శ్రీకాకుళం

పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 7: జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఆరవ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సదస్సు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపి మాట్లాడుతూ యువత మంచి నైపుణ్యాలను సాధించాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు సాధించినప్పుడు ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. ఐటిడిఏ ఆధ్వర్యంలో గిరిజన యువతకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబునాయుడు పేదరిక నిర్మూళనకు కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా నవ నిర్మాణదీక్షలో జిల్లాలో చర్చించిన అంశాలు జిల్లాకుగల అవసరాలను నివేదిక రూపంలో సమర్పించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. రాష్ట్భ్రావృద్ధికి రాజకీయాలను (మిగతా 2వ పేజీలో) పక్కన పెట్టి అందరూ సమిష్ఠిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా తీసుకుంటూ పనులు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుకునేందుకు మంచి పాఠశాలతోపాటు వసతిగృహాల్లో అన్ని సౌకర్యాలతో విద్యాభోదన జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ పేదల సంక్షేమ దృష్ట్యా సామాజిక పింఛన్‌లో వృద్ధాప్య పింఛన్‌లను రూ.200నుంచి రూ.1000వరకు, వికలాంగ పింఛన్‌ను రూ.500నుంచి రూ.1500 సీ.ఎం పెంచారని గుర్తు చేశారు. ఐ టి డి ఏ పివో జె.వెంకటరావు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు అన్ని రకాలయిన పోటీ పరీక్షలకు ఉన్నతమైన శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నామన్నారు. అంబేద్కర ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో చదువుల నిమిత్తం వెళ్లే యువతకు రూ.20లక్షలను ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ యూనిట్ల పంపిణీలో భాగంగా ఐ టి డి ఏ నుంచి రూ.19లక్షల సబ్సీడీతో రూ.39లక్షల విలువలగల యూనిట్లను అందించగా, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.20లక్షల విలువగల యూనిట్లను ఎంపి. ఎమ్మెల్యేలు అందజేశారు. యూనిట్ పంపిణీలో ట్రాక్టర్లు, ఆటోలు అందించారు. ట్రాక్టర్‌ను ఎంపి స్వయంగా నడిపి పరిశీలించారు. కార్యక్రమంలో వి.జగన్నాధంనాయుడు సమన్వయ కర్తగా వ్యవహరించగా ఆర్డివో దయానిధి, సాంఘీక సంక్షేమ శాఖ డి ఇ, ఇంచార్జ్, బీసీ సంక్షేమాధికారి కె. ఎస్. ధనుంజయరావు, ఎస్సీ కార్పొరేషన్ ఇ డి ఆదిత్యలక్ష్మీ, కార్మిక శాఖ ఉపకమీషనర్ టి.వెంకటరత్నం, చేనేత జౌలు శాఖ ఏ డి జి.రాజారావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి కామేశ్వరరావు, డి పివో బి.కోటేశ్వరరావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఇ రవీంధ్రనాద్, మెప్మా పీడి త్రినాధరావు, సాక్షరభారత్ డీ డీ కృష్ణారావు పాల్గొన్నారు.