శ్రీకాకుళం

సజావుగా ఎంసెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 7: ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన వెబ్‌కౌన్సిలింగ్ రెండవ రోజు సజావుగా సాగడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. తొలి రోజు సర్వర్లు మొరాయించడంతో రాత్రి 7గంటల వరకు కౌన్సిలింగ్‌కేంద్రం వద్ద పడిగాపులు కాసిన విషయం తెలిసిందే. సమస్య పునరావృతమవుతుందని రెండవ రోజు కౌన్సిలింగ్‌కు వచ్చిన అభ్యర్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. 20వేలు లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియ ముందుకు సాగడంతో ఇటు అభ్యర్థులు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 423మంది వెబ్‌కౌన్సిలింగ్‌కు హాజరు కాగా ఓసీ, బీసీలు 408, ఎస్సీ, ఎస్టీలు 15మంది ఉన్నారు. తొలి రోజు 150మంది కౌన్సిలింగ్‌కు హాజరు కావడంతో రెండురోజుల్లో 523మంది వెబ్‌కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. కౌనె్సలింగ్‌కు హాజరైన అభ్యర్థులు, తల్లిదండ్రులు ఏయే గ్రూపులు, ఏ కాలేజీలో చేరితో బాగుంటుందని ఆరా తీయడం కనిపించింది.