శ్రీకాకుళం

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 23: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేధి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం, ఓటర్ల హెల్ప్‌లైన్ ఈ విషయంపై అవగాహన, ఓటర్ల తుదిజాబితా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌లు, సంయుక్తకలెక్టర్లు, ఈ ఆర్వో, ఏ ఈ ఆర్వోలుతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ జిల్లాలో ఈనెల 25న 9వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ప్రధాన కేంద్రంతోపాటు అన్ని శాసనసభ నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, పోలింగ్ స్టేషన్‌లలో కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది నో ఓటర్ టుబి లెఫ్ట్ బిహైండ్ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకొని ఇప్పటికే శాసనసభ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించడం జరిగిందని ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలను ఈనెల 24న జరగనున్న రాష్టస్థ్రాయి పోటీలకు పంపాల్సి వుందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు జిల్లా అధికారులు, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలను నిర్వహించాలని పేర్కొన్నారు. అదేవిధంగా 25న మానవహారాన్ని కూడా ఏర్పాటుచేయాలన్నారు. జిల్లా కేంద్రంలో ఓటర్లు కొరకు ఒక హెల్ఫ్‌లైన నెంబర్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రతీ జిల్లాకు 1950 టోల్‌ఫ్రీ నెంబరు కేటాయించడం జరిగిందని, ఉదయం 9గంటలనుండి రాత్రి 9గంటల వరకు టోల్‌ఫ్రీ నెంబరు పనివేళలుగా ఉండాలని ఆదేశించారు. ఈవి ఎమ్‌లు, ఈవి ఫ్యాట్స్‌లపై మొదట విడతగా వి ఆర్వోలకు, ఏ ఈ ఆర్వోలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా సరిచేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి మాట్లాడుతూ జాతీయ ఓటర్లదినోత్సవానికి సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేయడం జరిగిందని పేర్కొన్నారు. ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకొని వ్యాసరచన, వకృత్వపోటీలు నిర్వహించామని, జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలను రాష్ట్ర స్థాయిలో పంపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఓటర్లు కొరకు హెల్ప్‌లైన్ ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో ఈవి ఎమ్‌లు, వివిప్యాట్స్‌కు సంబంధించి పోలీస్ సెక్యూరిటీ, సిబ్బంది, పర్నీచర్, క్లోజ్‌డ్ రూం, ఇతర వసతులను కల్పించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కలెక్టర్ వివరించారు. ఈసమావేశంలో డి ఆర్వో కె.నరేంద్రప్రసాద్, ఆర్డీవో ఎమ్‌విరమణ, డిఆర్‌డిఏ పిడి ఎ.కళ్యాణచక్రవర్తి, ఈ ఆర్వోలు, ఏ ఈ ఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

నేడు బి ఎన్ శాస్ర్తీ జయంతి వేడుకలు
* రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు
శ్రీకాకుళం (రూరల్),జనవరి 23: ప్రముఖ సంఘసేవకులు, సామాజిక కార్యకర్త బి ఎన్ శాస్ర్తీ జయంతి వేడుకలను జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ పి.జగన్మోహనరావు వెల్లడించారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 24న బి ఎన్.శాస్ర్తీ జయంతి పురష్కరించుకొని బ్లడ్‌బ్యాంక్ కార్యాలయంలో ఉదయం 9గంటలకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. శాస్ర్తీ గొప్ప సంఘ సేవకులు, సామాజిక కార్యకర్తే కాకుండా జిల్లారెడ్‌క్రాస్ సంస్థకు సుదీర్ఘంగా 42 ఏళ్లపాటు జనరల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి శాస్ర్తీ అని పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తుగా ఈ జయంతిని నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
బిజేపి పథకాలు ప్రజల్లోకి తీసుకెల్దాం
* కేంద్ర పథకాల కన్వీనర్ ఉమామహేశ్వరి
శ్రీకాకుళం (రూరల్), జనవరి 23: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ బీజేపి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవేనని వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెల్దామని బిజేపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్ర పథకాల విభాగం కన్వీనర్ శవ్వాన ఉమామహేశ్వరి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలో సగం మంది పేద ప్రజలకు ఉపయోగపడేలా ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకం ద్వారా దేశంలో ఎక్కడైనా రూ.5లక్షలు నగదురహిత వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఈపథకం ద్వారా సగానికి పైగా ప్రజలు లబ్ధిపొందుతారని తెలిపారు. కేంద్ర పథకాల ప్రచారం కోసం ఎల్ ఈడి స్కీన్ ప్రచార వాహనం జిల్లాకు వచ్చిందని దాని ద్వారా గ్రామాల్లో పథకాల ప్రచారం చేస్తామని తెలిపారు. ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజేపీ జిల్లా అధ్యక్షులు కోటగిరి నారాయణరావు, నగర అధ్యక్షులు చల్లా వెంకటేశ్వరరావు, శవ్వాన వెంకటేశ్వరరావు, ఎస్వీ రమణమూర్తి, అల్లు మల్లేశ్వరరావు, ఆరంగి తిరుపతిరావు, విస్తారక్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

