శ్రీకాకుళం

ప్రజా జీవితంలో నిజం గెలుపు సాధిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్),మార్చి 14: ప్రజా జీవితంలో నిజం గెలుపు సాధిస్తుందని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. అరసవిల్లిలో తన నివాస గృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గంలో 25సంవత్సరాలు అధికారం ఇచ్చారని, తనకు వ్యక్తిగత ఎజెండా లేదని, ఆస్థులు పెంచుకోడానికి అక్రమాలకు పాల్పడలేదని, ప్రజా ఆస్థులను సంరక్షించిన విషయం అందరికి తెలుసునని అన్నారు. ఇదే పంథాలో అధిక శాతం ప్రజానీకం తనతో అడుగులు వేశారని వారందరికి ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలో కొద్ది కాలం అధికార మార్పిడి జరిగిందని, దాని వల్ల భూ ఆక్రమణలు, రౌడీ యిజం పెరిగిన విషయం ప్రజలకు తెల్సునని ఈ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మీదేవి సమస్యలను అధిగమించేందుకు చేసిన ప్రయత్నాలు అందరికి తెల్సిందేనన్నారు. ఇదే విధానం భవిష్యత్‌లో కూడా కట్టుబడి ఉంటామని తెలియజేశారు. అధికార మార్పిడి వల్ల నియోజకవర్గంలో మద్యం సిండికేట్లు, అక్రమ లే అవుట్‌లు, భూకబ్జాల వలన అతికొద్దిమంది ధనవంతులుగా మారారని, ఆ ధనవంతులు ముందుకు వచ్చి రాజకీయ ప్రవేశం కొరకు మొఖమాటం పెడుతున్నారని, ఇందులో భాగమే ఆత్మీయుల కలయిక అని పేర్కొన్నారు. ఆ పవిత్ర బందాన్ని దుర్వినియోగం చేయడాన్ని ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు కోరుకున్న మహిళా సాధికారత కోసమే అందరం ఏకాభిప్రాయంతో లక్ష్మీదేవి వెనుక పనిచేస్తున్నామని, అధిక శాతం మహిళలు, మహిళా సంఘాలు, ఎన్నార్‌ఈజిఎస్ వేతన దారులు సహకరించి మహిళా సాధికారత పరిరక్షించుకోవాలని కోరారు. చట్ట సభల్లో 33శాతం మహిళలకు కేటాయించాలనేదే స్ర్తిల భావన అని అది జరిగేంతవరకు పార్టీలే ముందుకు వచ్చి మహిళలకు టిక్కెట్లు కేటాయించడం పట్ల పార్టీలకు మరింత గౌరవం పెరుగుతుందని తెలియజేశారు.

ఒలింపియాడ్ పరీక్షలో విశాఖ స్కూల్‌కు పతకాలు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 14: ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ మేథమెటిక్స్ 2019లో నిర్వహించిన పోటీ పరీక్షల్లో విశాఖ స్కూల్‌కు చెందిన విద్యార్థులు విజయాన్ని సాధించి పతకాలు కైవసం చేసుకున్నారు. నగంరలోని బ్యాంకర్స్ కాలనీలోగల సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుపబడుతున్న పాఠశాలలో న్యూఢిల్లీ ఆధారిత నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించారు. రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు జరిగిన పోటీ పరీక్షల్లో 15బంగారు, 7వెండి, 7 బ్రాంజ్‌లతో పాటు మొత్తం 36 బహుమతులు సాధించి పాఠశాల పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కె.మధుసూధన్, కరస్పాండెంట్ సుజాత, హెచ్ ఎమ్ పట్నాయిక్‌లు విద్యార్థులను, విజయానికి కారకులైన సిబ్బందిని అభినందించారు.

ప్రశ్నించిన వారిని గెలిపించండి
* తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ బాల సుభ్రహ్మణ్యం
శ్రీకాకుళం(రూరల్), మార్చి 14: ప్రశ్నించేవారిని గెలిపించాలని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపుబాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. యుటీ ఎఫ్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్టీయు, ఏపీ టి ఎఫ్, యుటీ ఎఫ్ పలు ఉపాధ్యాయ సంఘాలు బలపర్చిన పాకలపాటి రఘువర్మను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ప్రొగ్రెస్సీవ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా మేధావి వర్గానికి చెందిన వారంతా రఘువర్మను గెలిపించాలని కోరారు. ఈనెల 22న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 15సంఘాలు బలపరుస్తున్న రఘువర్మను గెలిపించాలని కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిగా ఉండాలన్నారు. సిపి ఎస్ మీద పోరాటం చేసే వ్యకి అని అన్నారు. ఎవరినైనా నిలదీస్తామని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిలదీసే మాట్లాడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈసమావేశంలో ఎస్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.నాగేశ్వరరావు, రాష్ట్ర సహా అధ్యక్షులు కె.సన్యాసిరావు, యుటీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు, ఏపీటి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పల బానుమూర్తి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతల దుర్గారావు, ఆర్.జగదీష్‌బాబు, ఎస్‌వి రమణమూర్తి యుటీ ఎఫ్ జిల్లా కార్యదర్శి రెడ్డి మోహనరావు, ఎస్టీయు నాయకులు పేడాడ ప్రభాకరరావు, ఎస్.శ్రీనివాసపట్నాయిక్, జి.రమణ, సి.హెచ్ అత్యుతరావు, చావల శ్రీనివాస్, రాము తదితరులు పాల్గొన్నారు.