శ్రీకాకుళం

పిల్లల ఆలోచనలకు అనుగుణంగా చదివించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), ఫిబ్రవరి 14: పిల్లల ఆలోచనలకు అనుగుణంగానే వారిని చదివించాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.విజయభాస్కర్ అన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 9,10 తరగతులు చదివే విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, కెరియర్ గైడెన్స్, వ్యక్తిగత నైపుణ్యాలు, భవిష్యత్ లక్ష్యాలపై శిక్షణా కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో కష్టపడి చదివే వారు ఎక్కువగా ఉన్నారని అయితే వారికి సరైన గైడెన్స్ ఇచ్చే వారు తక్కువని అన్నారు. హైస్కూల్ స్థాయి నుంచి లైఫ్‌స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటుచేసిన సంస్థఅని అన్నారు. ప్రతీ విద్యార్థి సామర్ధ్యం వేర్వేరుగా ఉంటుందన్నారు. పిల్లలకు అవగాహన కల్గించాలని, మారుతున్న కాలానికి వారికి తయారుచేయాలని అన్నారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణ అభియాన్ ( ఆర్ ఎమ్ ఎస్ ఏ) ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ (సి ఐపి ఎస్), క్వాయిన్ ప్రైవేట్ లిమిటెడ్ ( సివోఐజిఎల్) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి విశ్రాంత ఐ ఎఫ్ ఎస్ అధికారి సిప్స్ సంస్థ సలహాదారు రామలక్ష్మి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇప్పటివరకు కళాశాల విశ్వ విద్యాలయ స్థాయి విద్యార్థులతో పాటు నిరుద్యోగులలో నైపుణ్యాన్ని పెంపొందించడం పై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలోని నైపుణ్యాలకు పదును పెట్టబోతుంది. ఇందులో భాగంగానే ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎమ్ ఆర్.లక్ష్మి, సిప్స్ సంస్థ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్ కార్యదర్శులు శ్రీవిద్య, సంగాసిందూర్ యాదవ్, ప్రాజెక్ట్ సహాయకులు నాగజ్యోతి, కె.శేషు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఈశ్వర కళ్యాణోత్సవాలు
లావేరు, ఫిబ్రవరి 14:మండలంలో మురపాక గ్రామంలో కొలువుతీరిన ఉమా నరేంద్రస్వామి దేవాలయ ఆరవ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా ఈశ్వర కళ్యాణాలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జల్లేపల్లి జనార్ధనరావు, మడ్డి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

కోళ్లకు అభినందనలు
లావేరు, ఫిబ్రవరి 14: తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జిల్లాకు చెందిన కోళ్ల అప్పలనాయుడు నియామకం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి. మండలం మురపాక గ్రామానికి చెందిన కాప్స్ రాప్స్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం కోళ్ల అప్పలనాయుడు స్వగృహంలో గురువారం కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన వారికి తూర్పుకాపులకు ప్రత్యేకంగా సేవలందించేందుకు తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు కోళ్ల నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

వ్యక్తి వికాసానికి నీతి కథలు అవసరం
లావేరు, ఫిబ్రవరి 14: వ్యక్తిత్వ వికాసంలో నీతి కథలు ప్రధాన భూమిక పోషిస్తాయని, ప్రతీ ఒక్కరు చిన్నతనం నుండే నీతికథలను అవగాహన చేసుకోవాలని స్థానిక శాఖా గ్రంథాలయాధికారి ఎమ్.శ్రీనివాసరావు సూచించారు. గురువారం గ్రంథాలయంలో నీతికథలపై పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. నీతికథల ఆవశ్యకతను గుర్తెరగాలని సూచిస్తూ పలువురు సభ్యులను గ్రంథాలయ పాఠకులుగా చేర్పించారు. ఈకార్యక్రమంలో గ్రంథాలయ సహాయకులు గడ్డెయ్య, పలువురు యువకులు పాల్గొన్నారు.