శ్రీకాకుళం

రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు చర్యలు: విప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, జూన్ 16: మండలంలోగల తాళ్లవలస గ్రామం వద్ద బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విప్ రవికుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం ఇక్కడ రూ.1.25కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూరిబా పాఠశాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి ప్రధాన రెసిడెన్షియల్ పాఠశాలకు సుమారు 1500 మంది విద్యార్థులకు చదువుకునేందుకు వీలు కల్పిస్తూ నియోజకవర్గానికి ప్రధాన రెసిడెన్షి యల్ పాఠశాలగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీంతోపాటు సుమారు 530మంది కుటుంబాలకు గృహ నిర్మాణ సముదాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ మరో 1000కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిపాదనలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక్కడ మినీ స్టేడియంలో మరో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు చేశానని దీంతో పాటు మరో 30 ఎకరాల స్థలంలో భవిష్యత్‌లో ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి కూడా తనకు ఆలోచన ఉన్నట్టు విప్ రవికుమార్ తెలిపారు. మహిళలకు విద్య ద్వారానే ఉద్యోగ భద్రత లభిస్తుందన్నారు.
శతశాతం ఫలితాలను సాధిస్తేనే సభ్యులకు ఉద్యోగ భద్రత
కస్తూరిబా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు శతశాతం ఫలితాలు విద్యార్థులు సాధిస్తేనే భవిష్యత్‌లో ఉంటుందని రవికుమార్ హెచ్చరించారు. వీరితోపాటు కాంట్రాక్టర్ ఉద్యోగులందరినీ ఫలితాల ఆధారంగా వీరిని రెగ్యూలర్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, ఎంపిపి తమ్మినేని భారతమ్మ, మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత, ఆర్‌విఎంఇఇ సుగుణాకర్, డిఇ వెంకటరావు, కాంట్రాక్టర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.