శ్రీకాకుళం

అంగన్వాడీ ఫలితాలు ప్రకటించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, ఏప్రిల్ 7: కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ, ఆయాల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించి 50 రోజులు పూర్తవ్వుతున్నప్పటికీ నేటికీ అధికారులు ఫలితాలు ప్రకటించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎంతో ఆశగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూలో హాజరైన అభ్యర్థుల ఫలితాలు ప్రకటించకపోవడంతో ఆ అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. స్థానిక సమగ్రశిశు అభివృద్ధి పథకం ప్రాజెక్ట్ పరిదిలో బింగుపేట కార్యకర్తతోపాటు పొందూరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాలకు చెందిన 19 మంది పోస్టులకు ఫిబ్రవరి 23న శ్రీకాకుళం ఆర్డీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. ఇప్పటికైనా ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. సిడిపివో రాధామాదవి వద్ద ప్రస్తావించగా ఫలితాలు వచ్చిన వెంటనే అభ్యర్థులకు బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు.