శ్రీకాకుళం

భర్త,పిల్లల చితి అంటించిన భార్య రాజేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, ఫిబ్రవరి 21: మండలంలోని కొల్లవానిపేట గ్రామం వద్ద తండ్రి, కొడుకులు ట్రైన్‌క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో వారి చితికి మృతుడు గురునాధరావు భార్య రాజేశ్వరి తలకొరివి పెట్టారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలోతన భర్తతోపాటు ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో గురువారం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం గ్రామానికి తీసుకొచ్చిన మృతదేహాలను శ్మశానవాటికకు తరలించారు. ఈమెకు దగ్గర బంధువులు ఎవరూ లేకపోవడంతో మృతుని భార్య రాజేశ్వరియే తన భర్త, పిల్లలకు తలకొరివి పెట్టిన వైనం స్థానికులను కలిచివేసింది. అయితే మృతుడు తీసుకున్న నిర్ణయం ఎందుకు జరిగిందో అన్న అనుమానాలు మాత్రం గ్రామంలో ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. ఏమి ఏమైనప్పటికి చివరకు భార్యే భర్తకు, పిల్లలకు తలకొరివి పెట్టడంతో స్థానికులు కన్నీరు, మున్నీరయ్యారు. కనీసం పిల్లల్నయినా కాపాడుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని రాజేశ్వరి కన్నీటి పర్యంతం అయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాకుండా పోయింది. ఎన్నడూ లేని విధంగా ఇటువంటి సంఘటన స్థానికంగా చోటు చేసుకోవడం గ్రామంలో విషాధఛాయలు అలముకున్నాయి.

తలవరంలో విషాధం
వీరఘట్టం, ఫిబ్రవరి 21: మండలంలోని తలవరం గ్రామానికి చెందిన చందక విజయ్‌కుమార్ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో పాలకొండలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కోటదుర్గమ్మ గుడి సమీపంలో ఫ్లెక్సీలు తీస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే విజయ్‌కుమార్ మృతి చెందారు. మృతుడి తల్లిదండ్రులు గౌరీశ్వరమ్మ, వెంకటరావులు రోదనలు చూసి పలువురికి కంటతడిపెట్టించాయి.

స్థానికంగా పశుదాణా తయారుచేయండి
సారవకోట, ఫిబ్రవరి 21: పశువుల పెంపకం దారులు స్థానికంగా అందుబాటులో ఉన్న ముడిసరుకులుతో పశువుల దాణాను తయారుచేసుకోవాలని జిల్లాలోని పెద్దసీది పశువైద్యాధికారి అనిల్‌కుమార్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమగ్ర పశుయాజమాన్యం శిక్షణాకార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా ఆయన పాల్గొన్నారు. పశువుల దాణా కోసం ప్రభుత్వం మీద ఆధారపడి వుండకూడదని ఆయన స్పష్టం చేశారు. తవుడు, పెసరబొత్తుతదితర వస్తువులతో పశుదాణాను తయారుచేసుకోవచ్చని సోదాహరణంగా ఆయన వివరించారు. ఆలపశువుల పెంపకం తదితర అంశాలపై పలు వివరాలను ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర, పశుసఖి, పశువైద్యకేంద్రాల సిబ్బంది, గ్రామస్థాయి కార్యకర్తలు, స్థానిక వైద్యాధికారి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన మత్స్యకారులు
సారవకోట, ఫిబ్రవరి 21: మండలంలోని ధర్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన 11కుటుంబాల మత్స్యకారులు తెలుగుదేశం పార్టీలో గురువారం చేరారు. స్థానిక సిబి ఎన్ ఆర్మీ కార్యకర్త సువ్వారపు జయరాం ఆధ్వర్యంలో 11కుటుంబాలు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తాము ఆకర్షితులయ్యామని, మత్స్యకారుల సంక్షేమానికి చంద్రబాబునాయుడు పలు పథకాలను ప్రవేశపెట్టడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన మువ్వల అప్పారావు, మిన్నారావు, హరికృష్ణ, తిరుపతి, కాంతమ్మ, అన్నపూర్ణ తదితరులకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.