శ్రీకాకుళం

పాఠశాలకు అందని గుడ్లు, ఆకలితో విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 23: మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్నాభోజన పథకానికి గుడ్లు అందక మూడు రోజులుగా విద్యార్థులు సగం ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకానికి ఏజెన్సీలు ద్వారా గుడ్లు, పప్పులు, బియ్యం అందిస్తున్నారు. పండుగ సెలవులు తర్వాత పాఠశాల పునఃప్రారంభమై మూడు రోజులు అవుతున్నా ఏజెన్సీ ద్వారా అందించే గుడ్లు అందడం లేదన్నారు. సెలవులు ముందు వున్న పప్పు, గుడ్లు, ఆయిల్‌తో అరకొరగా వంటలు చేస్తున్నామన్నారు. గత నెల డిసెంబర్‌లో కూడ పప్పు, ఆయిల్ పూర్తిస్థాయిలో అందలేదని, ఉపాధ్యాయుల సలహాతో తమ డబ్బులను పెట్టుబడి పెట్టామన్నారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఘనంగా సుభాష్‌చంద్రబోస్ జయంతి వేడుకలు
ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 23: మండలంలో ఈదుపురం ప్రభుత్వ పాఠశాలలో చంద్రబోస్ జయంతిని ఘనంగా బుధవారం నిర్వహించారు. స్థానిక నాయకులు దుర్గాబెహారా, సింహాచలం ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన గొప్పతనం గూర్చి వివరించారు. ర్యాలీ నిర్వహించారు.
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు
*మంత్రి అచ్చెన్నాయుడు
హిరమండలం, జనవరి 23: అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం మండలంలోని హిరమండలం ఆర్‌అండ్ ఆర్ కాలనీలో రూ.48 లక్షలతో నిర్మించిన చేనేత భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందన్నారు. రూ.2 వేలు పింఛను పథకం చంద్రబాబు మంజూరు చేశారన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టుల నుంచి నిర్మించడం జరిగిందన్నారు. వంశధార కరకట్టలను రూ.1056 కోట్లు నిర్మించనున్నట్టు తెలిపారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ కేంద్రం సహకరించకపోయినప్పటికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తదితరులున్నారు. అంతకుముందు పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించారు.
వంశధార సాంకేతిక నిపుణులు పరిశీలన
హిరమండలం, జనవరి 23: వంశధార బాహుదానది అనుసంధానంగా నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టుల కాలువలను సాంకేతిక నిపుణులు బుధవారం పరిశీలించారు. నిపుణులు సత్యనారాయణ, సుబ్బారావు, సురేంద్రరెడ్డి తదితరులు పరిశీలించారు. హిరమండలం వద్ద రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనులపై అధ్యయనం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదిక ఉన్నతాధికారులకు అందించనున్నట్టు ఎస్ ఇ సురేంద్రరెడ్డి తెలిపారు. వీరితో పాటు ఈ ఈ సుశీల్‌కుమార్ తదితరులున్నారు.