శ్రీకాకుళం

స్వలాభం కోసమే ప్రతిపక్షం పనిచేస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), ఫిబ్రవరి 15: స్వలాభం కోసమే ప్రతిపక్షపార్టీ అయిన వైసీపీ పనిచేస్తుందని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు. నగరంలో 23వ డివిజన్ మండల వీధిలో రూ. 9లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 23వ డివిజన్ నుంచే గతంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పద్మావతి పనిచేశారన్నారు. అయినా డివిజన్‌ను అభివృద్ధి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ధర్మాన నగరానికి గూర్చి పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నగరంలో అన్ని డివిజన్లకు వౌళిక సదుపాయాలు కల్పించామని వివరించారు. రూ. 100 కోట్లతో నగరాన్ని సుందరంగా ఆధునీకరించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. అవినీతి లేని అభివృద్ధిని చేసి చూపించామన్నారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులుకు ఓటమి భయం పట్టుకుందన్నారు.
సీసీ రోడ్డు ప్రారంభం:
స్థానిక 39,40 డివిజన్ల పరిథిలో రూ.9లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. అలాగే దమ్మల వీధి ప్రజల కోసం తాగునీరు ఇబ్బందులు లేకుండా వారికి తాగునీరు సరఫరా చేసేందుకు రూ. 40లక్షలతో నిర్మించనున్న మినీ వాటర్ ట్యాంక్‌కు శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మీదేవి శంకుస్థాపన చేశారు. అలాగే స్థానిక మంగువారితోటలో నగర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి రోణంకి కళ్యాణ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేశ్, మాజీ కౌన్సిలర్లు కేశవ రాంబాబు, రోణంకి మల్లేశ్వరరావు, రోణంకి త్రిలోచన, కోరాడ హరగోపాల్, కుప్పిలి సతీష్, పిరియా మాధవి, నటుకుల మోహన్, పలువురు టీడీపీ నాయకులుపాల్గొన్నారు.

అప్పుల్లో ఏజెన్సీలు..పట్టించుకోని అధికారులు
పొందూరు, ఫిబ్రవరి 15: బడిపిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలన్న దృక్పధంతో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్నారే తప్ప ఏజెన్సీలకు నెలల తరబడి బిల్లులు అందివ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని రాష్ట్ర మధ్యాహ్న బోజన పథకం వర్కర్స్ యూనియన్, ఏ ఐటియుసి ఉపాధ్యక్షులు రాంబిల్లి సత్యన్నారాయణ అన్నారు. స్థానిక పార్క్ స్కూల్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మండల మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సమావేశంలో మాట్లాడారు. అనేక ఏళ్లుగా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే కార్మికులకు అన్నింటా కష్టాలు వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కర్స్ చేపట్టే గత ఉద్యమానికి స్పందించి రూ. వెయ్యి నుండి మూడువేల రూపాయలకు జీతాలు పెంచారే తప్ప నేటి వరకు జీతాలు ఇవ్వడమే మర్చారన్నారు. వంటపనివార్లు పెట్టుబడులు పెట్టి షాహుకార్లకు అప్పులు పాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వంట కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాంబిల్లి అంజలి, అనె్నపు అన్నపూర్ణమ్మ, వై.పద్మ, సీతమ్మ, సరోజిని తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రదాడులపై మండల బీజేపీ ఖండన
పొందూరు, ఫిబ్రవరి 15: కిరాతక ఉగ్రవాదుల దాడిలో వీర జవాన్లు త్యాగాలు వృధా కానివ్వరాదని, పెద్ద సంఖ్యలో జవాన్లు మృతి చెందడం ఉగ్రదాడి హేయమైన చర్యను మండల బీజేపీ కార్యవర్గం శుక్రవారం ఖండించింది. దేశం కోసం వీర సైనికుల త్యాగాలు మరువలేమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘోరాలు జరగకుండా పటిష్టమైన చర్యలు అవసరమని మండల బీజేపీ తీర్మానించింది. మండల పార్టీ అధ్యక్షుడు గురుగుబిల్లి తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో రాష్టక్రార్యవర్గ సభ్యులు బండారు జయప్రతాప్‌కుమార్, పాతిన గడ్డయ్య, బలివాడ సత్యన్నారాయణ, వాండ్రంగి శ్రీనివాసపట్నాయిక్, మొకర రాజారావు, ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.

