శ్రీకాకుళం

సిక్కోల్‌ను కమ్మేసిన పొగమంచు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 23: ఎప్పుడూ లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో పొగమంచు తెరలు పరుచుకున్నాయి. శీలప్రదేశాలను తలపించేలా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత వారం రోజులుగా ఈ ప్రభావం కన్పిస్తోంది. ఉదయం 10 గంటల వరకూ కూడా మంచు దుప్పటి వీడలేదు. సూర్యుడు జాడ కూడా కానరావడంలేదు. నగరంతోపాటు వివిధ ప్రాంతాలలో ఇదే పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, కొత్తూరు, భామిని, మెలియాపుట్టి వంటి ప్రాంతాల్లో అసలు సూర్యుడు చూసేందుకు గత కొద్ది రోజులుగా అవకాశమేలేకుండా అతి తక్కువ ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. 10 - 12 డిగ్రీల ఉష్టోగ్రతలతో ఆయా ప్రాంతాల్లో 50 ఏళ్ళు నాటి రికార్డును మళ్ళీ నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు సుస్పష్టం చేసారు. వేకువఝామున దైనందిన కార్యక్రమాల కోసం బయటకు వెళ్ళాల్సిన వారు ప్రధానంగా శీతల పరిస్థితులు పడనివారు చాలా అవస్థలు పడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి మరల ఇదే పరిస్థితిలో మంచు కురియడం ప్రారంభించడంతో దీని ప్రభావం మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ ఉంటోంది. అయితే బుధవారం మాత్రం ఉదయం పొగమంచు చాలా దట్టంగా కురియడంతో జిల్లా వాసులంతా బెంబేలేత్తిపోయారు. ఎటు చూసినా ఎదుట ఏముందో కనబడని రీతిలో మంచు పడుతుండడంతో బయటకి వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లతెల్లవారే సమయంలోనైతే మనుషులకు మనుషులు కనబడని రీతిలో మంచు ప్రభావం కనిపించింది. మంచు ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల ఉదయం స్కూళ్ళకు వెళ్ళాల్సిన పిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది. జాతీయరహదారిపై కూడా పొగమంచువల్ల వాహనాలు ఎక్కడిక్కడ నిలుపుదల చేసారు. లైట్లు వేసుకుని వాహనాలు నడపాల్సిన పరిస్థితి నగరంలో కూడా ఏర్పడినంతగా పొగమంచు దుప్పటేసేసింది.
ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను కొంతమంది అనుభవిస్తున్న తరుణంలో ఆహ్లాదాన్ని ఈ మంచుతెరల మధ్య అందుకునే వారు మరికొందరు. రాత్రి 11 గంటల సమయంలో పూర్తిగా దట్టమైన పొగలా పక్కనవున్నవారు సైతం కన్పించని పొగమంచులో యువతీ,యవకులు చాలా ఆహ్లాదకరంగా తిరుగాడారు. అదే రీతిలో ఉదయం పిల్లలను కానే్వంట్లు, స్కూళ్ళకు దించాల్సిన ఆ కుటుంబ సభ్యులు పిల్లలతోపాటుగా వారుకూడా స్కూల్ ప్లేగ్రౌండ్స్‌లో పొగమంచులో ఆహ్లాదంగా కొంతసేపు ఊటీలో గడిపినంత ఆనందాన్ని అనుభవించినట్టు చెబుతున్నారు. ఇలాంటి పొగమంచువల్ల మరికొందరు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆస్త్మా, ఉబ్బసం, దగ్గు, జ్వరం వంటి రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగేవారు కూడా లేకపోలేదు. క్రీడాకారులు, మార్నింగ్ వాకింగ్ కోసం వెళ్ళే వారిని ఈ పొగమంచు ఉపిరిసలపనివిధంగా అల్లరి చేస్తుంది. శ్వాసకోస వ్యాధులు గత వారంరోజులుగా పెరగడంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. జీడిమామిడి తోటల పూతపై ఈ పొంగమంచు ప్రభావం పూర్తిగా పడింది. దీంతో ఆ రైతులు బెంగపెట్టుకుంటున్నారు. సరిగ్గా పంట పూతకు వచ్చే సమయంలో మంచు ఎక్కువ కురవడంతో పూత దశలోనే పంట నాశనం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ ఎలాగున్నా ఇకనైనా ఈ మంచు ప్రభావం తగ్గితే కొంతమేర జీడి, మామిడిని రక్షించువచ్చని లేదంటే నష్టిల్ని చవిచూడాల్సి వస్తుందని బయపడిపోతున్నారు. ఈ పొగ మంచు ప్రభావం మరికొద్దిరోజులు ఉంటుందని వాతావరణ నిపుణులు స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా ఆస్తమా వంటి వ్యాధులతో బాధ పడుతున్నవారితోపాటు పిల్లలు, వృద్దులు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని సూచిస్తున్నారు.