపరిహారం విషయమై సి ఎం దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్ నుంచే పరిహారం అందించాలని ఆదేశాలు జారీచేశారని ఆయన తెలియజేశారు. సంక్రాంతి పండగ తర్వాత కూడా తనకు దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటికి పరిహారం అందలేదని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు వివరించారు. వౌన దీక్ష అన్నానని, అయితే అది చేయడం లేదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించేలా వౌన దీక్షకు దిగుతానని హెచ్చరించానని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో కూడా చెక్‌లు పంపిణీ చేశారని, ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్‌లు ఇప్పటికి జమకాలేదని తెలియజేశారు. ఇది ఇబ్బందికరమని, జిల్లా యంత్రాంగం పొరపాటు కాదని, ఆర్టీజిఎస్ సంస్థ లోటుపాట్లని తెలియజేశారు. తొలుత ఆన్‌లైన్‌లో ఉన్న బాధితుల పేర్లు రెండవ దఫా జాబితాలోలేవని తెలియజేశారు. సంతబొమ్మాలి మండలంలో ఆరుగురు మత్స్యకారులకు కలిపి పదివేల రూపాయలు అందితే, వజ్రపుకొత్తూరు మండలంలో ఒక్కొక్కరికి బోటు నష్టపోయిన వారికి రూ. 10వేలు అందాయని తెలిపారు.పరిహారం చెల్లింపులో స్పష్టత లేదని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు శ్రమించినా ఈ విధమైన ఇబ్బందులు తలెత్తడం బాధాకరమన్నారు. పలాస నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించి తిత్లీ బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయి పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ విషయం ముఖ్యమంత్రిని కలిసి కోరునున్నట్లు వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఉన్నారు.

చంద్రన్న బీమా చెక్ అందజేత
శ్రీకాకుళం (రూరల్), జనవరి 21: నగరంలో 16వ డివిజన్ గొంటివీధికి చెందిన కురమాన అప్పలరాజు కుటుంబానికి చంద్రన్న బీమా తక్షణ సహాయంగా రూ.5వేలును లిడ్‌క్యాప్ డైరెక్టర్ ఎస్వీరమణమాదిగ సోమవారం అందజేశారు. బీమా మొత్తం రూ. 2లక్షలో రూ.1.95లక్ష నామినీ అయిన కురమాన హేమచంద్ భార్య కురమాన పద్మకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. దీనికి సంబంధించి మొత్తం బ్యాంక్ ఖాతాల్లో జమచేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా రమణమాదిగ మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో కురమాన హేమచంద్, పద్మ, జన్మభూమి కమిటీ సభ్యులు ఎస్.లక్ష్మి, ఎస్.్భర్గవి, కుర్మాన గణపతిరావు, నల్లపర్తి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ధనంతో ఓటర్లును కొంటున్నారు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 21: టీడీపీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై నమ్మకం లేక, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ప్రభుత్వ సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చేస్తూ వివిధ రకాలుగా తాయిలాలు ప్రకటిస్తున్నారని బిజేపి శ్రీకాకుళం అసెంబ్లీ కన్వీనర్ చల్లా వెంకటేశ్వరరావు ఆరోపించారు. వాస్తవంగా చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగన్నరేళ్ళలో ఏమి చేశారని, నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపుదల, డ్వాక్రామహిళల, వ్యవసాయదారుల కష్టాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమెంత? అందులో దోచుకోగా మిగిలిన నిధులు ఇస్తున్న హామీలను నెరవేర్చడానికి సరిపోతాయా అని అన్నారు. టీడిపి ఇస్తున్న హామీల వల్ల ప్రజలందరిపైన భారం పడుతుందని గుర్తించలేదా అన్నారు. యు టర్న్‌లు అలవాటయిపోయిందని, టీడీపీ ఎలాగు ఓడిపోతుందని తర్వాత వచ్చే ప్రభుత్వం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్ల పేరుతో ఇస్తున్నారని సెల్‌ఫోన్ కంపెనీల నుండి చంద్రబాబుకు ఎన్నికల ఖర్చుకోసం కమీషన్లు వస్తాయని, డ్వాక్రా మహిళలకు ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. నిజంగా డ్వాక్రా మహిళల మేలు కోరినట్లయితే అవే నిధులు వారి బ్యాక్ రుణాలు తీర్చడానికి ఉపయోగించండని సూచించారు.