మద్యాన్ని లాభసాటి వ్యాపారంగా చూడడం సిగ్గుచేటు
* ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి
శ్రీకాకుళం(రూరల్), పిబ్రవరి 15:మద్యాన్ని లాభసాటి వ్యాపారంగా ప్రభుత్వం చూడడం సిగ్గుచేటని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి విమర్శించారు. స్థానిక యుటి ఎఫ్ కార్యాలయంలో శుక్రవారం మద్యం-్ఛద్రమవుతున్న బతుకులు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఐద్వా జిల్లా కన్వీనర్ ఎ.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వారు మాట్లాడారు. రోజురోజుకు సమాజంలో మద్యం మహమ్మారి మానవ సంబంధాలను, బతుకులను ఛిద్రం చేస్తుందన్నారు. అధికారంలోకి రాగానే మద్యాన్ని నియంత్రిస్తామని బెల్టుషాపులు పూర్తిగా తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబానాయుడు వాగ్ధానం చేసినా ఫలితం లేకపోయిందన్నారు. విద్యార్థులు, యువకులు సరదాల పేరుతో మద్యానికి బానిసలై జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను పట్టించుకోకుండా మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకు పింఛన్లు, పసుపు-కుంకుమల పేరుతో వారి నోరు నొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.

శ్రీముఖలింగం స్వామి సన్నిథిలో లక్ష బిల్వార్చనలు
జలుమూరు, ఫిబ్రవరి 15: దక్షిణ కాశీ శ్రీముఖలింగంలో మధుకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అదే గ్రామానికి చెందిన సూర వెంకటరావు, కళ్యాణి దంపతులుచే శుక్రవారం లక్ష బిల్వార్చన ప్రత్యేక పూజ జరిగింది. తెల్లవారుజామునుండి సాయంత్రం ఐదు గంటల వరకు పూజలు జరిగాయి. వినాయకపూజ, పుణ్యావచనం, కంకణదారణ, నవగ్రహ మండపారాధన, లక్ష బిల్వార్చన పూజలు ఘనంగాజరిగాయి. అనంతరం మహావిష్ణువు ఆలయ ప్రాంగణంలో ఉన్న వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. పూర్ణాహుతితో పూజా కార్యక్రమాలు సాయంత్రంతో ముగిసాయి. ఆలయ అర్చకులు, వెంకటరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బాలికల విద్యకు మరింత భద్రత
* విప్ రవికుమార్
ఆమదాలవలస, ఫిబ్రవరి 15: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికల విద్యకు మరింత భద్రత కల్పిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూనరవికుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద పాఠశాల విద్యార్థులకు శుక్రవారం సైకిళ్లు పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ సుమారు రూ.2వేలు కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తాగునీరు, మరుగుదొడ్లు, పక్క్భావనాలు నిర్మించడం జరిగిందన్నారు. బాలికల్లో ఉన్నత చదువులు ప్రోత్సహించేందుకే సైకిళ్లు పంపిణీ చేస్తూ సుధీర ప్రాంతాలనుండి పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. రక్తహీనత ఉన్న బాలికలకు పోషక ఆహారంతో పాటు వీరికి శానిటరీ ఛార్జ్ ఉచితంగా అందిస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్‌షిప్‌లతో పాటు మధ్యాహ్న భోజనం, యూనిఫారం, బెల్టు, టై, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు వంటివి ఉచితంగా అందించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పనితీరుపై గ్రేడింగ్, బయోమెట్రిక్ హాజరు వంటివి ఏర్పాటుచేయడం వల్ల ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీ ఈవో పగడాలమ్మ, ఎమ్ ఈవో చంద్రశేఖర్, దేశం నాయకులు తమ్మినేని గీత, మొదలవలస రమేష్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

నా గొంతు గాంభీరం..నామాటలు తూటాలు
* సోషల్‌మీడియా ప్రచారంపై విప్ వివరణ
ఆమదాలవలస, ఫిబ్రవరి 15: నియోజకవర్గంలో గల పొందూరుకు చెందిన టీడీపీ మాజీ కార్యకర్త గంగిరెడ్ల శివపై ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలో కేవలం నా గొంతు గాంభీరం..నామాటలు తూటాల్లా ఉంటాయే తప్ప అతినిపై తనకెటువంటి కక్షలు, కార్పణ్యాలు లేవని ఆయన తెలిపారు. శుక్రవారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ గంగిరెడ్ల శివతో మాట్లాడిన సంభాషణను వైసీపీ నాయకులు తమ రాజకీయ స్వార్ధం కోసం ట్టాంపరింగ్ చేసి సోషల్‌మీడియాలో లేని పోని ఆరోపణలు చేస్తున్నారని విప్ అన్నారు. గంగిరెడ్డి కుటుంబానికి తాను బిసీలోన్‌లతో పాటు, మధ్యాహ్నభోజన పథకం వంటివి అప్పగించి ఆ కుటుంబానికి సాయం అందించానని విప్ అన్నారు. పెట్టేవాడికే దండించే అధికారం వుంటుందని, నావల్ల ఉపకారం పొందిన ఆ వ్యక్తి నా ఫ్లెక్సీలను, పార్టీ జెండాలను తొలగించి అదే స్థానంలో వేరే పార్టీ జెండాలను పెట్టడం వల్ల అతనిపై తాను ఆగ్రహం వ్యక్తం చేశానని విప్ అన్నారు. ఇటువంటి సంఘటనలో సాదారణంగా ఎవరికైనా కోపం వస్తుందని, దీనిని ప్రతిపక్షం మరోవిధంగా వక్రీకరించి ప్రచారం చేయడం వల్ల నాకు ప్రజల్లో మరింత ఫోకస్ పెరుగుతుందని విప్ పేర్కొన్నారు.

సన్నాహక పరీక్షలకు ప్రశ్నాపత్రాలు సిద్ధం
సారవకోట, ఫిబ్రవరి 15: ఈనెల 18వ తేదీనుండి జరగనున్న పదవ తరగతి సన్నాహక పరీక్షలకు ప్రశ్నాపత్రాలు సిద్ధంగా ఉంచినట్లు మండల విద్యాశాఖాధికారి ఎమ్.వి రమణ తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి ఒక గంట ముందుగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల కేంద్రంలోని ఎమ్మార్‌సి భవనానికి వచ్చి ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలలకు తీసుకెళ్లాలన్నారు. మండలంలోని ఆరు ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్ పాఠశాలల నుండి 537 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో 279మంది బాలికలున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా వుండగా మండలంలోని 21పాఠశాలలకు చెందిన 121 మంది విద్యార్థులకు చిన్నారి చూపు పథకం కింద కళ్లద్దాలు ఉచితంగా అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కన్నయ్యగూడ గిరిజనులకు వితరణ
సారవకోట, ఫిబ్రవరి 15: మండలంలోని పెద్దలంబ పంచాయతీ నారాయణపురం గ్రామానికి చేరువలో ఉన్న కొండపై నివాసమేర్పరుచుకున్న కన్నయ్యగూడ గిరిజనులకు దుస్తులు, వంటపాత్రలు అందజేసినట్లు మండలంలోని అలుదు గ్రామానికి చెందిన శాంతిస్వరూప్ యువజన సంఘం అధ్యక్షుడు గోకర్ల సింహాచలం తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలు ఒడిస్సా రాష్ట్రం నుంచి వలస వచ్చిన 10 గిరిజన కుటుంబాలు ఇక్కడ నివాసముంటున్నాయని, వీరికి కనీస వౌళిక సదుపాయాలు కూడా లేవని ఆయన వివరించారు. గ్రామంలో 11మంది బడి ఈడు గల బాలబాలికలున్నప్పటికి విద్యాసౌకర్యం లేనందున ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ గ్రామానికి సమీపంలో కూడా పాఠశాల లేకపోవడం వీరు నిరక్షరాస్యులుగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని దశలవారీగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

18న వేమన పథ్యాలపై పోటీ
సారవకోట, పిబ్రవరి 15: వేమన జయంతి సందర్భంగా ఈనెల 18న ధనుపురం ప్రాథమికోన్నతపాఠశాలలో నీతిపథ్యాలపై పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖాధికారి ఎమ్.వి రమణ తెలిపారు. హిరమండలం, పాతపట్నం, సారవకోట మండలాల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని ఆయన తెలిపారు. వేమన రచించిన నీతి పథ్యాలను భావయుక్తంగా చదివి తాత్పర్యాన్ని వివరించాలని పోటీల్లో పాల్గొనవల్సిన విద్యార్థులకు ఆయన సూచించారు.

