శ్రీకాకుళం

అన్నదాతకు.. ఖరీఫ్ సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 1: జిల్లాలో ఖరీఫ్ రుణాలను సెప్టెంబర్ 30 నాటికి రైతులకు అందించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఇక్కడ జెడ్పీ సమావేశమందిరంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి సమీక్షాకమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ఏడాది నిర్ధేశించిన ఖరీఫ్ రుణాలల లక్ష్యం కంటే ఈ సంవత్సరం రెట్టింపు చేయాలని సూచించారు. స్కేలాప్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు రైతులకు మంజూరు చేయాలని ఆదేశించారు. బి.సి.కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్‌లకు రుణాలు మంజూరు కొరకు టార్గెట్ నిర్దేశించిన విధంగా అన్ని బ్యాంకులకు ఖరీఫ్ రుణాలకు లక్ష్యం నిర్దేశించాలని నాబార్డు ఎ.జి.ఎం.కు మంత్రి ఆదేశించారు. సంతబొమ్మాళి, కొత్తపల్లి బ్రాంచి మేనేజర్లు ప్రవర్తన బాగులేదని, బ్రాంచి మేనేజర్లు సత్‌ప్రవర్తన కలిగి వృత్త్ధిర్మాన్ని నెరవేర్చాలని చెప్పారు. రుణాలు మంజూరు విషయంలో రైతుతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చాలా ఫిర్యాదులు తన దృష్టికి వచ్చినట్టు తెలిపారు. నియోజికవర్గాలవారీగా బ్రాంచి మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, మండల అభివృద్ధి అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, ఎం.పి.టి.సి., జెడ్‌పిటిసి సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఖరీఫ్‌లోను మంజూరు కొరకు బ్యాంకు అధికాలకు తగు సూచనలు జారీ చేయాలని చెప్పారు. ప్రధాన మంత్రి సఫల్ బీమా అర్హత కలిగిన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. ఈ జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తు.చ.తప్పకుండా అధికారులు పాటించాలని ఆదేశించారు. స్వయం సహాయక గ్రూపులకు రుణాలు మంజూరు చేసినప్పుడు రుణమేళాను ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులను ఆదేశించారు.
ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ స్వయం సంహాయక సంఘాల సభ్యులకు బ్యాంకులు ఇచ్చిన రుణానికి 12 శాతం వడ్డీ వసూలు చేస్తున్నప్పటికీ, వారు బ్యాంకులో పొదుపు చేసిన సొమ్మునకు మాత్రం వడ్డీ చెల్లించడం లేదని, దీనివల్ల మహిళా సంఘాలకు నష్టం జరుగుతుందని తెలిపారు. బి.సి.కార్పొరేషన్, ఐ.టి.డి.ఎ.లు ద్వారా మంజూరు చేస్తున్న ట్రైకార్ రుణాలు విషయంలో బ్యాంకు అధికారులు సహకరించాలని కోరారు. పంటరుణాలకు చెల్లించాల్సిన నాలుగు శాతం బీమాలో రెండు శాతం ప్రభుత్వం చెల్లిస్తున్నట్టు రైతులకు తెలియజేయాలని విప్ అధికారులను సూచించారు. కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ ఈ ఏడాది మంజూరు చేసిన ఖరీఫ్ రుణాలకు బీమా వర్తింపు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. పంటరుణాలు మంజూరులో బ్యాంకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, గత ఏడాది మంజూరు చేసిన రుణాలు వసూలు కాకుండా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ రుణాలు రూ.1125 కోట్టు లక్ష్యంకాగా, ఈ ఏడాది రూ. 1375 కోట్టు లక్ష్యాన్ని నిర్దేశించినట్టు తెలిపారు. ఇప్పటివరకూ రూ. 500 కోట్టు మంజూరు చేసినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో ఖాతాదారులు సౌకర్యార్థం బ్యాంకులు మొబైల్ ఎ.టి.ఎం.లు పెట్టినట్టయితే మంచి సర్వీసును అందించగలరని సూచించారు.
ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్‌నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, గౌతు శ్యామసుందరశివాజీ, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, రిజర్వుబ్యాంకు ఎ.జి.ఎం. కె.బాలసుబ్రహ్మణ్యం, నాబార్డు ఎ.జి.ఎం. ఎం.డి.వాసుదేవన్, లీడ్‌బ్యాంకు మేనేజర్ పి.వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు.