శ్రీకాకుళం

ఎన్నికలకు సర్వం సన్నద్ధం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 9: అన్ని ఏర్పాట్లతో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జనార్థన్ నివాస్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. జిల్లా యంత్రాంగం సుమారు నెలరోజుల నుంచి ఎన్నికల ఏర్పాట్లపై ప్రణాళికలను రూపొందించడంలో నిమగ్నమైనదని తెలిపారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు ఇ.వి.ఎం.లు చేర్చడం జరిగిందన్నారు. బుధవారం అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలోను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రీసైడంగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడంగ్ అధికారులతో కలిపి సుమారు 19 వేల మంది ఎన్నికలలో విధులు నిర్వహించనున్నారని, వారికి రవాణా నిమిత్తం 853 బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వారి భద్రతకు 2500 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వారి భద్రతకు 2500 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసామని తెలిపారు. 1855 వెబ్‌కెమోరాలను, 520 మంది వీడియోగ్రాఫర్లను, 456 మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని చెప్పారు. జిల్లా స్థాయిలోను, రిటర్నింగ్ అధికారి స్థాయిలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరచడానికి శివానీ కాలేజీలో రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 స్ట్రాంగ్ రూమ్‌లలో వాటిని భద్రపరచడం జరుగుతుందని అన్నారు. కొత్త ఓటర్ల నమోదు ప్రతీ ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవడం, ఈవీఎంలు, వివిపేడ్‌ల ద్వారా ఓటు వేసుకునే విధానం స్వీప్ కార్యక్రమం ద్వారా అనేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. రంగోలీ, క్విజ్ పోటీలు, బెలూన్లను ఎగరవేయడం, ర్యాలీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేటిటనట్టు తెలిపారు. గ్రామగ్రామాన అవగాహనా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. స్వీప్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సుమారు లక్షమంది నూతన ఓటర్లు నమోదు అయ్యారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలోని ఓటర్లకు ఓటింగ్ నిమిత్తం రవాణా సౌకర్యాలను కలిగిస్తున్నామని, పోలింగ్ కేంద్రాలలో విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం 623 ఆటోలు, 1023 వీల్‌చైర్లను, ర్యాంపులను ఏర్పాటు చేసామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లను, 320 లీటర్ల ఓటు హక్కును వినియోగించుకోవాలని శతశాతం ఓటింగ్ జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.