చట్టాలపై అవగాహన కల్గి ఉండాలి
* సీనియర్ సివిల్ జడ్జి శ్యామలాదేవి
శ్రీకాకుళం (రూరల్), ఫిబ్రవరి 15: విద్యార్థులంతా చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్యామలాదేవి పేర్కొన్నారు. నగరంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రెహ్మాన్ అధ్యక్షతన శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన శ్యామలాదేవి మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల ప్రతీ ఒక్కరు విధేయతను కల్గి ఉండాలన్నారు. న్యాయసూత్రాల పట్ల అవగాహన కల్గి ఉండడం వలన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని సులువుగా పరిష్కరించేందుకు ధైర్యం కల్గుతుందన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్యామలాదేవి విద్యార్థులకు సూచించారు. ర్యాగింగ్ జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. విద్యార్థులంతా నిర్ధిష్టమైన లక్ష్యాలను ఏర్పాటుచేసుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తే భవిష్యత్ బాగుంటుందన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సమస్యలకు సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ భూషణదేవ్, ముజీబ్, న్యాయవాది పాలిశెట్టి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఏపీ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జిల్లా పర్యటన
శ్రీకాకుళం(టౌన్ ), ఫిబ్రవరి 15: ఈనెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీన్‌కుమార్ జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి ఎమ్.బబిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జస్టిస్ ప్రవీన్ కుమార్ ఈనెల 16వ తేదీన విజయవాడలో బయలు దేరి 17వ తేదీ ఆదివారం ఉదయం శ్రీకాకుళం రోడ్ చేరుకొని అక్కడనుండి రోడ్డు మార్గాన అరసవిల్లి చేరుకొని శ్రీసూర్యనారాయణస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం అరసవిల్లి నుండి 8.30గంటలకు బయలు దేరి 9.30గంటలకు టెక్కలి చేరుకొని అక్కడ నూతనంగా ఏర్పాటుచేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభిస్తారు. టెక్కలి నుండి 11.30గంటలకు బయలు దేరి శ్రీకాకుళం చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీకాకుళం జిల్లా కోర్టు వద్ద నిర్మించిన కోర్టు భవనాల సముదాయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం 5గంటలకు శ్రీకాకుళం నుండి బయలు దేరి రాత్రి 7గంటలకు విశాఖపట్నం చేరుకొని అక్కడ బస చేస్తారు. సోమవారం ఉదయం 6.55 గంటలకు విశాఖపట్నం నుండి విజయవాడ బయలుదేరుతారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

