శ్రీకాకుళం

16 నుంచి ఈసెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 10: ఈ విద్యా సంవత్సరంలో డిప్లమో పూర్తిచేసిన అభ్యర్థులు రెండో సంవత్సరం ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ అభ్యర్థులకు 16నుంచి వెబ్‌కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ విఎస్ దత్తు స్పష్టంచేశారు. 16న 7వేలు ర్యాంకు సాధించిన అభ్యర్థులకు, 17న 14వేలు, 18న 21వేలు, 19న 28వేలు, 20న చివరి ర్యాంకు వరకు సాధించిన అభ్యర్థులకు ఈ కౌనె్సలింగ్ కొనసాగిస్తామన్నారు. 17నుంచి వెబ్ ఆప్షన్ అభ్యర్థులు ఇచ్చుకోవాల్సి ఉంటుందని సూచించారు.
డిప్లమోలో ఓసీ, బీసీలకు 45శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40శాతం ఉత్తీర్ణత తప్పనిసరి అన్నారు. 23న సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందన్న విషయాన్నిఅభ్యర్థులు గమనించాలన్నారు. కౌనె్సలింగ్‌కు హాజరైన అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణత సర్ట్ఫికేట్‌తోపాటు 4వ తరగతి నుంచి డిప్లమో వరకుస్టడీ సర్ట్ఫికేట్‌లతో హాజరు కావాలని సూచించారు. ఓసీ, బీసీలకు రూ.1000, ఎస్సీ ఎస్టీలు రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.