శ్రీకాకుళం

లక్ష కొత్త ఓట్లు చేరిక!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 14: తొంభై రోజులు..లక్ష మంది కొత్తగా ఓటర్లు నమోదు. ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తి..ఇంకా కొత్త ఓటర్లు నమోదు కోసం దరఖాస్తులు చివరి 24 గంటలు మాత్రమే సమయం ఉందంటూ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జనార్థన్ నివాస్ తెలిపారు. జిల్లాలో ఓటరు అవగాహన (సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్, ఎన్రోల్‌మెంటు ప్రోగాం - స్వీప్) ఎన్నికల నిర్వాహణపై గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన వివరించారు. స్వీప్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు నేతృత్వంలో పెద్దఎత్తున జిల్లాలో చేపట్టడం జరిగిందన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమాలకు బృందాలను ఏర్పాటు చేసామని, రంగవల్లులు, ర్యాలీలు, ఫెక్సీలు తదితర కార్యక్రమాలను చేపట్టామని తద్వారా ఓటుపై అవగాహన పెరిగిందని అన్నారు. 2019 జనవరి 1వ తేదీ నుంచి మార్చి 14 వరకూ దాదాపు లక్షమంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. బుధ, గురువారాలు రెండు రోజుల్లో 4,340 మది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. భారీగా ధరఖాస్తులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్త ఓటర్లుగా నమోదుకు శుక్రవారం చివరి రోజుని జిల్లా ఎన్నికల అధికారి సుస్పష్టం చేసారు. ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ జరుగుతోందని బుధవారం వరకూ జనరేట్ అయిన గుర్తింపు కార్డులు డౌన్‌లోడ్ చేసామని చెప్పారు. జిల్లాలో 28,25,362 మంది జనాభా ఉంటారని అంచాన ఉండగా అందులో 20,64,330 మంది ఓటర్లుగా నమోదు అయ్యారని తెలిపారు. ఓటు సమాచారాన్ని 1950 నెంబరుకు ఫోన్ చేసి పేరు, తండ్రి పేరు తెలియజేయడం ద్వారా వివరాలు పొందవచ్చని చెప్పారు. దివ్యాంగులకు ఇబ్బందులు కలుగకుండా ర్యాంపులు నిర్మ్చిమని, ద్విచక్ర వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అంధత్వ కలిగిన వారు బ్రెయిలీ లిపి ద్వారా ఓటును గుర్తించేందుక, సహాయకుని ద్వారా ఓటు వేయుటకు అవకాశం ఉందని అన్నారు. మహిళలు, యువత, దివ్యాంగులు తదితర అన్ని వర్గాల వారు ఓటు హక్కును వినియోగించుటలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలనది ఉద్దేశ్యమని వివరించారు. వివిప్యాట్ పై ఓటర్లులో అవగాహన పెద్దఎత్తున కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు ఓటరు రశీదులు అందజేస్తామని చెప్పారు.
ఎం.సి.సి. ఉల్లంఘనలపై కేసులు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి అన్నారు. అన్ని మండలాల్లో మండల అభివృద్ధి అధికారి నేతృత్వంలో ఎం.సి.సి. బృందాలను నియమించామని చెప్పారు. ఫ్లైయింగ్ స్క్వాడ్స్, సర్వీలియన్స్ టీమ్స్ పర్యవేక్షింస్తున్నాయని చెప్పారు. బృందాలు అన్నింటికి వాసభాలు సమకూర్చామని చెప్పారు. సివిజిల్ యాప్ ద్వారా సామాన్య ప్రచానీకం సైతం ఉల్లంఘనల ఫిర్యాదులను చేయవచ్చని పేర్కొన్నారు. సివిజిల్లో ఫిర్యాదులు చేయుటకు నియోజకవర్గానికి ఐదు ఋమందాలను నియమించామని చెప్పారు. జిల్లాలో 12 ఫిర్యాదులు సివిజిల్ ద్వారా ఇప్పటికి అందగా 75 శాతం పరిష్కరించామని తెలిపారు. నియమావళి ఉల్లంఘనలలో భాగంగా నాలుగు కేసులు బుక్ చేసామని, రూ. 14 లక్షలు సీజ్ చేసామని చెప్పారు. ఐడి లిక్కర్ ఆరు వేల లీటర్లు పట్టుకోవడం జరిగిందన్నారు. మన జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఒడిషా రాష్ట్రంలోని గజపతి, గంజాం జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించామని అన్నారు. ఆయా జిల్లాల అధికారులతో కలిసి సంయుక్త బృందాలు నిఘా పెట్టనున్నాయని చెప్పారు. ఇప్పటికే గజపతి, గంజాం జిల్లాల అధికారులతో కలిసి సంయుక్త బృందాలు దాడులు నిర్వహించాయని పేర్కొన్నారు. రవాణా వాహనాలపై నిఘా ఉందని నగదు, మద్యం, సారాయి తదితర సామగ్రి రవాణాలను తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

శాంతిభద్రతలు - బందోబస్తు
ఎన్నికల సజావుగా ప్రశాంతంగా జరుగుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జల్లి ఎన్నికల అధికారి జనార్థన్ నివాస్ తెలిపారు. అందుకు తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సి.ఆర్.పి.ఎఫ్.బలగాలు జిల్లాకు రానున్యాని చెప్పారు. త్వరలో నాలుగు కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఏడు వందల ప్రదేశాల్లో వెయ్యి పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా, మూడు గ్రామాలు తగాదాలకు ఆస్కారం ఉన్న గ్రామాలుగా పరిగణిస్తున్నామని చెప్పారు. శాసనమండలి ఎన్నికలకు ఏర్పాటు పూర్తి చేసామని తెలిపారు. పోలింగు అధికారులకు ఉత్తర్వులు అందజేసామని చెప్పారు. మొదటి స్థాయి శిక్షణ పూర్తి చేసామని, రెండవ స్థాయి శిక్షణ త్వరలో నిర్వహిస్తామని అన్నారు. బ్యాలెట్ బాక్సులు జిల్లాకు వచ్చాయని చెప్పారు. 22వ తేదీన పోలింగ్ అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారులు విశాఖపట్నంలోగల కౌంటింగ్ స్ట్రాంగు రూమ్‌ల వద్ద బ్యాలెట్ బాక్సులు అందిస్తారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో డీఆర్వో కె.నరేంద్రప్రసాద్. ఎం.సి.సి. అధికారి ఎం.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.