హైకోర్ట్ రిజిస్టర్ జనరల్ జిల్లా పర్యటన
శ్రీకాకుళం (టౌన్), ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట్ రిజిస్టర్ జనరల్ సి.హెచ్ మనవేంద్రనాధ్‌రాయ్ ఈనెల 15వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎమ్.బబిత శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం 10.30గంటలకు టెక్కలిలో నూతనంగా ఏర్పాటుచేసిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. అనంతరం సాయంత్రం 3గంటలకు శ్రీకాకుళం జిల్లా కోర్టు వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారని తెలిపారు.
నేడు రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తి జిల్లా పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తి ఎమ్.గంగారావు ఈనెల 16వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి ఎమ్.బబిత శుక్రవారం తెలిపారు. విజయవాడ నుండి శుక్రవారం బయలు దేరి శనివారం ఉదయం 5.51 నిమిషాలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకొని రోడ్డు మార్గం ద్వారా 8.30గంటలకు అరసవిల్లి చేరుకొని శ్రీసూర్యనారాయణస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం జిల్లా కోర్టుకు చేరుకొని ఉదయం 10.30గంటలకు జరిగే న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొంటారు. శ్రీకాకుళంలో రాత్రి బస చేసి ఆదివారం జిల్లాలో జరిగే హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పర్యటనలో పాల్గొంటారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
* జిల్లా కలెక్టర్ ఎమ్.రామారావు
శ్రీకాకుళం (టౌన్), ఫిబ్రవరి 15: 2019 సాదారణ ఎన్నికలను నోడల్ అధికారులు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎమ్.రామారావు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 2019 సాదారణ ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2019 సాదారణ ఎన్నికలను సజావుగాను, శాంతియుతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. అందులో భాగంగా మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంట్, ఈవి ఎమ్ మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, ట్రైనింగ్ మేనేజ్‌మెంట్, మెటీరియల్ మేనేజ్‌మెంట్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, సింగిల్ విండో, ఎక్సెపెండీచర్ మోనటరింగ్, అబ్జర్వర్, మెక్రో అబ్జర్వర్, లా అండ్ ఆర్డర్, బ్యాలెట్ పేపర్, మీడియా తదితర ఎన్నికల విధుల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంట్ విధులకు జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావును నోడల్ అధికారిగాను, నోడల్ తహశీల్దార్‌గా కలెక్టరేట్ పరిపాలనాధికారిని నియమించినట్లు తెలిపారు. ఈ వీ ఎమ్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారిగా డి ఆర్ డి ఏ పిడిని, నోడల్ తహశీల్దార్‌గా ఈ-పరిపాలనాధికారిని నియమించామన్నారు. అదే విధంగా ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారిగా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్, శ్రీకాకుళం వారిని, నోడల్ తహశీల్దార్‌గా సెక్షన్ సూపరింటెండెంట్‌ను, ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారిగా జిల్లా పరిషత్ సీ ఈవోను, నోడల్ తహశీల్దార్‌గా ఆమదాలవలస భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించినట్లు తెలిపారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌ను మెటీరియల్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారిగాను, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నోడల్ అధికారిగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌ను, సింగిల్ విండో నోడల్ అధికారిగా సీపీవో కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించామన్నారు. ఎక్సీపెండీచర్ మోనటరింగ్ నోడల్ అధికారిగా జిల్లా ఆడిట్ అధికారిని, ఎలక్షన్ అబ్జర్వర్లు, మైక్రో అజ్జర్వర్ల నోడల్ అధికారిగా, డీ ఆర్వో, డి ఎస్‌వోలను నియమించారు. అదేవిధంగా బ్యాలెట్ పేపర్, డమీ బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిగా డుమా పిడీని, మీడియా నోడల్ అధికారిగా డీ పీ ఆర్వోను, కంట్రోల్‌రూం నోడల్ అధికారిగా హౌసింగ్ పీడీని, స్వీప్ నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్, ఈవీఎమ్, స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ ఎరేంజ్‌మెంట్స్ నోడల్ అధికారిగా జిల్లా పరిశ్రమల కేంద్రం జి ఎమ్‌ను, హెల్ప్‌లైన్ నోడల్ అధికారిగా ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారులను నియమించారు. నోడల్ అధికారులు ఎన్నికల నిర్వహణపై పూర్తి అవగాహన కల్గి ఉండాలని, టీం వర్క్‌తో ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించి ఆదర్శంగా నిలవాలన్నారు. జాయింట్ కలెక్టర్ చక్రధరబాబు మాట్లాడుతూ గత ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లు, ఈవి ఎమ్‌లకు ఈ ఏన్నికల బ్యాలెట్ బాక్సులు, ఈవి ఎమ్‌లకు చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. నోడల్ అధికారులు బాగా కష్టపడి పనిచేయాలన్నారు. రోజువారి ఈవెంట్‌లను సక్రమంగా నిర్వహించాలని, సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రాం సరిగా సెట్ చేయాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులంతా ఈ వి ఎమ్ మేనేజ్‌మెంట్ క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ అడ్డాల వెంకటరత్నం, జేసీ చక్రధరబాబు, జేసీ-2 రజనీకాంతారావు, నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీరాములునాయుడు, డీ ఆర్వో కె.నరేంద్రప్రపసాద్, డుమా పీడీ హెచ్.కూర్మారావు, డిఆర్‌డిఏ పిడి ఎ.కళ్యాణచక్రవర్తి, ఆర్డీవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర జానపద అకాడమీ సభ్యుడిగా సత్యన్నారాయణ
శ్రీకాకుళం (రూరల్), ఫిబ్రవరి 15:రాష్ట్ర జానపద అకాడమి సభ్యునిగా నౌపడ సత్యన్నారాయణను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆంధ్ర సాంస్కృతిక కేంద్ర అధ్యక్షులు ఈనియామక ఉత్తర్వులను జారీ చేశారు. సాంఘిక సేవా కార్యక్రమాల్లో రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రశంసలు అందుకున్న సత్యన్నారాయణ డబల్ ఎమ్ ఏ చేసి న్యాయశాస్తప్రట్టా పొందారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఢిల్లీలో ఉంటున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోఫాల్ జాతీయ సమైఖ్య శిబిరంలో పాల్గొని రామనా చందనాలో శ్రీకాకుళం వందనాలు పేరు నృత్యం చేసి జాతీయ సమైఖ్య శిబిరాన్ని ఉర్రూతలూగించి అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోతీలాల్ ఓరా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జాతీయ స్థాయిలో శ్రీకాకుళం కళాకారులకు పరిచయం చేసి భారత్ పర్వలో గుర్తింపు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మూడు సార్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే బోర్డులో జోనల్ సభ్యునిగా, జిల్లా టెలీకం సభ్యునిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షునిగా, మండల యువత అధ్యక్షునిగా, మండల తెలుగు యువత అధ్యక్షునిగా, తెలుగు విద్యార్ధి జిల్లా కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీలో నాడు కీలక విభాగమైన రామదండుకు శ్రీకాకుళం జిల్లాకు నాయకత్వం వహిస్తూ టీడీపీ పార్టీకి, ప్రజలకు సేవలందించడమే కాకుండా, ఆంధ్రా యూనివర్శిటీలో ఢిల్లీ యూనివర్శిటీ తరుపున మోడరన్ థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందడమే కాకుండా అనేక జానపద, సాంఘిక నాటకాల్లో పాత్రలు పోషించారు. ఇదిలా వుండగా మోదీ ఫెయిల్యూర్స్ అనే పుస్తకం రాశారు.

* వైసీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 15: రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను అంటగట్టుతూ వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఈనెల 17వ తేదీన ఏలూరులో నిర్వహించనున్న బీసీ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. వైసీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు జరుగుతున్న అన్యాయం, నిధుల కేటాయింపు, ప్రాధాన్యత, రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వివక్షతో వ్యవహారిస్తున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని బీసీల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వైసీపీ బీసీ డిక్లరేషన్‌ను రూపొందించిందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో సగానికి పైబడి ఉన్న వెనుకబడిన వర్గాల వారికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులు, నారుూ బ్రాహ్మణులు, ఎస్సీలు, ఎస్టీలపై దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయన్నారు. వారి ప్రాథమిక హక్కులను కాలరాసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలోతొక్కారన్నారు. దీనిపై వెనుకబడిన వర్గాల ప్రజలందరూ తిరగబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి వేదికగా ఏలూరులో నిర్వహిస్తున్న బీసీ గర్జన కార్యక్రమానికి ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బీసీ వర్గాలు తరలి రావాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించి పచ్చచొక్కాల జేబులు నింపుతున్న టీడీపీకి రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఛలో ఏలూరు బీసీ గర్జన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసమావేశంలో ఎన్ని ధనుంజయ, కలగ శ్రీనివాసయాదవ్, రమేష్, గొండు రఘురాం తదితరులు పాల్గొన్నారు.

