శ్రీకాకుళం

నేడు మహా సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 7: నవ నిర్మాణం దీక్షా కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజైన బుధవారం ఇక్కడి కె ఆర్ స్టేడియంలో జరగనున్న మహా సంకల్పం కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పరిశీలించారు. సమస్యలను అధిగమిస్తూ గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియంలో జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన సదస్సుల విజయవంతంగా జరిగాయని తెలిపారు. బుధవారం జరగనున్న మహాసంకల్పంను విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి హాజరైన వారికి ఎటువంటి సౌకర్యం జరగకుండా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, కమీషనర్‌కు ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జెసి వివేక్ యాదవ్, ఎస్.పి జె.బ్రహ్మారెడ్డి, ఆర్.డి.వో బి.దయానిధి, డి ఆర్‌డి ఎ పిడి తనూజారాణి, డ్వామా పిడి కూర్మనాధ్, డి ఎం అండ్ హెచ్‌వో శ్యామల, శ్రీకాకుళం తహాశీల్దార్ సుధా సాగర్, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.