శ్రీకాకుళం

లక్ష్మీనృసింహాస్వామి 57వ వార్షికోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, ఫిబ్రవరి 14: మండలం చినదూగాం పంచాయతీ తిలారు జంక్షన్‌లో ఉన్న శ్రీలక్ష్మీనృసింహాస్వామి 57వ వార్షికోత్సవాలు ఈనెల 16వ తేదీ శనివారం గ్రీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురష్కిరించుకొని ఐదు రోజులు ఉత్సవాలు జరుపుటకు ఆలయ కమిటీ నిర్ణయించింది. ఐదు దశాబ్ధాల క్రితం యాదవ కులానికి చెందిని వంకల వంశీయులు వంకల అప్పలరామయ్య ఈ ఆలయాన్ని ప్రతిష్టించగా ఉత్సవ కార్యక్రమాన్ని దివంగత ముత్తా నర్శింగరావు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. నాటినుండి నేటి వరకు దిన దినాభివృద్ధిగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భక్తుల ఆనందం కోసం ప్రతీ రాత్రి సాంస్కృతికి కార్యక్రమాలను కమిటీ ఏర్పాటుచేసింది.

కళాశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ
జలుమూరు, ఫిబ్రవరి 14: మండల కేంద్రం జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు జలుమూరు ప్రాథమిక వైద్యాధికారి తాడేల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ మందుల పంపిణీ గురువారం జరిగింది. గతంలో వేయనటువంటి విద్యార్థినీ విద్యార్థులకు నేడు ఈ మందులను పంపిణీ చేసినట్లు వైద్యాధికారి తాడేల శ్రీకాంత్ తెలిపారు. అదేవిధంగా మండలంలో పలు గ్రామాల్లో మొదట విడతగా వేయనటువంటి వ్యక్తులకు రెండవ విడతగా వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రిన్సిపాల్ ప్రగడ దుర్గారావు, అధ్యాపకులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.

తహశీల్దార్‌గా ఎమ్.లక్ష్మి పదవీ బాద్యతలు స్వీకరణ
పోలాకి, ఫిబ్రవరి 14: మండలంలోగల స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి కొత్త తహశీల్దార్‌గా ఎమ్.లక్ష్మి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తాను 2012లో గ్రూప్-1 ద్వారా ముందుగా డిప్యూటీ తహశీల్దార్‌గా విశాఖజిల్లా తోటు ఉరట్ల మండలంలో ఆరు సంవత్సరాలు విధినిర్వాహణ చేశానని అనంతరం అదే జిల్లాలో సబ్బవరం మండలానికి తహశీల్దార్‌గా పనిచేశానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఎలక్షన్ నేపథ్యంలో పోలాకి మండలానికి రావడం జరిగిందని ఆమె తెలిపారు. మండలానికి సంబంధించి అన్ని వివరాలను ప్రతీ ఒక్క ఉద్యోగిని అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు.

భూసార పరీక్ష బాండ్లను రైతులకు పంపిణీ
పోలాకి, ఫిబ్రవరి 14: మండలంలోగల 31 గ్రామపంచాయతీల్లో రైతుల యొక్క భూముల యొక్క భూసార పరీక్షలను కొద్దినెలల కిందట నిర్వహించడం జరిగిందని ఎం పీ ఈవో భానుప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని పంచాయతీలో ప్రతీ సంవత్సరం భూసార పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, భూమిలో ఉన్న లోపాలను గుర్తించి రైతులకు తెలియజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఏయే భూముల్లో ఏయే లోపాలు ఉన్నాయో ఆయా లోపాలు రైతులకు తెలియజేసి వాటి నివారణకు సలహాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ప్రతీ ఒక్క రైతు ఈ పంటలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా వ్యవసాయ కార్యాలయ సిబ్బందికి తెలియజేస్తే ప్రత్యక్ష్యంగా వచ్చి ఆయా సమస్యలను తీర్చే విధంగా బాధ్యతలు తీసుకొంటామని అన్నారు.

మా కాలనీలో వౌళిక సదుపాయాలు కల్పించాలి
పోలాకి, ఫిబ్రవరి 14: మండలంలో స్థానిక ఇందిరానగర్ కాలనీలోడ్రైనీజీ వ్యవస్థ బాగుచేయాలని, ఎల్ ఈడీ బల్బులు వేయాలని స్థానిక నివాసి మహ్మద్ ఫకీర్ ఎంపీడీవోకు దరఖాస్తు అందజేశారు. అందుకు బదులుగా ఎంపీడీవో గొర్లె భాస్కరరావు మాట్లాడుతూ మాకు వచ్చిన ఫిర్యాదుమేరకు సంబంధిత పంచాయతీ సెక్రటరీకి పంపించి సత్వరమే ఈ సమస్యను పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు. అలాగే పారిశుద్ధ్యంపై కూడా పంచాయతీ సెక్రటరీలు ప్రత్యేక దృష్టి సారించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.