.
కార్మికుల పోరాట ఫలితమే వేతనాల పెంపు
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 15: తమ నిరంతర పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను పెంచిందని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నాగమణి, ఎ.మహాలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతవరకు నెలకు వెయ్యి రూపాయలు గౌరవ వేతనంతో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ. 3వేలు చొప్పున చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల వారు హర్షం వెలిబుచ్చారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల అనేక పోరాటాల ఫలితమే ఈ వేతనాల పెంపు అని, పెరిగిన వేతనాలు ఈనెల నుండి అములు కానున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని వారు కోరారు. కాలేజీల్లో వండుతున్న వారికి బిల్లులు, వేతనాలు కూడా వెంటనే విడుదల చేయాలని, అన్ని స్కూల్లలో వౌళిక వసతులు కల్పించి సబ్సిడీపై వంటగ్యాస్‌ను సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ప్రమాధ భీమా సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

అమర జవాన్లుకు నీరాజనాలు
సారవకోట, ఫిబ్రవరి 15: భారత సరిహద్దు జమ్ము-కాశ్మీర్ ప్రాంతం పుల్వామా వద్ద పాకిస్థాన్ ముష్కరుల దాడిలో మృతి చెందిన భారత అమరవీరులకు సారవకోట మండలంలో శుక్రవారం పలు ప్రాంతాలలో నివాళులు అర్పించారు. మండల కేంద్రంలో జిల్లా గిరిజన సంఘం నాయకుడు వాబ యోగీశ్వరరావు ఆధ్వర్యంలో కేజీబివి పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి బజార్ కూడలిలో మానవహారంతో నివాళులు అర్పించారు. అదేవిధంగా బుడితి ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయుడు రవికుమార్ ఆధ్వర్యంలో జైజవాన్..నినాదానికి విద్యార్థులు అక్షర రూపం ఇచ్చి అతి పొడవైన జాతీయ జెండాను మానవ హారంగా ఏర్పాటుచేశారు. భారత ప్రజలంతా ఐకమత్యంగా వీర జవాన్లకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు వీరు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్ధనలు చేశారు.

అమరవీరులకు నివాళులు
* కొవ్వొత్తులతో విద్యార్థులు ర్యాలీ
జలుమూరు, ఫిబ్రవరి 15: ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగం గ్రామంలో విద్యార్థి, విద్యార్థినులు మరణించిన అమరవీరులకు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీతో జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి సౌకర్యం కోసం ,దేశ రక్షణ కోసం చివరికి ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్..జోహార్ అని నినాదాలు చేస్తూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన దేవాలయం ముందు ఐదు నిమిషాల పాటు వౌనం పాటించి సంతాపాన్ని తెలియజేశారు.

శివానీలో ఎన్డీటీ పై వర్క్‌షాప్
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 15: మండంలంలోని చిలకపాలెం కూడలిలో ఉన్న శ్రీశివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్డీటీపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్ శుక్రవారంతో ముగిసింది. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మురళీకృష్ణ మాట్లాడుతూ రోజురోజుకు పరిశ్రమలో పెరుగుతున్న ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఎన్డీటీ కోర్సు నేర్చుకోవడం అనివార్యంగా మారిందని పేర్కొన్నారు. ఇందులో ఆల్ట్రా సోనింగ్ టెస్టింగ్, రేడియోగ్రాఫిక్ టెస్టింగ్, లిక్విడ్ పెన్రే్టషన్ టెస్టింగ్, మాగ్నిటిక్ ప్రాక్టికల్ టెస్టింగ్ అనే పద్ధతుల ద్వారా వస్తువుల యొక్క లోపాలను, నాణ్యతలను కనుక్కోవచ్చన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి బాలభాస్కరరావు, వర్క్ షాప్ కన్వీనర్ ప్రేమ్‌కుమార్‌లు మాట్లాడుతూ నాన్ డిస్టెక్టివ్ టెస్టింగ్ ద్వారా బ్రిడ్జీలు, బాయిలర్‌లు, కాంక్రీట్ స్టక్చర్‌లు, వెల్డింగ్ జాయింట్లు వంటి వాటిలో నాణ్యతా లోపాలను కనుక్కొనేందుకు ఈ కోర్సు మరింత దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి తైక్వాండో పోటీలకు ఎంపికలు
బలగ, ఫిబ్రవరి 15: స్థానిక టౌన్‌హాల్ వేదికగా జిల్లాస్థాయి సబ్ జూనియర్, క్యాడెట్ పోటీలు ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను తెలియజేశారు. బాలురు, బాలికల విభాగాల్లో వేర్వేరుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 23, 24వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలోని గాజువాక కేంద్రంగా నిర్వహించే రాష్టస్థ్రాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్టస్థ్రాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు విశాఖపట్నం పోర్టు స్టేడియంలో తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చరేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 11 ఏళ్లులోపు వయస్సుగల వారై ఉండాలని, క్యాడెట్ విభాగంలో 14 ఏళ్లులోపు విద్యార్థులు అయి ఉండాలని తెలిపారు. వారంతా రెండు పాస్‌ఫోటోలు, వయస్సు దృవీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్‌తో రావల్సి ఉంటుందన్నారు.

