శ్రీకాకుళం

కమిషన్ వద్దకు పూర్తి సమాచారంతో రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 16: సమాచార హక్కు చట్టం కమిషనర్ ముందు హాజరయినప్పుడు పౌర సమాచార అధికారులు పూర్తి సమాచారంతో హాజరవ్వాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టంకమిషనర్ తాంతియాకుమారి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్టిఐ కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాచారం అడిగిన ప్రతీ ఒక్కరికీ పిఐవోలు శతశాతం సమాచారం అందించాలన్నారు. దరఖాస్తుదారులు అధికారులు పనిచేసే సమయాన్నివృధా చేయకుండా ప్రజా ప్రయోజనం కోసం సమాచారం అడగాలన్నారు. గురువారం నిర్వహించిన ఆర్‌టిఐ కోర్టులో 25 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. ఆలస్యం జరగకుండా వారందరికీ పది రోజుల్లో సమాచారాన్ని అందించాలని పిఐవోలను ఆదేశించినట్టు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు 8వేల కేసులు పరిష్కరించామన్నారు. ఇంకా 1300 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని 300మందికి సోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. అధికారులు నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వనందున కేసులు పెండింగ్ ఏర్పడుతున్నట్టు తెలిపారు. అధికారులు సమయాన్ని వృథా చేయకుండా జిల్లాకు వచ్చిన కేసులు పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. సమాచార హక్కు చట్టంపై ఇంకా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.