శ్రీకాకుళం

అందరమూ ఒకటై టీడిపిని గద్దె దింపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం ,జనవరి 21: అందరమూ ఒకటై తెలుగుదేశం పార్టీని గద్దె దింపుతామని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. మండలంలోని పెదపాడు గ్రామ పంచాయతీ తంగివానిపేట గ్రామానికి చెందిన వంకల అంజినాయుడు (అంజి మేస్ర్తి) సమక్షంలో సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీనుండి వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ బలమైన శక్తిగా రూపుదిద్దుకోవాలన్నారు. ఎన్నికలకు ఇది శుభ పరిణామమని అన్నారు. తాను కూడా పెదపాడు గ్రామస్థుడేనని, సమస్యల పరిష్కారానికి తన బాధ్యత కూడా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాదనాన్ని కొల్లగొట్టిన దొంగ అని, ఇటువంటి ముఖ్యమంత్రులు ఎన్నడూ రాలేదన్నారు. ఎన్నికల ముందు మారిపోయానని చెబుతూ చంద్రబాబు 600 హామీలు ఇచ్చారన్నారు. రాజధానిని నిర్మిస్తామని చెప్పి సింగపూర్ కంపెనీలకు అమ్మేశారని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ దాడులు నిర్వహిస్తే కాంగ్రెస్‌తో చేతులు కలిపి మరొకరి సహాయం తీసుకుంటున్నారని చంద్రబాబును దుయ్యబట్టారు. పాలన ప్రజలకు తెలియనివ్వడం లేదని, 200 జీవోలు ప్రజలకు తెలియకుండానే జారీ చేశారన్నారు. రూ. 2000 పింఛన్ అని ప్రకటించారని, దీనికి సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్‌లో పెట్టారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. స్టేడియంను కూల్చేసి మూడన్నరేళ్లు గడిచినా అలాగే వదిలేశారన్నారు. 80 అడుగుల రోడ్డు సమీపంలో పేదల కోసం రెండెకరాల భూమిని కేటాయిస్తే టీడీపీ కార్యాలయానికి లాక్కొన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని కండువాలతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన రామ్‌మనోహరనాయుడు, మూకళ్ల తాతబాబు, జెడ్పీటీసీ చిట్టి జనార్థనరావు, అంబటి శ్రీనివాసరావు, గంగు నరేంద్ర, చల్ల రవికుమార్, గొండు కృష్ణమూర్తి, అల్లు లక్ష్మీనారాయణ, మట్ట రాజారావు, వంకల అశోక్, తంగి మురళి, కోణార్క్ శ్రీను, మెంటాడ స్వరూప్, ముద్దాడ నీలయ్య, వంకల సత్యం, కరగాన రాజారావు, కరగాన రమణ, ముద్దాడ జ్యోతి, ముద్దాడ ఢిల్లీశ్వరరావు, ముద్దాడ దాలయ్య తదితరులు పాల్గొన్నారు.

డయల్ యువర్ కలెక్టర్‌కు 13 వినతులు
శ్రీకాకుళం (రూరల్), జనవరి 21: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 13 వినతులు అందాయి. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డి ఆర్‌డి ఏ పిడి డాక్టర్ జిసి కిషోర్‌కుమార్ డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలను వినిపించారు. ఎచ్చెర్ల మండలం ముద్దాడ నుండి బి.రామారావు ఫోన్‌చేసి మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. వీరఘట్ట మండలం బిటివాడ నుండి పి.నర్శింహనాయుడు మాట్లాడుతూ తమ గ్రామంలో పి ఈటి పోస్ట్‌ను మంజూరు చేయాలని కోరారు. సారవకోట మండలం అలుదు నుండి సి.హెచ్ ఆనందరావు ఫోన్‌చేసి మాట్లాడుతూ మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయినప్పటికి దానికి సంబంధించిన బిల్లు ఇంతవరకు మంజూరు చేయలేదని ఫిర్యాదు చేశారు. టెక్కలి మండలం ఆరోగ్యపురం నుండి సుహాసిని మాట్లాడుతు తనకు రెండు కాళ్లు లేవని, గృహాన్ని మంజూరు చేయాలని కోరారు. జలుమూరు మండలం శ్రీముఖలింగం నుండి రాజశేఖరనాయుడు మాట్లాడుతూ తమ గ్రామంలో పారిశుద్ధ్యం, మురికి కాల్వలు సరిగా లేనందున తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వంగర మండలం కొట్టిశ నుండి కె.అత్యుత ఫోన్‌చేసి మాట్లాడుతూ తమ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు మంజూరు చేయాలని కోరారు. కంచిలి మండలం కేశరపాడు నుండి ఇ.కృష్ణారావు మాట్లాడుతూ తిత్లీ తుఫాన్‌లో నష్టపోయిన 185 మంది కొబ్బరిరైతులకు బదులుగా జీడి పంట నష్టపోయినట్లు తప్పుగా నమోదా కాబడిందని, దానిని సరిచేసి తగిన నష్టపరిహారాన్ని మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సి ఈవో బి.నగేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి సి.హెచ్ మహాలక్ష్మి, బిసి కార్పొరేషన్ ఈడి జి.రాజారావు, డి ఎమ్‌హెచ్‌వో డాక్టర్ ఎం. చెంచయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.