శ్రీకాకుళం

20న ఏరువాక పౌర్ణమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 16: జిల్లాలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఈనెల 20న నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్సవంగా నిర్వహించేందుకు నిర్ణయించిందన్నారు. ఏరువాక పౌర్ణమి కార్యక్రమ నిర్వహణపై గురువారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు.
ఇందుకు తగిన ఏర్పాట్లను చేపట్టాలని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఏరువాక పౌర్ణమి రైతులకు ఎంతో శుభకరమైన రోజు అని ఆ రోజున వ్యవసాయం పైన రైతుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి అధిక దిగుబడుల సాధించడం పైన ఇతర సాంకేతిక విధానాలు వినియోగించుకోవడం పైన చర్యలు చేపట్టాలన్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నందున వ్యవసాయానికి ముందుగానే రైతులను సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని ప్రదర్శనాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పశు సంవర్థక, మత్స్య, ఉద్యానవన శాఖలు, సెరీ కల్చర్, ఏ పి సీడ్స్, ఏ పి ఎంఐపి తదితర శాఖలు తమ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. భూ ఆరోగ్య కార్డులు, పంట సాగు ధ్రువీకరణ పత్రాలు, రుణ అర్హత కార్డులు, సూక్ష్మపోషకాలు, విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు తదితర పరికరాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలన్నారు. దీంతోపాటు సేంద్రియ వ్యవసాయ విధానం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. విత్తనాల పరిరక్షణ, భూసార పరీక్షలు క్రిమి సంహారక మందుల ఉపయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయ విధానాలు తదితర అంశాలపై శాస్తవ్రేత్తలు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వ పరంగా రైతులకు అందిస్తున్న పథకాలను అధికారులు వివరించాలన్నారు. చంద్రన్న రైతు క్షేత్రాలు, పొలం బడి, వ్యవసాయంలో సాంకేతిక వినియోగం, ఇ క్రాఫింగ్, నీటి సంరక్షణ తదితర అంశాలను వివరంగా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి వివేక్‌యాదవ్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జి.రామారావు, ఆత్మప్రాజెక్టుడైరెక్టర్ పి.ప్రమీల, పశు సంవర్థక శాఖ జెడి వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ డిడి ఏంఏ యాకూబ్‌భాష, ఏపిఎంఐపి పిడి జివి ఎస్ ప్రకాశ్‌రావు, ఉద్యానవన శాఖ ఏడి రహామ్, సెరీ కల్చర్ ఏడి సత్యారావు, డివిజనల్ అటవీ అధికారి లోహితాసురుడు, డిపివో బి.కోటేశ్వరరావు, వ్యవసాయశాస్తవ్రేత్త డాక్టర్ చిన్నంనాయుడు, మార్కెటింగ్ ఏడి వై.శ్యామ్‌కుమార్, జల వనరుల శాఖ ఉపకార్యనిర్వాహఖ ఇంజినీరు తదితరులు పాల్గొన్నారు.