వీరజవాన్లకు స్సామ్నా నివాళి
బలగ, ఫిబ్రవరి 15: జమ్ము-కాశ్మీర్ ఫుల్వామా వద్ద ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు చిన్న, మధ్య తరహా వార్త పత్రిక సంఘం (స్సామ్నా) శ్రీకాకుళం జిల్లా శాఖ ఘనంగా నివాళులు అర్పించింది. శుక్రవారం నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహాం వద్ద అమర వీరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించి నగర పాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి దుశ్చర్యలను ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రేరేపిత పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎన్. ఈశ్వరరావు, సత్యప్రసాద్, భాస్కరరావు, మల్లేశ్వరరావు, అప్పలనాయుడు, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

హింసరాజకీయాలు వీడనాడాలి
* కోటబొమ్మాళిలో బంద్ ప్రశాంతం
* టెన్షన్, పోలీసుల మోహరింపు
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 15: కోటబొమ్మాళిలో హింసరాజకీయాలను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విడనాడాలని వైసీపీ నాయకులు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్‌లు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసిన ఐదుగురును గాయపరిచినందుకు నిరసనగా కోటబొమ్మాళిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి స్థానిక రైతుబజారు వరకు ర్యాలీ నిర్వహించి, కొత్తపేట వరకు కొనసాగింది. స్థానిక పాతబస్టాండ్ ఆవరణలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్న సమయంలో అనంతరం ర్యాలీ కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అదే ప్రదేశంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను అదుపు చేయడానికి పోలీసులు మెహరింపు చేసారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని తెలుసుకొని, రాజ్యాంగం కల్పించిన అధికారాలను ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని హింసరాజకీయాలు చేస్తే సహించబోమన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు చరిత్ర తెలుసునన్నారు. ఓట్లు కోసం హింసరాజకీయాలు చేయరాదని, భయపడితే భయపడేది లేదన్నారు. రాజకీయాలు ఎవరైనా చేయవచ్చునని, అందుకు రౌడీయిజం పనికిరాదన్నారు. పోలీసులపై వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మంజు, నగేష్, ఎ.రామారావు పాల్గొన్నారు.

టీడీపీ శాంతియుత ర్యాలీ
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 15: ముందుగా తమ పార్టీ కార్యకర్తలపైనే వైసీపీ కార్యకర్తలు దాడి చేసారని, టీడీపీ ఎల్లప్పుడూ శాంతియుతం వాతావరణం, అభివృద్ధి దృష్టిలో పనిచేస్తుందని టీడీపీ నాయకులు గోవిందరాజులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నాయకులు ర్యాలీ స్థానిక పాతబస్టాండ్ నుంచి వెళ్లిన అనంతరం భారీ ఎత్తున మహిళలు, నాయకులు,కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ రామకృష్ణ, పద్మశ్రీనివాస్, ఎ ఎంసి చైర్మన్ విజయలక్ష్మి, కె. లక్ష్మణరెడ్డి, రామురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేదల వైద్యానికి ప్రభుత్వం సహాయం: మంత్రి అచ్చెన్న
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 15: పేదల వైద్యానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంత్రి స్వగ్రామం నిమ్మాడలో కోటి 24 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం మంత్రి భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆరోగ్యకేంద్రాన్ని ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు,నిమ్మాడలోని పశువుల ఆసుపత్రి వద్ద నిర్మించి ఆ పశువుల ఆసుప్రతి భవనాన్ని వేరే చోటుకు మారుస్తామన్నారు. నిమ్మాడలో 40 కోట్ల రూపాయల వ్యయంతో రెసిడెన్షియల్ స్కూల్