శ్రీకాకుళం

తాగునీటి కష్టాలు తీరేదెన్నడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), మార్చి 14: మండలంలోని తుమరాడ గ్రామంలో ప్రజలు తాగునీటి కష్టాలు ఎప్పటికి తీరేనని ఆందోళన చెందుతున్నారు. వేసవి రాకముందే గ్రామంలోని చెరువులు ఎండిపోయాయి. అలాగే మంచినీటి కోసం ఏర్పాటు చేసిన కొళాయిలు నీరివ్వడం లేదు. గ్రామంలో ఏర్పాటు చేసిన రక్షిత పథకం కొన్ని వీధులకు మాత్రమే దాహం తీరుస్తుంది. కుమ్మరివీధిలో గతంలో ఏర్పాటు చేసిన పాత రక్షిత మంచినీటి పథకం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. దీంతో గత కొనే్నళ్లుగా మహిళలు, పురుషులు సహకారంతో వేరే ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన కావడంతో మాజీ సర్పంచ్‌లు చేసేది లేక చేతులెత్తేస్తున్నారు. ప్రత్యేక నిధులు ప్రభుత్వం మంజూరుచేయాలని స్థానికులు కోరుతున్నారు.
* సొంత ఖర్చుతో...
గ్రామంలోని కుమ్మరివీధి ప్రజలు తమ సొంత ఖర్చులతో రక్షిత పథకం వద్ద నుంచి కొళాయిలు వేసుకొనేందుకు పనులు చేపట్టారు. పైపులు ద్వారా నీటిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రక్షిత పథకం ద్వారా వచ్చే నీరు కొన్ని వీధులకు సరిపోతుండడంతో పైపులు వేసుకున్నప్పటికీ నీటి సరఫరా అవుతుందో లేదోనని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.
తహశీల్దార్‌గా రామారావు
వంగర, మార్చి 14: మండల తహశీల్దార్‌గా బి.రామారావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో రణస్థలం మండల తహశీల్దార్‌గా పనిచేసి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇంతవరకు సూపరింటెండెంట్ గోవిందరావు ఇన్‌చార్జి తహశీల్దార్‌గా విధులు నిర్వహించారు.
వైసీపీ విజయంతోనే అభివృద్ధి సాధ్యం
పలాస, మార్చి 14: వైసీపీ విజయంతోనే అభివృద్ధి సాధ్యమని వైసీపీ నాయకులు కోట్నీ దుర్గాప్రసాద్, దువ్వాడ శ్రీకాంత్, బల్ల గిరిబాబులు అన్నారు. గురువారం కాశీబుగ్గ మున్సిపాలిటీలోని అంతరకుడ్డ, రాజపురం గ్రామాల్లో పలాస వైసీపీ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలాస ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం పార్లమెంటరీ వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాసరావులు ఎన్నికల బరిలో ఉన్నారని, వారి విజయానికి ఓటర్లుంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గడిచిన ఐదేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని, రామరాజ్యం రావాలన్న అభివృద్ధి చెందాలన్న వైసీపీ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన టీడీపీ పార్టీకి ఓటర్లు ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను గడపగడపకు తీసుకువెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డబ్బీరు భవానీ, బోర బుజ్జి, దుర్గాశంకర్‌పండా, డి.నిరంజన్, బి.శ్రీనివాస్, కె. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.