శ్రీకాకుళం

పేదవాడి ఆకలి తీర్చడమే అన్నక్యాంటీన్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, ఫిబ్రవరి 14: సమాజంలో ఉన్న పేదకుటుంబాలు ఆకలి తీర్చడమే అన్న క్యాంటీన్ల లక్ష్యమని స్థానిక ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. గురువారం స్థానిక రైతు బజార్ పక్కన ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల మేరకు అతి తక్కువ ధరలకే పేదలకు భోజనం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ క్యాంటీన్ ద్వారా ప్రతీరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి రూ.5లకే భోజనం అందించేందుకే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన అన్నారు. రోజుకు కనీసం 300 మంది పేదలకు భోజనం సౌకర్యం కల్పించేందుకే ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న పేద కూలీలు, నిర్భాగ్యులు, నిరుపేద ప్రయాణీకులు, బాటసారులు అన్న క్యాంటీన్‌ను వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం సుమారు రూ.60లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ఆయన ప్రారంభించారు. సుమారు రూ.20కోట్లు విలువగల వివిధ రోడ్లుకు విప్ రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, దేశం నాయకులు విద్యాసాగర్, సుజాత, మొదలవలస రమేష్, బోయిన సునీత, నూకరాజు, సనపల ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు.

24 భజన మండలి బృందాలు ఎంపిక
నరసన్నపేట, ఫిబ్రవరి 14: మండల కేంద్రంలోని స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశాల మేరకు భజగోవిందం సేవా సమితి ఆధ్వర్యంలో ఏకాదశి పర్వదినాన జరిగే భజన కార్యక్రమాలకు సంబంధించి భజన బృందాలను ఎంపిక చేశామని కమిటీ అధ్యక్షుడు జి.స్వామిబాబు తెలిపారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి 24 ఏకాదశులు రావడం జరుగుతుందని, దీనికి సంబంధించి నియోజకవర్గంనుండి సుమారు 60కి పైగా భజన బృందాలు పాల్గొన్నారని ఆయన వివరించారు. దీనిలో భాగంగా లాటరీ ప్రక్రియలో 24 భజన బృందాలను ఎంపికచేశామని, ప్రతీ ఏకాదశి రోజు ఆయా భజన బృందాలు శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్యక్రమాలను నిర్వహించాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని కమిటీ కార్యదర్శి ఎస్.లక్ష్మణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూర్తి, ఆనందరావు, నీలం, ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు, భజన బృంద సభ్యులు పాల్గొన్నారు.

మడపాం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
నరసన్నపేట, ఫిబ్రవరి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఒక్క ఎకరానికి సాగునీరు అందించే దిశగా అనేక విధాల కృషి చేస్తుందని, ఈ దిశగానే మండలంలోని మడపాం గ్రామం వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం మడపాం గ్రామం వద్ద స్థానిక ఆంజనేయ విగ్రహం వద్ద ఎత్తిపోతల పథకానికి గాను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు రూ.4.40కోట్లతోవంశధార నదినుండి ప్రత్యేకంగా మెట్టప్రాంత భూములకు నీరు అందించేందుకు గాను ఈ పథకానికి రూపకల్పన చేశామని ఆయన వివరించారు. రానున్నకాలంలో ప్రతీ ఒక్క ఎకరాకు సాగునీటితో పాటు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తన లక్ష్యం ప్రతీ ఒక్క రైతుకు ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు వద్ద తాను ప్రస్తావించడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించి నిధులను మంజూరు చేయడం హర్షదాయకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశాఖ ఈ ఈ బి.లక్ష్మీపతిరావు, జెడ్పీటీసీ శకుంతల, ఎంపీపి పార్వతమ్మ, జిల్లా నీటి సంఘ ఉపాధ్యక్షుడు వెంకటప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

రూ.107కోట్లతో పట్టణాభివృద్ధి
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన 107.20 కోట్ల రూపాయలతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నామని ఎమ్మెల్యే బి.అశోక్ చెప్పారు. 58.84 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సమగ్ర రక్షిత తాగునీటి పథకం, సిప్ నిధులు 48.36 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్లు కాలువలు పార్కులు శ్మశాన వాటికల పనులకు గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు అన్ని సౌకర్యాలూ కల్పించినట్టవుతుందన్నారు. అనంతరం 15వ వార్డు దానంపేటలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, టీడీపీ నేతలు కాళ్ల ధర్మారావు, చాట్ల తులసీదాస్, టి.శ్రీనివాస సాహు, నాగరాజు పాత్రో, జి.జగన్నాథరెడ్డి, నందిక జానీ, వజీద్ జిలానీ, నందిగాం సరస్వతి, నందిగాం కోటి తదితరులు పాల్గొన్నారు.