శ్రీకాకుళం

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), జూన్ 16: భక్తితత్వం పెంపొందించుకుంటే మానసిక ప్రశాంతత పొందడం సులభతరమని ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. జ్యేష్ఠశుద్ధ ఏకాదశి సందర్భంగా స్థానిక బ్యాంకర్స్ కాలనీలోని శివబాలాజీ దేవాలయంలో సప్తమవార్షికోత్సవం పురస్కరించుకొని గురువారం నిర్వహించిన వార్షిక కల్యాణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక జీవన విధానం మానవునిలో మార్పునకు, మంచి నడవడికి దోహదపడుతుందన్నారు. నేతేటి మారుతిశర్మ, గోపీ నంబాళ్ల సీతారామాచార్యుల ఆధ్వర్యంలో తొలుత అమరనాథేశ్వర, ఉమాదేవి అమ్మవార్ల కల్యాణం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు. శివ, గోవిందనామస్మరణతో ఆలయం మారుమోగింది. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జెడ్పి చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మిలతోపాటు ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జి.తులసీరావు, మహేష్‌చంద్ర సామంత తదితరులు పాల్గొన్నారు. స్థానిక చిన్నబజారు రోడ్డులోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం అలివేలుమంగ పద్మావతి సమేత వెంకేటేశ్వరస్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు, జగన్నాథాచార్యుల పర్యవేక్షణలో విశాఖపట్నం నుంచి వచ్చిన అర్చక బృందం పాంచరాత్రాగమ అనుసారం శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలనడుమ అశేష భక్తజన గోవిందనామస్మరణతో కల్యాణం ఘనంగా జరిగింది. కల్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. స్థానిక గుడివీధిలో ఉన్న ఉమారుద్రకోటేశ్వరస్వామివారి దేవస్థానంలో గురువారం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నందివాహనంపై ఉత్సవ మూర్తులను కొలువుతీర్చి ఆరవెల్లి హరగోపాలశర్మ, ఆరవెల్లి రాంజీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. ఆలయ పాలకమండలి సభ్యులతోపాటు భక్తులు పాల్గొన్నారు. కొన్నావీధిలో వెలసిన భీమేశ్వరాలయంలోనూ శివపార్వతుల కల్యాణం జరిగింది.