శ్రీకాకుళం

ఎన్నికల కమిషన్ యాప్‌తో..ఓటర్లుగా నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: భారత ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన యాప్‌ల ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.రామారావు తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై గురువారం కలెక్టర్ కార్యాలయంలో జెసీ కె.వి.ఎన్.చక్రధరబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. 23, 24 తేదీల్లో జిల్లాలో 2908 పోలింగ్ కేంద్రాలలో ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ఉంటుందని దానిలో వివరాలు పరిశీలించుకోవాలని కోరారు. నిరక్షరాస్యులైన ఓటర్లకు బి.ఎల్.వో. చదివి వినిపిస్తారని ఆయన చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి అధికారులు లభ్యంగా ఉంటారని, వారి వద్ద ఓటరు నమోదు ఫారంతోపాటు చిరునామా, పోలింగు కేంద్రం మార్పు తదితర అంశాలకు సంబంధించిన ఫారం - 7, 8, 8ఏలు లభ్యంగా ఉంటాయని చెప్పారు. యువ ఓటర్లు అధిక శాతంలో ఇంకా నమోదు కావల్సివుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 85,076 మంది యువ ఓటర్లు ఉంటారని అంచనాలు ఉండగా ఇప్పటి వరకూ 25,568 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. నేరుగా పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా ఓటరుగా నమోదు కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా, యాప్‌ల ద్వారా సైతం ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందని తెలిపారు. ఓటర్ హెల్ఫ్‌లైన్ యాప్‌ను, పి.డబ్ల్యూ.డి. యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని ఓటరుగా నమోదు కావచ్చని చెప్పారు. ఈ యాప్‌ల ద్వారా తమ ఓటు, పోలింగు కేంద్రాల వివరాలు, ఎన్నికల సంఘటం నియమనిబంధనలు, ఎన్నికల ఫలితాలు సైతం పరిశీలించవచ్చని ఆయన వివరించారు. యువ ఓటర్లు ఈ అవకాశాన్ని పెద్దఎత్తున ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు మాట్లాడుతూ జనవరి 11వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించామన్నారు. ఈ జాబితాను పరిశీలించుకుని ఓటు లేని వారు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఎన్నికల సంఘం కల్పించిన అవకాశమని అన్నారు. భారత ఎన్నికల సంఘం జిల్లాలో పర్యటించనుందని ఆయన చెప్పారు. ఈ బృందం జిలాలలో ఓటరు నమోదు కార్యక్రమం జరిగిన తీరు పరిశీలిస్తుందని తెలిపారు. జిల్లాలో ఓటరు అవగాహన కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టామని, మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జెసీ2 పి.రజనీకాంతారావు, జిల్లా రెవెన్యూ అధికారి కె.నరేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఓటరు నమోదుపై సందేహాల నివృత్తికి సదస్సులు
* నియోజకవర్గ ఎన్నికల అధికారి సుదర్శన దొర
నరసన్నపేట, ఫిబ్రవరి 21: నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్‌లలో ఈనెల 23,24తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని నియోజకవర్గ ఎన్నికల అధికారి బి.సుదర్శనదొర తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని నియోజకవర్గ స్థాయి అధికారులతో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందా లేదా అని సరిచూసుకోడానికి, ఓటర్ల జాబితాలో పేరులేని అర్హులు ఓటు నమోదు చేసుకోడానికి వీలుగా ప్రజల సౌకర్యార్ధం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. నియోజకవర్గంలోని ప్రతీ బూత్‌లెవెల్ అధికారుల వద్ద తాజా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచుతున్నామని ఆనుమానం ఉన్నవారు తమ వివరాలను అడిగి తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. అలాగే బి ఎల్‌వోల వద్ద 6,7,8,8ఎ ఫారాలను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఓటు గుర్తింపు కార్డు ఉన్న ఓటర్లు కూడా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిదీ చూసుకోవాలని తెలిపారు. ఓటు గుర్తింపు కార్డు కల్గివుండి ఓటర్ల జాబితాలో పేరులేని వారు ఫారం -6ను పూర్తిచేసి బి ఎల్‌వోలకు ఇవ్వాలని వివరించారు. ఓటర్ల వివరాల నమోదులో తప్పులుంటే ఫారం-8 ద్వారా పనిచేయించుకోవాలని సూచించారు. నకిలీపేర్లు ఓటు ఉన్న ప్రాంతంలో నివాసము ఉండనివారు, చిరునామా మారిని వారి పేర్లు, మరణించిన వారి పేర్లను తొలగించడానికి ఫారం-7ను పూర్తి చేసి ఇవ్వాలని తెలిపారు. ఓటరు గుర్తింపుకార్డు ఒక గుర్తింపుకార్డుగా పనిచేస్తుందని, ధృవీకరణ పత్రంగా పనిచేయదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌లు వివి రమణ, విజయకుమారి, ఎమ్.లక్ష్మి, రెవెన్యూ అధికారులు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ పి.శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాలి
రాజాం, ఫిబ్రవరి 21: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరముందని రాజాం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.జయాదేవి ఆదేశించారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నాలుగు మండలాల ఏఈ ఆర్‌వోలు, పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో రెండు లక్షల 9 వేల 646 మంది ఓటర్లు ఉన్నారని, వీరంతా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ప్రభుత్వం 285 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. అయితే బడుగు, బలహీన వర్గాల ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో వారు ఓటు హక్కు వినియోగించుకొనేటప్పుడు వారిని నియంత్రించడం, అజమాయిషీ చేయడం నేరంగా పరిగణిస్తామన్నారు. ఏకపక్షంగా ఓట్లు నమోదైన ప్రాంతంలో కూడా దర్యాప్తు నిర్వహిస్తామని, ఈ విషయాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఈ నెల 23,24 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఓటర్లు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఆమెతో పాటు రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి ఏ ఈ ఆర్‌వోలు సత్యనారాయణ, రమాదేవి, ప్రసాదరావు, గోవింద, సీ ఐ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఈవీ ఎంలపై ఓటర్లకు అవగాహన
వంగర, ఫిబ్రవరి 21: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ ఆదేశాలు మేరకు రెవెన్యూ అధికారులు ఈవీ ఎంల వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. గురువారం మండలంలోని తహశీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో రుషింగి, జగన్నాథవలస, తలగాం తదితర గ్రామాల్లో ఈవీ ఎంల్లో తాము ఎన్నుకున్న అభ్యర్థికి ఏ విధంగా ఓటు వేయాలో అవగాహన కల్పించారు. అలాగే ఈవీ ఎంలతో పాటు తాము వేసే ఓటు వీవీ ప్యాట్‌ల్లో నమోదయ్యే విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ నెల 23,24 తేదీల్లో ప్రత్యేకంగా ఓటర్ల నమోదుతో పాటు సవరణ కార్యక్రమాన్ని కూడా అన్ని గ్రామాల్లో చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సుబ్బారావు, గిరి, వీ ఆర్‌వోలు పాల్గొన్నారు.