శ్రీకాకుళం

బద్రిలో పెద్దఎత్తున ఆక్రమణల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, జూన్ 23: మండలంలోని పంచాయతీ కేంద్రమైన బద్రి గ్రామంలో పోలీసు బందోబస్తుతో రెవెన్యూ అధికారులు గురువారం పెద్ద ఎత్తున ఆక్రమణలను తొలగించారు. ఈ స్థలంలో అంగన్‌వాడీ కేంద్రంతో పాటు ఎ.ఎన్.ఎం. సబ్ సెంటర్ భవనం నిర్మాణానికి వీలుగా ఐ.టి.డి.ఎ. ఇంజనీర్లకు తహశీల్దారు జామి ఈశ్వరమ్మ అవసరమైన స్థలాన్ని అప్పగించారు. ఈ గ్రామంలో రూ.20లక్షలు అంచనాలతో అంగన్‌వాడీ కేంద్రంతో పాటు ఎ.ఎన్.ఎం. సబ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు ఉత్తర్వులు జారీ చేయగా టెండర్లు ఖరారు అనంతరం గుత్తేదారుడు నిర్మాణానికి తగిన స్థలం లేనందున నిర్మాణ ప్రక్రియను ప్రారంభించలేదు. ఈ గ్రామంలో ఇతర స్థలాలు అందుబాటులో లేనందున గతంలో బలహీన వర్గాలకు గృహ సముదాయం నిర్మించేందుకు వీలుగా కొంత మంది రైతుల నుండి అప్పటి ప్రభుత్వం స్థలాలను కొనుగోలు చేసింది. ఇందులో సామాజిక అవసరాలు కోసం 44 సెంట్లు స్థలాన్ని అప్పటి అధికారులు కేటాయించారు. కాలక్రమేణా ఈ స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకొని తదుపరి కాలంలో అనధికార క్రయవిక్రయాలు జరిపారు.
ప్రస్తుతం ఈ స్థలంలో పది మంది ఆక్రమణదారులు పురిపాకలు, గడ్డికుప్పలు, నిర్మాణం పనులు చేపట్టారు. జిల్లా అధికారుల ఆదేశాలు మేరకు ఎ.ఎన్.ఎం., అంగన్‌వాడీ భవన నిర్మాణాలతో పాటు పోస్ట్ఫాసు భవన నిర్మాణానికి 5సెంట్లు కేటాయించాలని స్థానిక అధికారులు నిర్ణయించారు. ఆక్రమణలు తొలగించి స్థలాలను అప్పగించాలని ఆక్రమణదారులకు కొంత సమయం ఇచ్చి నోటీసులు జారీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలు తొలగించడానికి రెవెన్యూ సిబ్బంది ముందుగా దండోరా వేయించి గురువారం ఈ స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆక్రమణదారులు తహశీల్దారు ఈశ్వరమ్మతో సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఆక్రమణలు తొలగించడం అనివార్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దుర్గాప్రసాద్, పోలీసులు, రెవెన్యూ పరిశీలకుడు నారాయణరావు, దాసు, వి.ఆర్.ఓ. నాగేశ్వరరావుతో పాటు సారవకోట, గొఱ్ఱెబంద, కొత్తూరు, తొగిరి వి.ఆర్.ఓ.లు బాలక్రిష్ణ, లక్ష్మీనారాయణ, ఈశ్వరరావు, గజపతినారాయణ, సర్వేయర్ కె. నారాయణరావు, తలయారీలు ఉన్నారు.