శ్రీకాకుళం

రాష్టస్థ్రాయి పోటీలకు పేట విద్యార్థినులు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జనవరి 23: జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా నిర్వహించిన డిబేటింగ్ పోటీల్లో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీలకు పేట విద్యార్థినులు ఎంపికయ్యారని తహశీల్దార్ జల్లేపల్లి రామారావు తెలిపారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర పొటీలకు ఎంపికైన యు చాందిని, కె.కుసుమకుమారి పావనిలను ఆయన అభినందించారు. గతేడాది మండలం నుండి ఇవే పోటీల్లో రాష్ట్ర స్థాయిలో జె.శ్రీహరి అనే విద్యార్థి గెలుపొందారని, ఈ సారి కూడా ఈ ఇద్దరు విద్యార్థినులు మండలానికి జిల్లాకు ఖ్యాతిని గడిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిరువురిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
న్యాయవాదులకు బీమా పరిహార పెంపు పట్ల హర్షం
నరసన్నపేట, జనవరి 23:రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు బీమా పరిహారాన్ని పెంచడం పట్ల నరసన్నపేట బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.తాత మాట్లాడుతూ ఇటీవల కాలంలో అన్ని వర్గాలకు బీమా పరిహారాన్ని పెంచుతూ ప్రభుత్వం చర్యలు తీసుకొందని ఈ దిశగానే న్యాయవాదులకు కూడా బీమా పరిహారాన్ని రూ.8లక్షలకు పెంచడం ఎంతో ఆనందదాయకమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఈ పరిహారం అందజేయడం ఆనందదాయకమని దీనిని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సాదారణ మరణంతో పాటుగా ప్రమాద బీమాకు కూడా రూ.8లక్షలు ప్రకటించడం తమ కుటుంబానికి ఎంతో ఆసరా కల్పించేవాల్లమవుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది పి. ఆనంద్, జె.కామేశ్వరరావు, ధర్మాన వెంకటరమణ, పి.మధుసూధనరావు, వెంకటరమణ, రావాడ కొండలరావు, ఉప్పాడ నీలం, రెడ్డి జగన్నాధం, ఎస్.రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ పథకాలతో దొంగాట
* మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట, జనవరి 23: రాష్ట్రంలో అట్టుడికిపోతున్న ప్రజలను ఆదుకునే విధంగా వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఏడాదిన్నర క్రితమే ప్రకటించిన పథకాలను దోచుకునేందుకు గాను ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు వ్యూహరచన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. బుధవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరవుతుండడంతో టీడీపీ పార్టీకి కరువవుతున్న సందర్భంగా జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎన్నికల ముందు ప్రకటిస్తున్న ఘనత చంద్రబాబునాయుడుకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. నాలుగన్నరేళ్లుగా కనబడని ప్రజల కష్టాలను తీర్చలేకపోయారని, మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఇటువంటి సంక్షేమ పథకాలను వెల్లడించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇనే్నళ్లుగా గుర్తుకురాని ప్రజా సమస్యలను నేడు ఎన్నికల ముందు గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉందని ఏది ఏమైనప్పటికి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వై.కృష్ణమనాయుడు, తంగి మురళీకృష్ణ, కె.గుప్తతదితరులు పాల్గొన్నారు.
104 ఉద్యోగులు నిరసన
శ్రీకాకుళం (రూరల్), జనవరి 23: ఆంధ్రప్రదేశ్ చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు నిరవధిక సమ్మె రెండవరోజుకు చేరుకుంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సి ఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రన్న సంచార చికిత్స సంఘం గౌరవ అధ్యక్షులు కె.శ్రీనివాస్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె రెండవ రోజు చేరి సేవలు నిలిచిపోయినప్పటికి అటు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖాధికారులు, యాజమాన్యం స్పందించకపోవడం అన్యాయమన్నారు. నాయకులు ప్రజాసేవకు ఉన్నామంటునే సమస్యల పట్ల స్పందించకపోవడం విచారకరమన్నారు. అన్ని ప్రజాసంఘాల మద్దతు కూడగట్టుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లాలో ఉన్న ఉద్యోగస్థులందరూ ర్యాలీగా ఏడురోడ్ల జంక్షన్‌కు చేరుకొని ఎన్టీ ఆర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా డి. ఎస్. సుధాకర్, సి.హెచ్ వరుణ్‌కుమార్ మాట్లాడుతూ నిరసన రెండవ రోజు చేరినప్పటికి ఎటువంటి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. తక్షణమే ప్రభుత్వం చొరవతీసుకొని ఫిరామల్ యాజమాన్యాన్ని తొలగించి ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరిపి జీవో 151 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సంఘసభ్యులు హరి, శ్రీ్ధర్, వాసు, నాగేశ్వరరావు, అసిరినాయుడు, శ్రీను, శైలజ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు
శ్రీకాకుళం (రూరల్), జనవరి 23: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌బాబు జన్మదిన వేడుకలు బుధవారం టీడీపి కార్యాలయంలో పార్టీ రాష్ట్ర మానవవనరులు అభివృద్ధి విభాగం సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నారాలోకేష్‌బాబు భవిష్యత్‌లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇప్పటికే తాత, తండ్రుల బాటలో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని, జన్మదినం రోజున కుటుంబంతో గడపకుండా దావోస్ పర్యటనలో ఉండడం వారి నిబద్ధతకు నిదర్శనమన్నారు. పంచాయతీ రాజ్ శాఖ, ఐటి శాఖల్లో ఆయన సాధించిన విజయాలకు పంచాయతీ శాఖలో ఏడు కేంద్రస్థాయి అవార్డులు వచ్చాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి 20వేల కిలోమీటర్లు పైగా రహదారులు వేయడం, పంచాయతీ భవనాలు నిర్మాణం, ఎల్ ఈడి బల్బులు, ప్రతీ గ్రామానికి సురక్షిత తాగునీరు, ఐటి శాఖామాత్యులుగా రాష్ట్రానికి ఐటి పరిశ్రమలను రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతూ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ నవ్యాంద్ర నిర్మాణంలోతనదైన ముద్రవేస్తున్నారని ఎన్నో విభిన్న కార్యక్రమాల ద్వారా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన విజయరాం, గొర్లెరమణ తదితరులు పాల్గొన్నారు.