సి ఎం ప్రకటనల పట్ల న్యాయవాదులు హర్షం
శ్రీకాకుళం (రూరల్), జనవరి 23: ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రకటన పట్ల జిల్లా న్యాయవాదుల సంఘం బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా హర్షం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ (సంక్షేమ నిధి) రూ.4లక్షలు బెనిఫిట్ ఫండ్ రూ.4లక్షలు మంజూరుచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం ద్వారా జిల్లా బార్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి దామోదరరావు మాట్లాడుతూ ఇది చారిత్రిక నిర్ణయమని అన్నారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, జూనియర్ న్యాయవాదులకు స్టైఫెండ్ మంజూరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు ఎ.కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి మజ్జి సంపత్‌కుమార్, పి.నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, ఎన్ని సూర్యారావు,మామిడి క్రాంతి, రమణదయాల్, ఖగేంద్ర, ఎ.్భవనేశ్వర్ తదితరులు హర్షం తెలిపారు.
13కోట్ల అంచనా బడ్జెట్‌కు ఆమోదం
ఇచ్ఛాపురం, జనవరి 23 : రానున్న ఆర్థిక సంవత్సరానికి 13.13 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌ను బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఆమోదించింది. చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి బడ్జెట్ ప్రతిపాదనలను వివరించారు. మొత్తం రాబడి 21.81 కోట్లు కాగా ఖర్చులు పోను ముగింపు నిల్వ 13.13 కోట్లు ఉంటుందని తెలిపారు. కౌన్సిలర్ నాగరాజు పాత్రో మాట్లాడుతూ గత ఏడాదికన్నా రాబడి ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. జరిమానాల అంచనా పెంచాలని సూచించారు. న్యాయ విభాగానికి చేస్తున్న ఖర్చుల వల్ల ఆదాయం పెరుగుతోందా అని అడిగారు. జరిమానాలు విధించినపుడు కౌన్సిలర్లు సిఫార్సులు చేయకపోతే బాగుంటుందని చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి అన్నారు. కోర్టు కేసుల వల్ల సూపర్‌బజార్ దుకాణాలను అద్దెకు ఇవ్వలేకపోయామని, ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారని కౌన్సిలర్ శ్రీనివాస సాహు ప్రశ్నించారు. కౌన్సిలర్ల సూచనల మేరకు మార్పులు చేస్తామని కమిషనర్ రామలక్ష్మి చెప్పారు. కొద్దిపాటి చర్చ అనంతరం బడ్జెట్‌ను ఆమోదించారు.
ఘనంగా సుభాష్‌చంద్రబోస్ జయంతి వేడుకలు
సంతబొమ్మాళి, జనవరి 23: మండలంలో పాతమేఘవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి.రాజు, హెచ్ ఎంలు మాట్లాడుతూ బ్రిటిషు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నాయకుడు నేతాజీ అని అన్నారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, దుర్యోదన, ఎం.లక్ష్మి, లక్ష్మణరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎంపియుపి స్కూల్, సీతానగరం, కాశీపురంలోని ఎంపియుపి స్కూల్‌లో నేతాజీ జయంతి వేడుకలను ఆయా హెచ్ ఎంలు కామేశ్వరరావు, ఆర్‌వి రమణమూర్తి, విద్యాకమిటీ చైర్మన్ బాబ్జీలు నిర్వహించారు.
కవిటిలో...
నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్భంగా మండలంలోని పలు పాఠశాలలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిటిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాణిక్యపురంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఎం ఇవో ధనుంజయమజ్జి, కల్యాణి ప్రైవేట్ స్కూల్ వద్ద పాఠశాల సిబ్బంది, బెజ్జిపుట్టుగలోని నేతాజీ విగ్రహానికి మాజీ సర్పంచ్ నారాయణస్వామి తదితరులు పూలమాలలు వేసారు. ఈ కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.